Trinayani July 31st: 'త్రినయని' సీరియల్: నోరు జారిన విక్రాంత్‌కు ప్రాణం భయం, తిలోత్తమా చేసిన ప్లాన్ కనిపెట్టిన నయని?
విక్రాంత్ పొరపాటు నిజం చెప్పటం వల్ల ప్రాణాలు పోయేంత పని అవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani july 31st: సుమన బెడ్ రూమ్ లో నాగ పాము విగ్రహానికి పూజ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే అక్కడికి వచ్చిన విక్రాంత్ బెడ్రూంలో పూజ ఏంటి అనటంతో.. సీమంతమయ్యాక ఒక అరగంట పడుకున్నప్పుడు తనకు కలలో నాగరాజు వచ్చి పూజ చేయమని అన్నాడని అంటుంది. దాంతో విక్రాంత్ తన ప్రవర్తనకు చిరాకు పడుతూ ఉంటాడు.
నాగరాజు అనే బాయ్ ఫ్రెండ్ కలలో వచ్చాడంటే అర్థం ఉంటుంది కానీ నాగ పాము కలలో రావటమేంటి అని విచిత్రపడతాడు. అయినా నాగుపామే కడుపులో ఉంది కదా అనడంతో వెంటనే సుమనకు వినిపించకపోయేసరికి ఏమన్నావు అని అంటుంది. అప్పుడే విక్రాంత్ కు గొంతు నొక్కినట్లు అవుతుంది. దాంతో సుమన భయపడుతుంది. ఏం జరిగింది అని కంగారుగా అడుగుతూ ఉంటుంది.
వెంటనే విశ్రాంత్ నాగుపాము విగ్రహం అడగటంతో సుమన దానిని విక్రాంత్ చేతిలో పెట్టడంతో అప్పుడు ప్రాణాల నుండి బయటపడినట్లు కనిపిస్తాడు. ఈ నాగుపాము విగ్రహం వెనుక చాలా మహత్యం ఉందని అనటంతో అవును అని సుమన అంటుంది. దీని వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవాలి అనటంతో ఇవన్నీ నయనికి తెలుసు అని అంటుంది సుమన.
దీంతో దాని వెనుక ఉన్న రహస్యం నయని ద్వారా తెలుసుకోవడానికి తాపత్రపడతాడు. విక్రాంత్ శివకు పిల్లల ఫోటో చూపిస్తూ ఉండటంతో పిల్లలను చూసి మురిసిపోతాడు శివ. అప్పుడే నయని వచ్చి వారితో మాట్లాడుతుంది. ఇక విశాల్ నా పోలిక ఎవరున్నారు అని అనడంతో గాయత్రి పాప అని శివ నోరు జారుతాడు. దాంతో నయని శాకవ్వటంతో మళ్ళీ శివ కవర్ చేస్తాడు.
ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు అని నయని శివని అడగటంతో అందరూ బాగానే ఉన్నారని కానీ విశాల్ గ్రహ దోషం వల్ల నీకు నష్టం ఉందని అనటంతో వెంటనే నయని శివను అక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఇక విశాల్ నావల్ల నీకు నష్టం ఏంటి అనటంతో అటువంటిది ఏమీ లేదు అని నయని కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది.
ఆ తర్వాత తిలోత్తమా తమ ప్లాన్ పాడయింది అని అనటంతో వెంటనే వల్లభ విక్రాంత్ కు ఏమి జరగదు చాలా అదృష్టవంతుడని అంటాడు. అప్పుడే తిలోత్తమా మా చెల్లి సుమన మాంగల్యం బలవంతమైనది అన్నటంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడే హాసిని కూడా అక్కడికి వస్తుంది. ఇక నయని వాళ్లే విక్రాంత్
ను చంపాలనుకున్న విషయాన్ని కనిపెట్టడంతో తిలోత్తమా భయపడి తాను ఏమీ చేయలేదు అన్నట్లు చెబుతుంది.
కానీ నయని మాత్రం విక్రాంత్ కు అలా జరుగుతుందని ముందే తెలుసుకున్నాను అని తనకున్న శక్తి ద్వారా చెబుతుంది. ఇక వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడగా హాసిని కూడా వారిపై వెటకారంగా ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సుమన ఎద్దులయ్యను బయట గుడ్లు తెమ్మని పంపివటంతో ఎద్దులయ్య వచ్చి తను బయటికి వెళ్లి గాడిద గుడ్డు అని అడుగుతే ఎవరూ ఇవ్వలేదు అన్నారని కొందరు తిట్టుకున్నారని.. కొందరు ఈ జన్మలో అది జరుగుతుందా అని అన్నారని అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇక నయని నవ్వడంతో సుమనకు బాగా కోపం వస్తుంది. నయని మాత్రం తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial