Illu Illalu Pillalu Serial August 18th to 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వీక్లీ: వల్లీ బాగోతం తెలిసిందా! ప్రేమ నర్మదని అసహ్యించుకోవడానికి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial August 18th to 23rd Recap వల్లి పుట్టింటి బాగోతం నర్మద, ప్రేమ తెలుసుకొని రామరాజుతో చెప్పారా.. లేదా.. ప్రేమ, నర్మద మధ్య గొడవ జరగడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial August 18th to 23rd Weekly Episode ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ వారం పీక్స్‌లో సాగింది. శ్రీవల్లి పుట్టింటి గుట్టు తెలుసుకున్న నర్మద, ప్రేమలు రామరాజు ముందు ఆ బండారం మొత్తం బయట పెట్టి భాగ్యానికి భజన అయ్యేలా చేసేస్తారు. వల్లిని ఇంటి నుంచి గెంటేస్తారు అన్నేలా ఎపిసోడ్స్ సాగాయి. అయితే చివరి నిమిషంలో భాగ్యం అద్భుతమైన నటనతో నర్మదని చిత్తు చేసేసింది. దెబ్బకి నర్మద, ప్రేమలు జుట్టులు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వచ్చేశారు. వారం మొత్తం జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
వల్లి పుట్టింటి గుట్టు రట్టు చేయడానికి నర్మద వరలక్ష్మీ వ్రతం మొదటి వారంలోనే చేసేలా అత్తామామల్ని ఒప్పిస్తుంది. అయితే పెత్తనం కోసం పోట్లాడుతున్న శ్రీవల్లి తన భర్తతో కలిసి వ్రతం చేస్తానని అంటుంది. నర్మద, ప్రేమలు గొడవ పెట్టుకుంటారని వేదవతి టెన్షన్ అయిపోతుంది కానీ వల్లీ నగల బాగోతం బయట పెట్టడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకొని నర్మద, ప్రేమలు వల్లి వత్రం చేయడానికి ఒప్పుకుంటారు. నర్మద, ప్రేమలు వల్లీ దగ్గరకు వెళ్లి నువ్వు వ్రతం చేస్తా అంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అక్క అసలే నువ్వు ఇంటికి పె...ద్ద కోడలివి కదా నువ్వే వ్రతం చేయ్ అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. భాగ్యం మనసులో నట్టింట్లో రణరంగం అవుతుంది అనుకుంటే వీళ్లేంటి ఇలా షాక్ ఇచ్చారు అనుకుంటుంది. ఇక వ్రతం చేస్తావు కదా నగలు అమ్మవారి దగ్గర పెట్టాలి తీసుకురా అని నర్మద అనే సరికి తల్లీకూతుళ్లకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వల్లి నగలు తెస్తానని గదిలోకి వెళ్లి నా జీవితం అయిపోయింది నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం అమ్మా అని తల్లిని తిట్టి ఏడుస్తుంది. నగల విషయం బయట పెట్టాలని ఆ నర్మద, ప్రేమలు ఇలా ప్లాన్ చేశారు. ఇద్దరూ తెలివిగా ప్లాన్ చేసి నా దగ్గర తాళాలు ఇచ్చేలా చేశారు. మీరు అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పి నా కాపురం నిప్పుల మీదకు నెట్టేశారు అని తల బాదుకొని ఏడుస్తుంది.
వల్లి పని అవుట్ అనే టైంకి నగలు తీసుకు రాకుండా ఓ కలశం పట్టుకొని వల్లి ఎంట్రీ ఇస్తుంది. తరతరాలుగా వస్తున్న తన పుట్టింటి కలశం అని అందులోనే నగలు పెట్టేశాని కలశంలో ఎవరి చేయి వెళ్లకుండా మూతి కొట్టేసి తీసి కొచ్చి అందరి ముందు పెడుతుంది. అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఆ కలశంలో నగలు తీయడానికి తెగ ప్రయత్నిస్తారు. చివరకు తిరుపతి చేయి ఆ కలశంలో ఇరుక్కుంటుంది. మొత్తానికి నగల టెన్షన్ నుంచి వల్లి, భాగ్యం తప్పించుకుంటారు. ఇక భాగ్యం, ఇడ్లీ బాబాయ్ రామరాజు ఇంట్లో ఉంటే నర్మదతో ప్రాబ్లమ్ అని తప్పించుకోవాలని తెగ ప్రయత్నించి నర్మద, ప్రేమలకు దొరికపోతారు. చివరకు నర్మద ఇడ్లీ బాబాయ్ ఫోన్‌లో లొకేషన్ ఆన్ వాట్సాప్‌కి పంపుకుంటుంది. నర్మద, ప్రేమ ఇద్దరూ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ అడ్రస్ కనిపెట్టేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్‌లు ఉన్నాయి, బిల్డింగ్‌లు ఉన్నాయని మామయాటలు చెప్తారా.. మామయ్యని మోసం చేసి చందు బావతో వల్లిని పెళ్లి చేస్తారా.. మీ పాపం పండింది ఇప్పుడే వెళ్లి మా మామయ్య గారిని తీసుకొస్తానని ఇద్దరూ వెళ్తారు. ఆనంద్ రావు తల బాదుకొని ఏడుస్తాడు.
రామరాజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నర్మద, ప్రేమలు వెళ్లి చెప్పబోయే టైంకి వల్లి అడ్డుకొని పక్కకు తీసుకొని వెళ్లి నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది.. మా ఇంటికి వెళ్లడానికి మీరు ఎవరు అని ప్రశ్నిస్తుంది. దానికి ప్రేమ మీరు కోటీశ్వరులు అని నువ్వు చదువుల తల్లి సరస్వతివి అని మీ అంత గొప్ప కుటుంబం లేదని మోసాల మీద మోసాలు చేసి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి మా చందు బావని మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్ అని తిడుతుంది. ఇక వల్లి అయితే మీరు నిజం చెప్తే మామయ్య గుండె ఆగిపోతుందని చెప్పినా ప్రేమ ఊరుకోదు.. మమల్నే బ్లాక్ మెయిల్ చేస్తావా నీ పని చెప్తా అని మామయ్య దగ్గరకు వెళ్తుంది. వల్లీ కన్నవారి బస్తీ గురించి రామరాజుకి చెప్పే టైంకి రైసు మిల్లులో దొంగలు పడ్డారని వార్తతో అందరూ మిల్లుకి పరుగులు తీస్తారు. లాకర్‌లో పెట్టిన 5 లక్షలు రామరాజు నమ్మిన బంటు సింహాద్రినే దొంగతనం చేశాడని నరద్మ నిరూపిస్తుంది.
రామరాజు సింహాద్రి దగ్గరకు వెళ్లి మిల్లు స్టార్టింగ్ దగ్గర నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావ్ కదరా. నిన్ను నా ఇంటి మనిషిలా చూసుకున్నా నన్ను మోసం చేయాలి అని ఎలా అనిపించింది అని కుప్పకూలిపోతాడు. అందరూ రామరాజు చుట్టూ చేరుతారు. నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు ఈ బాధ నేను జీవితాంతం మోయాలి అని ఏడుస్తాడు. నమ్మిన వాడు మోసం చేస్తేనే ఇలా అయిన రామరాజుని ఇంటి వాళ్లే మోసం చేస్తే ఇంకేం అయిపోతాడా అని చందు, సాగర్, ధీరజ్ అనుకొని భయపడతారు. తర్వాత ప్రేమ రామరాజుతో వల్లి పుట్టింటి గురించి చెప్తే టైంకి భాగ్యం, ఆనంద్‌రావు బస్తీ గెటప్‌లో ఎంట్రీ ఇస్తారు. ఇద్దరూ రామరాజు కాళ్ల మీద పడి ఏడుస్తూ మేం రోడ్డున పడిపోయాం అన్నయ్యా గారు మా ఆస్తులు బంగ్లాలు అన్నీ పోయావని మోసపోయామని నమ్మిస్తారు. అప్పటికీ ప్రేమ నిజం చెప్తా అంటే నర్మద ఆపేస్తుంది. ఈ నిజం తెలిస్తే మామయ్య తట్టుకోలేరు.. సింహాద్రి విషయంలో ఎంత బాధ పడ్డారో చూశావు కదా.. కొడుకు విషయంలో మోసపోయాను అని తెలిస్తే తట్టుకోగలరా మానసికంగా కృంగిపోతారని నర్మద ప్రేమ నిజం చెప్పకుండా ఆపేస్తుంది.
భాగ్యం, ఇడ్లీబాబాయ్‌లు అల్లుడి కాళ్లు పట్టేసి పది లక్షలు ఇవ్వలేమని చేతులెత్తేస్తారు. చందు చాలా చాలా బాధ పడతాడు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చొండిపోతాడు. వల్లి చందు దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చొని ఏడుస్తుంది. బా నువ్వు ఇలా బాధ పడితే నేను చూడలేను అని అంటుంది. దానికి చందు మీ అమ్మానాన్నలు చేతులెత్తేస్తారని అనుకోలేదని చందు అంటాడు. దానికి వల్లీ మా వాళ్లు ఊహించని నష్టాలు చవి చూశారు.. డబ్బులు ఉండుంటే ఇచ్చే వాళ్లు అంటుంది. నువ్వు ఇలా బాధ పడుతుంటే చూడలేను బా అని వల్లి చందుని పట్టుకుంటే చందు వల్లితో దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్ అని వల్లిని పంపేస్తాడు. వల్లి ఓ చోట కూర్చొని బాధ పడుతుంటే వేదవతి వల్లి దగ్గరకు వెళ్లి మాకు పెద్ద కోడలు మంచి గుణగణాలు ఉన్న అమ్మాయి కావాలి అనుకున్నాం.. మా అదృష్టం మంచి లక్షణాలు ఉన్న వల్లి దొరికింది. అందుకే రూపాయి కట్నం తీసుకోకుండా నిన్ను కోడల్ని చేసుకున్నాం. మాకు కావాల్సింది మంచి లక్షణాలు ఉన్న వల్లి.. అంతేకానీ ఆస్తి కాదు నువ్వేం బాధ పడకు. మేం కానీ నీ తోడుకోడళ్లు కూడా నీకు ఆస్తి లేదని ఎవరూ తక్కువగా చూడరు. నువ్వు ఇంతకు ముందులా అందరితో కలిసి కలివిడిగా ఉండాలి సరేనా అని సర్ది చెప్తుంది. నర్మద వల్లితో చూశావు కదా అత్తయ్య అమ్మలా నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో.. నువ్వు మంచిదానివి అయితే చాలు అని ఆలోచిస్తుంది తప్పా నీ ఆస్తుల కోసం ఆలోచించడం లేదు అలాంటి అత్తయ్యా మామయ్యలను మోసం చేస్తున్నావ్ నీకు సిగ్గు లేదు అని తిడుతుంది. నీ కాపురం కూలిపోకూడదు అని ఆలోచించి నీకు క్షమాభిక్ష పెట్టాను..దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండు అని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
ఇక ప్రేమ పెద్ద వర్షంలో కూర్చొంటుంది. నర్మద వచ్చి లోపలికి రా అంటుంది. ప్రేమ నర్మద చేయి తోసేయడంతో ఓ అర్థమైంది నా చెల్లి నా మీద కోపంగా ఉంది.. వల్లి గురించే కదా అర్థం చేసుకోవాలి కదా ప్రేమ అని నర్మద నచ్చచెప్పబోతే ప్రేమ కోపంగా ఏంటి అర్థం చేసుకునేది ఆ వల్లి మనల్ని ఎంత టార్చర్ చేసింది.. నేను ట్యూషన్‌కి వెళ్లిన విషయంలో ఇంట్లో చెప్పి ఎంత గొడవ చేసింది.. మనం అనాథలు అయ్యామని ఎంత ఏడ్చాం అలా ఎలా వదిలేస్తావ్.. నువ్వు ఎన్ని అయినా చెప్పు నువ్వు చేసింది నాకు నచ్చలేదు.. నువ్వు చేసిందే కాదు అక్క నువ్వు కూడా నాకు నచ్చడం లేదు.. దయచేసి నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ అరుస్తుంది. మొత్తానికి వల్లి వల్ల నర్మద, ప్రేమలు శత్రువులు అయిపోయినట్లే ఉన్నారు. ఇవీ ఈ వారం హైలెట్స్.





















