Trinayani August 3rd: 'త్రినయని' సీరియల్: బిక్షం ఎత్తుకున్న తిలోత్తమా, వల్లభ - నయనిపై అనుమానం పడుతున్న విశాల్?
తిలోత్తమా, వల్లభ బిక్షం ఎత్తుకోవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Trinayani August 3rd: 'త్రినయని' సీరియల్: బిక్షం ఎత్తుకున్న తిలోత్తమా, వల్లభ - నయనిపై అనుమానం పడుతున్న విశాల్? Vishal suspicious of Nayani in Trinayani August 3rd eposide Trinayani August 3rd: 'త్రినయని' సీరియల్: బిక్షం ఎత్తుకున్న తిలోత్తమా, వల్లభ - నయనిపై అనుమానం పడుతున్న విశాల్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/50038bd6f39dae45ada9ca8b7b7bfd291691038336532768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani August 3rd: తిలోత్తమా, వల్లభ తాము ముష్టివాళ్ళుగా కనిపించారని ఇంట్లో వాళ్ళు అనడంతో బాగా కోపం తో రగిలిపోతున్నారు. విశాలాక్షి కూడా బాగా మాయలు చేస్తుంది అని బాగా ఫైర్ అవుతారు. ఇక వల్లభ తను ఎలా ఉన్నానని తన తల్లిని అడగటంతో ముష్టి దాని కొడుకు లాగా ఉన్నావు అంటూ పొరపాటుగా అనేసి అదేంటి అలా అంటున్నాను అని నీకేంటి చాలా బాగున్నావ్ అని పొగుడుతుంది.
ఇక తను ఎలా ఉన్నానో అని కొడుకుని అడుగుతుంది తిలోత్తమా. వల్లభ నువ్వు కూడా చాలా బాగున్నావ్ అని అనగా మనం అందంగా ఉన్న కూడా వాళ్ళేంటి అలాగా అన్నారు అని అంటుంది. ఇక వల్లభ పద పద బిజినెస్ డీల్ గురించి వెళ్దాము అని అనడంతో తిలోత్తమా కాస్త తమ లుక్స్ పై అనుమానం గా ఉంటుంది. అందరి మాటలు ఏమో కానీ నయని దంపతుల మాటలను నమ్మాల్సిందే అని.. ఈ ఒక్కసారికి విశాలాక్షి చెప్పినట్లు చేద్దామా అని అనడంతో వల్లభ వద్దు అని అహం దెబ్బతింటుంది అని అక్కడి నుంచి కిందికి వెళ్తారు.
ఇక హాల్లో విష్ణుమూర్తి లక్ష్మీమాత ఫోటో పెట్టడంతో సుమన వచ్చి దేవుడు పటం ఇక్కడ ఎందుకు పెట్టారు అంటూ కాసేపు గొడవ చేస్తుంది. అందరూ అక్కడికి రావడంతో విశాలాక్షి కూడా అక్కడికి వస్తుంది. ఇక ఎందుకు ఆ ఫోటో అలా పెట్టావు అని విశాలాక్షిని అడగటంతో.. వస్తున్నారు ఆగండి అని అంటుంది. ఇక సుమన మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది.
ఇక తిలోత్తమా, వల్లభ కిందికి వస్తారు. విశాలాక్షి చెప్పినట్టు చేస్తే అహం దెబ్బతింటుందని అలా అడగకుండా మొండిగా ప్రవర్తిస్తారు. ఇక డమ్మక్క మీరు ఆలస్యం చేస్తే విశాలాక్షి శ్రీశైలం పోతుందని ఇక తను వచ్చేవరకు మీ పరిస్థితి ఇదే అని అంటుంది. దాంతో తిలోత్తమా చిన్న పిల్ల ముందు ఇలా అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే విశాలాక్షి మరో మార్గం ఉందని తన అన్న వదిన అయినా విష్ణుమూర్తి లక్ష్మీమాత ఫోటో ముందు భవతి భిక్షం దేవి అని అడగమని అంటుంది.
ఇక ఈసారి ఏమాత్రం మొండి చేయకుండా పిల్ల ముందు చెప్పటం కంటే ఫోటో ముందు చెప్పడం బెటర్ అని ఫోటో ముందు చెబుతారు. ఇక మూడుసార్లు అన్నాక వారి చేతిలో వాళ్లే విసిర కొట్టిన పులిహోరనే వస్తుంది. ఇక అది తినడానికి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా తింటారు. ఆ తర్వాత విశాలాక్షి అక్కడి నుంచి బయలుదేరుతుంది.
తల్లి, కొడుకు ఫ్రెష్ అప్ అవడానికి పైకి వెళ్తారు. ఆ తర్వాత హాసిని జరిగిన విషయాలన్నీ దురంధర తనకు చెప్పటంతో నయని దగ్గరికి వచ్చి తెగ నవ్వుతూ ఉంటుంది. ఇక తిలోత్తమా పై బాగా ఫైర్ అవుతూ తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విశాల్ కూడా వస్తాడు. అయినా కూడా తిలోత్తమాని బాగా తిడుతూ ఉంటుంది.
ఆస్తి కోసం ఏమైనా చేస్తుందని నిజాలు మాట్లాడుతూ ఉండటంతో విశాల్ ఆపే ప్రయత్నం చేస్తాడు. నయని కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. హాసిని మాత్రం మాట్లాడుతూ.. డబ్బు కోసం విశాల్ కన్నతల్లిని అని అనబోతుంటే నయని ఆపుతుంది. వెంటనే విశాల్ వదిన ఎక్కడ నిజం చెబుతుందో అని నేను ఆపబోతుంటే నయని కూడా ఆపింది అని అనుమానం పడతాడు.
also read it : Prema Entha Madhuram August 2nd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భానుకు మొదలైన శత్రుత్వం, ఫ్యామిలీ గౌరవాన్ని పెంచిన అను
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)