Vadinamma-RakhiPurnima: రెండున్నరేళ్లకే ఆ సీరియల్‌కు శుభం కార్డ్, చాలా త్వరగా ముగించారే!
రెండున్నరేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన వదినమ్మ సీరియల్ కి శుభం కార్డ్ పడింది. అన్నదమ్ములు, తోడికోడళ్ల మధ్య అపార్థాలు తొలగి కుటుంబం అంతా ఒక్కటయ్యారు..
రెండేళ్ల క్రితం ప్రారంభమైన వదినమ్మ సీరియల్ మార్చి 21 సోమవారం 808 ఎపిసోడ్ తో ముగిసింది. సోమవారం మెగా ఫినాలే ఎపిసోడ్ ప్రసారం చేసి సీరియస్ పూర్తిచేసారు. సుమారు రెండు గంటల పాటూ సాగింది ఫైనల్ ఎపిసోడ్. శ్రీరామనవమి ఉత్సవాలు, ఆ తర్వాత ఒక్కొక్కరిలో మార్పు రావడం ఎవరితప్పు వాళ్లు తెలుసుకుని అంతా ఓ చోటకి చేరడంతో శుభంకార్డ్ పడింది.
శ్రీరామనవమి ఉత్సవాల కోసం రఘురాం కుటుంబసభ్యులంతా గుడికి చేరుకుంటారు. అక్కడ రఘురాం, సీత పీటలపై కూర్చుని కళ్యాణం జరిపించాల్సి ఉంటుంది. ఉత్సవాలు ముగిసిన తర్వాత తన అన్నయ్య, వదిన ఇద్దరినీ పరామర్శించాలని లక్ష్మణ్ భావిస్తాడు కానీ అక్కడే ఉన్న శైలు లక్ష్మణ్ వారిని కలవకుండా అడ్డుకుంటుంది.అదే సమయంలో లక్ష్మణ్ ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన రఘురాం అసలేం జరిగింది లక్ష్మణ్ ఎందుకో అదో రకంగా చూస్తున్నాడు అని అడుగుతాడు. దీంతో 'రిషి' మన బిడ్డ అనే విషయం లక్ష్మణ్ కు తెలిసింది అని సీత చెబుతుంది. ఇది విన్న తర్వాత జనార్ధన్ బావ మరిది ఇదే విషయం తీసుకువెళ్లి జనార్ధన్ కి చెబుతాడు. అలాంటి గొప్ప వాళ్ళను మనం ఏమీ చేయకుండా ఉంటే మంచిది అని అంటాడు. మరోపక్క కుటుంబ సభ్యులందరూ ఇంటికి చేరిన తర్వాత అందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు.
రఘురాం-సితల కుమారుడు రిషి అని లక్ష్మణ్ కి తెలుస్తుందా ?#Vadinamma today at 6:00 pm on #StarMaa
— starmaa (@StarMaa) March 18, 2022
.#StarmaaSerials #Beమాsked #MaaPrayanamManaKosam pic.twitter.com/SRMzZurLEG
తర్వాత జనార్ధన్ శైలు కొడుకుని సీత కుటుంబ సభ్యులు అందరూ దూరం చేసినట్లు కల రావడంతో సీతను చంపించాలని ఫిక్స్ అవుతాడు.సీతా భరత్ కలిసి స్వీట్లు వ్యాపారం కోసం బయటకు వెళ్ళినప్పుడు వాళ్లపై హత్యాప్రయత్నం చేయగా విఫలమవుతుంది. ఆ తర్వాత రఘురాం మరో తమ్ముడు నాని కూడా తన అత్త నిజస్వరూపం తెలుసుకుని అన్నా వదినలని బాధపెట్టిన విషయం గుర్తుచేసుకుని బాధపడతాడు.మరోవైపు సీత-భరత్ ఇంట్లో లేని సమయంలో రఘురాం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా అడ్డుపడుతుంది శైలు. అయినప్పటికీ లక్ష్మణ్ తన అన్నని హాస్పిటల్ కి తీసుకెళతాడు. తన కొడుకుని కాపాడింది రఘురాం అన్న విషయం శైలుకి తెలియడంతో ఆమెలో మార్పు వస్తుంది. అలా ఫైనల్ గా కుటుంబంలో అందరూ తప్పు తెలుసుకుని ఒక్కటవుతారు. ఎవరికి వారే తమ పిల్లల్ని మీరే పెంచాలి..మీలా తయారు చేయాలంటూ సీత-రఘురాం చేతుల్లో పెడతారు. అలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడిన రఘురామ్ కుటుంబం ఎట్టకేలకు ఒకటే అయింది.ఎట్టకేలకు శుభంకార్డ్ పడింది.
ఇదే సమయంలో రాఖీ పూర్ణిమ అనే కొత్త సీరియల్ ప్రారంభమైంది
అనుపమ నుండి అన్నయ్యని కాపాడడానికి పూర్ణిమ ఏం చేయబోతోంది ..?#rakhiPurnima from today at 6:00 pm on #StarMaa
— starmaa (@StarMaa) March 22, 2022
.#StarmaaSerials #Beమాsked #MaaPrayanamManaKosam pic.twitter.com/BEaQdPsE6L