అన్వేషించండి

Trinayani Serial Today September 2nd: 'త్రినయని' సీరియల్: పేపర్ల కాఫీలు విసిరిన గాయత్రీ పాపని చూసేసిన నయని.. ఇప్పటికైనా తొలిబిడ్డ అని కనిపెడుతుందా!

Trinayani Today Episode పెట్టెలో ఉన్న పేపర్ల జిరాక్స్‌లు గాయత్రీ పాప మేడ మీద నుంచి విసరడం నయని వాటిని చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి ఫోటో దగ్గరకు తిలోత్తమ వచ్చి నీ కొడుకుకు గాయం అవుతుందని అందుకు మందు కూడా నువ్వే దాచిపెట్టి అవి నీ కొడుకుకు చేరాలని అమ్మవారికి కోరుకున్నావ్ అలాగే అవి చేరుకున్నాయ్ కూడా అని అంటుంది. ఇప్పుడు అవి మాయం అయ్యాయని అంటుంది. కర్టెన్స్ ఊగుతున్నాయని వల్లభ భయపడతాడు. 

తిలోత్తమ: రేయ్ భయపడకు కన్నకొడుకు విశాల్‌కి నయం అయిన వరకు మనల్ని ఏం చేయదు. నీడను చూసి పెద్దమ్మ అని వల్లభ అరుస్తాడు. తీరా చూస్తే అది పెద్ద బొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: మీరు ఎవరితో మాట్లాడుతున్నారా అని చూడ్డానికి వచ్చానమ్మా.
హాసిని: ఇక్కడెవరూ లేరుగా 
వల్లభ: అమ్మ పెద్దమ్మతో మాట్లాడుతుంది.
నయని: అమ్మగారు వస్తే నాకు కనిపిస్తారు కదా.
తిలోత్తమ: గాయత్రీ అక్క ఫొటోతో మాట్లాడుతున్నా.
విశాల్: ఫొటోనా అమ్మ వచ్చిందేమో తనతో మాట్లాడుతున్నారేమో అని సంతోషపడ్డానమ్మా.
తిలోత్తమ: పెట్టెలో పేపర్లు గాయత్రీ అక్కయ్యే తీసిందని నా అనుమానం ఎక్కడ పెట్టిందో చెప్పమని అడగడానికి వచ్చాను.
సుమన: ఏమైంది అత్తయ్యా మీకు ఫొటోతో మాట్లాడితే పేపర్లు వస్తాయా
నయని: సరదాగా మాట్లాడుతున్నాం కానీ పేపర్లు తీసినోళ్లు మన మధ్యే ఉన్నారని అనుకుంటున్నాను. అందరి ఎదురుగా ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఉదయం సోఫాలో పేపర్లు పెట్టేయండి.
సుమన: అబ్బబ్బా ఇలా అయితే మీరు తీయలేదని మేం అనుకోవాలి అనే కదా.
హాసిని: మేమే తీసి మేమే ఎందుకు అడుగుతాం చిట్టీ.
సుమన: చెప్పలేం అక్క మమల్ని దారి మళ్లించడానికి ఇలా చేయొచ్చు.
విశాల్: సుమన పొరపడుతున్నారు ఆ పేపర్లు కోసం నయని ఎంత వెతికిందో మీకు తెలీదు.

పెద్దబొట్టమ్మ, వల్లభలు కూడా మేం కూడా వెతికాం అని అంటారు. ఎందుకు మీరు వెతికారని అందరూ అడిగితే నయనికి సాయం చేయడానికి అని అంటారు. ఇంతలో గాయత్రీ పాప ఆ పేపర్లను ఓ బుట్టలో వేసుకొని లాక్కోని మేడ మీద నుంచి కిందకి విసురుతుంది. అందరూ షాక్ అవుతారు. విశాల్ గాయత్రీ పాపని చూసి కంగారు పడతాడు. చాలా పేపర్లు కింద పడటంతో అందరూ అక్కడున్నవి ఎన్ని ఎక్కడ ఉన్నవి ఎన్ని అని అనుకుంటారు. నయని కూడా చాటుగా వెళ్లి మీద ఎవరు ఉన్నారా అని చూస్తుంది. నయని కూడా గాయత్రీ పాపని చూస్తుంది. గాయత్రీ పాపా అని ఆశ్చర్యపడుతుంది. ఇక తిలోత్తమ మీద ఎవరు ఉన్నారా చూడమని వల్లభని పంపుతుంది. వల్లభ వెళ్లే సరికి గాయత్రీ పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వల్లభ కిందకి వచ్చి ఎవరూ లేరని చెప్తాడు. గాయత్రీ దేవి ఇలా చేసిందని తిలోత్తమ అంటుంది. గాయత్రీ దేవి కనిపించారా అని తిలోత్తమ అడుగుతుంది. లేదని నయని చెప్తుంది. 

పెద్దబొట్టమ్మ: ఇన్ని పేపర్లు కింద పడినా లాభం లేదు. ఇవన్నీ నకలు పత్రాలు అసలు పత్రాలు ఉంటేనే మానసాదేవి ఆలయం దగ్గరకు వెళ్లగలం. 

విశాల్ నడవడానికి ఇబ్బంది పడితే హాసిని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని నయనికి చెప్పి ఎక్కడికి వెళ్లినా నయని సాయం తీసుకోమని అంటుంది. పేపర్లు గురించి మాట్లాడుకుంటారు. పేపర్లను గాయత్రీ పాప పడేయడం తాను చూశానని నయని చెప్తుంది. విశాల్, హాసిని షాక్ అవుతారు. గాయత్రీ పాప పేపర్లు ఎలా తీసుంటుందని నయని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంతలో విశాల్ చేయి నొప్పి అని నయనిని డైవర్ట్ చేస్తాడు. ఇక గదిలో సుమన తనని తాను అందంగా పొగుడు కొని భర్తని వలలో వేయడానికి ప్రయత్నిస్తుంది . విక్రాంత్ సుమనను కోప్పడతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: 'త్రినయని' సీరియల్: పేపర్లు మాయం.. విశాల్‌కి మరణం తప్పదా.. ఆ మాటల అర్థం ఏంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget