అన్వేషించండి

Pandagante Itta Undala Promo: సంక్రాంతి సంబరాల్లో ‘సలార్’ టీమ్, పాటలతో జీవితాను ఆటపట్టించిన రాజశేఖర్

Pandagante Itta Undala Promo: సంక్రాంతి స్పెషల్‌గా జీ తెలుగు.. ఒకటి కాదు రెండు స్పెషల్ ప్రోగ్రామ్స్‌ను టెలికాస్ట్ చేయడానికి సిద్ధమయ్యింది. ఈ రెండిటికి సంబంధించిన ఫన్ ప్రోమోలు విడుదలయ్యాయి.

Sankranthi Special Programs: పండగలు వచ్చాయంటే చాలు.. ఆ సరదా అంతా బుల్లితెరపైనే కనిపిస్తుంది. బుల్లితెర నటీనటులంతా కలిసి వారు పండగను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేక్షకులకు అందించే వినోదం అంతా ఇంతా కాదు. ఇక ఈసారి కూడా సంక్రాంతి పండగ కోసం జీ తెలుగు అలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేసింది. భోగినాడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను, సంక్రాంతి రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌ను టెలికాస్ట్ చేయనుంది. ఈ రెండిటికి సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. 'పండగంటే ఇట్టా వుండాల’, ‘బావ మరదళ్ల సరదా సంక్రాంతి' పేర్లతో ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్.. జనవరి 14, 15 తేదీలలో సాయంత్రం 06:00, ఉదయం 10:00 గంటలకు టెలికాస్ట్‌కు సిద్దమయ్యాయి.

స్కిట్‌తో ఎమోషనల్..

ముందుగా సంక్రాంతి స్పెషల్ ‘పండగంటే ఇట్టా వుండాల’ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, జీవితా స్పెషల్ గెస్టులుగా పాల్గొన్నారు. వారిద్దరిలో ఎవరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు అని రవి ప్రశ్నించగా.. తానే ఎక్కువగా ప్రేమిస్తున్నానని రాజశేఖర్ అన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలతో కాస్త ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో జీవిత కోసం రాజశేఖర్ ‘మొదటిసారి ముద్దుపెడితే ఎలా ఉంటది’ పాట పాడారు. ఆపై వారిద్దరూ కలిసి స్టెప్పులు కూడా వేశారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో ఫన్-టాస్టిక్ అవార్డులు, అంత్యాక్షరి సెగ్మెంట్ కూడా ఆకట్టుకోనుంది. ఆ తర్వాత డ్రామా జూనియర్ కిడ్స్ రాజశేఖర్, జీవితలకు అంకితమిస్తూ చేసిన స్కిట్ అందరినీ ఎమోషనల్ చేసే విధంగా ఉంటుంది. 

స్పెషల్ ప్రోగ్రామ్‌లో ‘సలార్’ ఆర్టిస్టులు..
బుల్లితెరపై మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు సంఖ్యలో 500 రకాల ఆహార పదార్థాలతో అతిపెద్ద థాలీని ఈ కార్యక్రమం కోసం తయారుచేశారు. రకరకాల ప్రాంతాలకు చెందిన స్వీట్లు, పిండి వంటలు, పచ్చళ్లు, పొడులు, కూరలు.. ఇలా 500 రకాల వైవిధ్యమైన ఆహారపదార్థాలను ప్రత్యేక నైపుణ్యం గల పాకశాస్త్ర నిపుణులతో చేయించి నోరూరించేలా అతిపెద్ద థాలీని వడ్డించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటారు. రెండో రోజు ‘బావ మరదళ్ల సరదా సంక్రాంతి’ పేరుతో మరో కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్యామల, సౌమ్య యాంకర్‌లుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌లో బుల్లితెర నటీనటులతో పాటు రాశి, ఆమని, సుమన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్‌గా ‘సలార్’ సినిమాలో దేవ, వరధ పాత్రల్లో నటించిన చైల్ట్ ఆర్టిస్టులు వచ్చారు. వారితో కలిసి సౌమ్య కాసేపు కామెడీ చేసింది. 

భోగి పండ్ల వేడుక..

ఈ సంక్రాంతి వేడుకలో ‘హనుమాన్’ మూవీ టీమ్ కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించనుంది. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్న అభయ్, అక్కీలతో భోగి పండ్ల వేడుకను చేశారు. ఇక ఆ సీరియల్ హీరోయిన్ కూడా వారి నటనపై ప్రశంసలు కురిపించింది. ‘బావ మరదళ్ల సరదా సంక్రాంతి’ కార్యక్రమంలో హీరోయిన్లు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారి కో స్టార్ల కోసం ప్రత్యేకంగా పాటలు పాడారు. అందులో ఒక నటి అయితే.. తన కో స్టార్‌లో భర్తను చూసుకున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చి తనకోసం పాట కూడా పాడింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Telugu (@zeetelugu)

Also Read: బుల్లితెరపై నాగార్జున సంక్రాంతి సందడి - బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో అక్కినేని ఆట అదుర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget