Trinayani Serial Today September 28th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి కోసం గజగండని రప్పించిన తిలోత్తమ.. చంపేస్తామని హెచ్చరించిన విశాల్!
Trinayani Today Episode భుజంగమణి తనకు ఇవ్వమని గజగండ నయని ఇంటికి రావడం విశాల్, విక్రాంత్‌లు గజగండని చంపేస్తామని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today September 28th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి కోసం గజగండని రప్పించిన తిలోత్తమ.. చంపేస్తామని హెచ్చరించిన విశాల్! trinayani serial today september 28th episode written update in telugu Trinayani Serial Today September 28th: 'త్రినయని' సీరియల్: భుజంగమణి కోసం గజగండని రప్పించిన తిలోత్తమ.. చంపేస్తామని హెచ్చరించిన విశాల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/28/3e38682cdbb96525f761c3736d643c7e1727488064738882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode నయని భుజంగమణిని ఎవరికీ ఇవ్వడానికి నయని ఇష్టపడదు. తిలోత్తమ, సుమన డిసప్పాయింట్ అవుతారు. దూరం నుంచి చూడమని అంటుంది. భుజంగమణి చూసి ఆనందించడం కానీ అది సొంతం చేసుకోవాలని పిచ్చి ఆలోచనలు పెట్టకోవద్దని హాసిని అంటుంది. పాపనా వాళ్లు గజగండ ఏం ఇబ్బంది పెట్టలేదు కదా అని అడుగుతారు. గజగండ పెట్టిన ఇబ్బంది గురించి చెప్తారు. పాప వల్లే భుజంగ మణి దక్కిందని అంటారు.
విక్రాంత్ గుడిలో వెయ్యి మందికి అన్నదానం తమ పేరు మీద చేయమని పంతులుకి చెప్తాడు. అందుకు డబ్బు పంపిస్తాడు. సుమన ఆ మాటలు విని ఇప్పుడెందుకని అడుగుతుంది. మా అన్నయ్యకి నయం అయింది. వదిన కూడా సంతోషంగా ఉందని అందుకే అన్నదానం ఏర్పాటు చేశానని అంటాడు.
సుమన: ఎప్పుడు చూసినా అన్నావదినలు బాగున్నారా నవ్వుతున్నారా లేదా అనేదే కానీ మన గురించి ఆలోచించరా.
విక్రాంత్: ఏదైనా లోటు ఉంటే కదా చూసుకోవచ్చు సరి చేసుకోవచ్చు.
సుమన: ఏం లోటు లేదు అంటారు కదా అయితే మీకు ఎప్పుడు పక్షవాతం వస్తుంది. విశాల్ బావగారికి చేయి పడిపోయినట్లు మీకు కాలు పడిపోతే మా అక్క మిమల్ని తీసుకెళ్లి పంచకమణి, భుజంగమణికి మించినది ఏమైనా తీసుకొస్తుందా అని .
విక్రాంత్: కొడితే పళ్లు రాలిపోతాయ్. నీ కోరికలు తీర్చుకోవడానికి నా కాళ్లు చేతులు పడిపోవాలా అన్నింటి కంటే ముందు నీ నోరు పడిపోవాలి అప్పుడు నయని వదిన తెచ్చిన భుజంగమణి మింగేస్తావ్ కదా. నయని వదిన భుజంగమణీ తీసుకొచ్చింది అంటే దాన్ని బీరువాలో పెట్టడానికి కాదు దాన్ని పంచకమణితో కలిపి రెండింటినీ కలిపి అమ్మవారి గుడికి చేర్చడానికి. అర్థమైందా.
సుమన: మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. వాటిని వినియోగించుకోకుండా మా అక్క అమ్మవారి గుడిలో పెడుతుందా నమ్మేస్తామనుకుంటున్నారా.
విశాల్ చేయి బాగు అయిపోవడం నయని భుజంగమణి తీసుకురావడంతో తిలోత్తమ రగిలిపోతుంది. పంచకమణి పట్టించుకున్నందుకే నా చేయి తగ్గిపోతే ఇక ఆ పంచకమణి దక్కించుకుంటే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తిలోత్తమ అంటుంది. వల్లభ తిలోత్తమతో భుజంగమణి చూపిన తర్వాత తనకు మెయిన్ విలన్‌గా మారిపోవాలని ఉందని అంటాడు. విశాల్ గాయత్రీ పాపతో ఆడుకుంటాడు.
విశాల్: గజగండ కచ్చితంగా భుజంగమణి కోసం వస్తాడు నయని.
నయని: రానివ్వండి బాబు గారు వాడి రాక కోసమే నేను ఎదురు చూస్తున్న.
విశాల్: అమ్మ చేతి ముద్దలు తిని ద్రోహం తల పెట్టిన వారిని వదలకూడదు నయని.
నయని: మరి మీరు ఎందుకు తిలోత్తమ అత్తయ్యని వదిలేస్తున్నారు.
విశాల్: మనసులో మా అమ్మని చంపినా ఎందుకు తిలోత్తమ అమ్మని వదిలిపెడుతున్నానని అడుగుతుందా నయని.
ఉదయం గజగండ ఇంటికి వస్తాడని వల్లభ, తిలోత్తమ మాట్లాడుకుంటారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇంటికి గజగండ వస్తున్నాడని తిలోత్తమ చెప్తుంది. దాంతో నయని అతనెందుకు వస్తున్నాడని అడుగుతారు.
విక్రాంత్: ఎందుకొస్తున్నాడు.
గజగండ: భుజంగ మణి కోసం. ఇక్కడ గొడవలు ఏం జరగవు.
విశాల్: ఒక చావు తప్పు అది కూడా నీదే. జాగ్రత్తలు తీసుకో గజగండ. నీ దహన సంస్కారాలు జరగబోతున్నాయి. అమ్మ వాళ్ల ఆవిడ గంటలమ్మకి పిలిపించు.
తిలోత్తమ: కూల్ విశాల్, నయని, విక్రాంత్. గజగండ కొడుకుని పోగొట్టుకున్నా ప్రతీకారం కోసం ఇక్కడికి రాలేదు.
గజగండ ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా అలా మాట్లాడుతారేంటి. తన దగ్గర పంచకమణి ఉంది. మీతో భుజంగమణి ఉంది. విశాల్‌కి నయం అయింది. ఇప్పుడు తర్వాత ఏంటి అనేది క్లారీటీ ఉండాలి కదా.
నయని: మాకు ఏం చేయాలో తెలుసు.
విశాల్: మీకే క్లారిటీ లేదు అమ్మ. నయని చెప్పిందో లేదో తన దగ్గర ఉన్న మణితో పాటు పంచకమణి జోడించి రెండింటిని దసరా లోపల మానసాదేవి ఆలయానికి చేర్చడమే తన ముందున్న లక్ష్యం.
గజగండ: మణులు గుడికి చేర్చితే మీకు ఏం వస్తుంది. పంచకమణిని ముందు మీకు ఇస్తాను. దానితో పాటు అష్టైశ్వర్యాలు ఇస్తాను. ఈ భూమండలంలోనే మీ కంటే ధనవంతులు ఉండరు.
సుమన: వావ్ అక్క ఈ అవకాశం మళ్లీ రాదు.
విశాల్: అమ్మవారి మణి మాణిక్యాల్ని స్వార్థం కోసం వాడుకోరాదు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్ కథలో ఒక్కో సీన్ క్లైమాక్సే.. ఇంటిళ్లపాది ఏడుపులు.. అయ్యో అనాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)