అన్వేషించండి

Trinayani Serial September 9th: 'త్రినయని' సీరియల్: మణికాంత ప్రాంతానికి మళ్లీ వెళ్లాలి కానీ ఈసారి అలా కాదు: గురువుగారు

Trinayani Today Episode దురంధర పెద్దబొట్టమ్మని కొట్టడం పాముగా మారిన పెద్దబొట్టమ్మ అందర్ని కాటేయడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode సుమన దగ్గరకు పెద్దబొట్టమ్మ వస్తుంది. పెద్దబొట్టమ్మ మీద సుమన కోప్పడుతుంది. నన్ను శ్రీమంతురాల్ని చేస్తానన్న నీ మాట విని అందరూ ఆ గుడి దగ్గరకు వెళ్లేలా పురమాయించానని విశాల్ చేతికి తేలు కుట్టే వరకు తీసుకొచ్చానని అంటుంది. ఆ మాటలు అందరూ వింటారు. 

సుమన: పంచకమణి నాకు దక్కితే నేను శ్రీమంతురాల్ని అవగానే ఉలూచిని నీకు శాశ్వతంగా ఇచ్చేస్తాను అని అన్నాను. అలా జరగనప్పుడు నా బిడ్డను నిన్ను కనీసం టచ్ కూడా చేయనివ్వను. 
విక్రాంత్: చప్పట్లు కొడుతాడు. అందరూ సుమన పెద్దబొట్టమ్మ దగ్గరకు వస్తారు. 
హాసిని: చిట్టీ విశాల్‌కి ఇలా అవడం వెనక నీ హస్తం ఉందా.
సుమన: అది కాదు అక్క.
విక్రాంత్: మళ్లీ మాట్లాడుతావేంటే నువ్వు. 
నయని: ఎంత పని చేశావ్ సుమన నీ స్వార్థానికి బాబుగారిని బలి చేస్తావా.
సుమన: పడిపోయింది చేయే కదా అక్క మనిషి కాదు కదా
నయని: నోర్ముయ్. 
వల్లభ: మనసులో వీళ్ల ప్లాన్ వల్ల మా ప్లాన్ బయట పడలేదు అంతా మా మంచికే.
నయని: నీకు డబ్బు కావాలి అంటే నేను ఇచ్చేదాన్ని.
సుమన: ఎప్పుడిచ్చావని బావగారు ఇద్దాం అన్నప్పుడు కూడా అడ్డుపడేదానివి. నేను గానీ చెప్పకపోయి ఉంటే ఆ పెట్టే బయట పడేదా.
దురంధర: నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతావేంటే. 
గురువుగారు: సుమన చేసింది గొప్ప పనే. అవును విశాలా.. వీళ్ల స్వార్థం వల్లే కదా మీ అమ్మ దాచిన పెట్టేను నయని తీయగలిగింది. 
పెద్దబొట్టమ్మ: ఇదంతా విధిరాత అని మీరు చెప్తేనే వింటారు.
వల్లభ: మేం మేం మాట్లాడుకుంటాం నువ్వు నీ బిడ్డను తీసుకొని నాగలోకం వెళ్లిపో.
సుమన: అలా చెప్తారేంటి బావగారు. 
పాననా: ఇళ్లు మారినా సరే ఉలూచిని చూడటానికి పెద్దబొట్టమ్మ ఇళ్లు కనుక్కొని మరీ వచ్చింది. 
విక్రాంత్: ఉలూచి కోసం విశాల్ బ్రోని అన్యాయం చేయాలి అని మీకు ఎలా అనిపించింది.
పెద్దబొట్టమ్మ: సుమనకు పంచకమణి ఇస్తే ఉలూచిని నాకు శాశ్వతంగా ఇచ్చేస్తాను అని మాట ఇచ్చింది బాబు. 
దురంధర: అందకని మా బాగోగులు చూసే అల్లుడు నయనిని మోసం చేస్తావా అని పెద్దబొట్టమ్మ చెంప పగలగొడుతుంది. 

అందరూ షాక్ అయిపోతారు. నన్నే కొడతావా నిన్ను కాటేసి పోతానని పెద్దబొట్టమ్మ అంటుంది. దాంతో గాయత్రీ పాప కోపంగా పెద్దబొట్టమ్మని కొంగు పట్టి లాగేస్తుంది. దాంతో నయని పెద్దబొట్టమ్మ కోపంతో పాపని కాటేస్తుందేమో అని పాపని ఎత్తుకొని వెనక్కి వెళ్లిపోతుంది. పెద్దబొట్టమ్మ పాముగా మారుతుంది. అందరూ భయపడతారు. పాము దురంధరని కాటేయడానికి బుసలు కొడుతూ వెళ్లబోతే నాగయ్య పాము వచ్చి పెద్దబొట్టమ్మ పాము కాటేయకుండా నోటితో కరిచి ఆపుతాడు. పెద్దబొట్టమ్మని వదిలేయ్ మని గురువుగారు నాగయ్య పాముకి చెప్తారు. దాంతో నాగయ్య పాము పెద్దబొట్టమ్మ పాముని విసిరేస్తాడు. పెద్దబొట్టమ్మ మీదకు బుసులు కొడతాడు. ఇక పెద్దబొట్టమ్మ మళ్లీ మనిషిగా మారుతుంది. అందరూ నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించుకున్నావ్ అని పెద్దబొట్టమ్మని అంటారు. అందరూ పెద్దబొట్టమ్మని వెళ్లిపోమని చెప్తారు. 

విక్రాంత్: ఉలూచి లేకపోతే అల్లాడిపోయే దానివి అలాంటిది తనని పెద్దబొట్టమ్మకి ఎలా ఇస్తానంటావ్.
సుమన: నేను బిడ్డని కన్నదే ఆస్తి కోసం అలాంటప్పుడు ఉలూచిని పెంచి పెద్ద చేసి నేను పేద తల్లిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. పోయేటప్పుడు శ్రీమంతురాలిగా చనిపోవడం నా కల అందుకే పెద్దబొట్టమ్మకి సాయం చేయాలి అనుకున్నా అది తప్పా.  

విక్రాంత్ సుమన గొంతు పట్టుకొని నిన్ను చంపి ఈ కుటుంబానికి నేను ఫేవర్ చేయాలి అనుకుంటున్నా అని అంటాడు. ఇంతలో అటుగా వచ్చిన వల్లభ చూసి ఆపుతాడు. ఇక దురంధర తన మీద పెద్దబొట్టమ్మ పగ పడుతుందేమో అని భయపడితే నయని ధైర్యం చెప్తుంది. ఇక సుమనకు ఏం చేయకుండా ఉన్నావేంటి అని నయనిని హాసిని అడిగితే గురువుగారు వాళ్లకి అడగడం వేస్ట్ అని కాలమే వాళ్లకి సమాధానం చెప్తుందని అంటారు. ఇక తిలోత్తమ గురించి అందరూ చర్చించుకుంటారు. ఇంత జరిగినా తిలోత్తమ లేదు ఏంటని అనుకుంటారు. గురువుగారు తిలోత్తమకు అందని దాని గురించి ఆరా తీయడానికి వెళ్లుంటుందని అంటారు. దానికి గజగండ దగ్గరకు వెళ్లుంటుందని హాసిని అంటుంది. తిలోత్తమ పంచకమణి తీసుకురాలేదని నయని మళ్లీ మణికాంత ప్రాంతానికి వెళ్లాలని గురువుగారు చెప్తారు. 

మళ్లీ పౌర్ణమికి వెళ్లాలని నయని అంటే పౌర్ణమి వచ్చేలోపు అక్కడికి వెళ్లే మార్గం వెతకాలి అని గురువుగారు అంటారు. దానికి పావనా మూర్తి పత్రాలు ఉన్నాయి కదా అంటే ఒకసారి వాడిన పత్రాలు మరోసారి పనికి రావు అని ఆ దారి మారిపోయి ఉంటుందని అంటారు. నయని షాక్ అవుతుంది. ఇక తిలోత్తమ గాయత్రీ దేవి ఫొటో చూస్తూ మాట్లాడుతుంది. అది విన్న హాసిని ఇంట్లో అందరిని పిలుస్తుంది. పెద్దత్తయ్యతో తిలోత్తమ అత్త మాట్లాడిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అనాథ అంటూ మిత్రని ఏడిపించేసిన లక్కీ.. వారసుడిగా ఇంట్లో అడుగు పెట్టిన జున్ను!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget