Trinayani Serial Today November 14th: 'త్రినయని' సీరియల్: యమపురిలో బిత్తరపోయే నిజాలు తెలుసుకున్న నయని.. షరతులతో త్రినేత్రి శరీరంలోకి!
Trinayani Today Episode త్రినేత్రి బదులు తాను చనిపోయానని తెలుసుకున్న నయని యముడితో గొడవ పడటం షరతులతో యముడు నయనిని త్రినేత్రి శరీరంలోకి పంపిస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని ఆత్మ యమపురి చేరుకుంటుంది. ఇక తిలోత్తమ పళ్ల రసాన్ని గాయత్రీ పాప కోసం సిద్ధం చేస్తుంది. వల్లభ వచ్చి నువ్వు సూపర్ అమ్మ పాపని బాగా చూసుకుంటున్నావ్ అంటే నేను పునర్జన్మలో ఉన్న గాయత్రీ అక్కని జాగ్రత్తగా చూసుకోవడం కాదు ఈ జన్మలో కూడా తన ప్రాణాలు నేనే తీస్తానని జ్యూస్‌లో ప్రాణాంతక రసాయనం కలిపానని చెప్తుంది. వల్లభ షాక్ అయిపోతాడు. సుమన వస్తే తనకి ఇవ్వు పాపకి తాను తాగిస్తుందని చెప్తాడు.
నేను ఇవ్వను అని సుమన అంటే విక్రాంత్ దగ్గర మార్కులు కొట్టేయొచ్చని ఆస్తిలో కూడా కలిసి వస్తుందని చెప్పడంతో సుమన పాప కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది. ఇన నయని యమధర్మరాజు దగ్గరకు వెళ్తుంది. చిత్రగుప్తుడికి నయని గురించి చెప్పమని యముడు అడుగుతాడు.
నయని: నేను ఎక్కడికి వచ్చాను.
యముడు: యమపురి వచ్చి ఎక్కడికి వచ్చాను అంటావా.
నయని: నేను యమలోకం వచ్చానా. స్వామీ నాకు గండం ఉందని తెలుసు కానీ దాన్ని తప్పించడానికి విశాలాక్షి అమ్మ అండ ఉందని తెలుసు. అది దాటితే నిండు నూరేళ్లు నా భర్తకి సేవలు అందిస్తూ పిల్లలతో సంతోషంగా ఉండి చివరి దశలో సుమంగళిగా వెళ్లిపోతాను అని తెలుసు. కానీ ఇలా అర్థాంతరం ప్రాణాలు వదలడం ఏంటి స్వామి.
యముడు: నీకు ఇంకా వివాహమే కాలేదు పుత్ర రత్రాలు భర్త అంటావేంటి.
నయని: అదేంటి స్వామి అందరి జాతకాలు మీ దగ్గర ఉంటాయి ఇద్దరు కవల పిల్లలకు తల్లిని నాకు పెళ్లి కాలేదు అంటారేంటి. నేను నిజం చెప్తున్నా స్వామి. మా తాతయ్య శంకర శాస్త్రి గారు నేను సంపూర్ణ ఆయుష్షుతో ఉంటానని చెప్పారు. ఆయన జాతకం రాస్తే తిరుగే ఉండదు. అదీ కాక నేను నిత్యం అమ్మవారి భక్తురాలిని అయిన నేను కైలాసంలో ఉండే అమ్మవారిలో ఐక్యం అవుతాను కానీ ఇక్కడికి ఎలా వస్తాను.
యముడు: నువ్వు పాపములు చేయలేదా. అసత్యం చెప్పడమే పెద్ద పాపం నీకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు ఎవరక్కడా.
చిత్రగుప్తుడు: ప్రభు ప్రభు క్షమించండి మీకో నిజం చెప్పాలి. మీరు నా ప్రాణం తీయను అని ముందస్తు హామీ ఇవ్వాలి. ప్రభు ఈ పుణ్య వతి చెప్పింది అక్షర సత్యం. తనకు వివాహం అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు.
యముడు: అవునా నేనే పొరపడ్డానా లేదు లేదు ఈ యమపాశం కచ్చితంగా త్రినేత్రి ప్రాణాలు తీసుకొని వచ్చును.
నయని: స్వామి నా పేరు త్రినేత్రి కాదు త్రినయని.
చిత్రగుప్తుడు: మహా ప్రభు ఇంక నేను నిజం దాస్తే మీరు నన్ను నూనెలో వేయించెదరు. మీ గంభీర స్వరం విని త్రినేత్రికి బదులు త్రినయని పేరు తీయవలను గుర్తు పెట్టి తప్పు చేశాను. మీరు అన్న ఆ బాల ఇంకా చనిపోలేదు. ఈలోపు ఈ యమపాశం బలవంతంగా త్రినయని ప్రాణం తీసేసింది.
యముడు: మూర్ఖుడా ఎంత తప్పిదం చేశావురా. త్రినయని సంపూర్ణ ఆయుష్కురాలు.
నయని: ఏంటయ్యా తమరు చేసిన తప్పుడు పని ఎవరి ప్రాణాలు తీయబోయి నా ప్రాణాలు తీస్తారా. ఇదేనా మీరు చేసే న్యాయం. నా భర్తని నా పిల్లల్ని నాకు దూరం చేశారని న్యాయం చేయమని ముక్కోటి దేవతల్ని అడుగుతా.
యముడు: చూశావా చిత్రగుప్త అమ్మవారి భక్తురాలు కాబట్టి ధైర్యం తెచ్చుకుంది.
నయని: నా ప్రాణాలు తిరిగి నా దేహంలోకి పంపండి నేను వెళ్లిపోతాను.
యముడు: ఆవేశ పడకు బాల నువ్వు ప్రమాదంలో పడినందుకు కోలుకోవడానికి మూడు నెలలు పట్టును.
నయని: మూడు నెలలు వరకు నేను కళ్లు తెరవనా. ఆ ప్రమాదం జరిగింది కూడా మీరు తప్పుగా నా పేరు రాయడం వల్లే కదా. అలాంటప్పుడు నేను ఎందుకు మూడు నెలలు కళ్లు తెరవకుండా ఉండాలి. అదీ కాక మా తిలోత్తమ అత్తయ్య వల్ల గాయత్రీ పాప ప్రాణాలకు అపాయం ఉంది.
విక్రాంత్ దగ్గర పాప ఉంటే సుమన వచ్చి జ్యూస్ ఇస్తుంది. జ్యూస్‌లో విషం ఉందని తెలియక సుమన విక్రాంత్‌కి ఇవ్వడం విక్రాంత్ పాపతో ఆ జ్యూస్ తాగించేస్తాడు. మరోవైపు నయని వెంటనే వెళ్లాలి అని అంటుంది. నీ ప్రాణాలు తిరిగి నీ దేహానికి జరిగినా నువ్వు లేవలేవు అని అంటారు. ఇక మేం చేసిన తప్పునకు మేమే నీకు మేలు చేస్తామని చెప్పి త్రినయనిలా ఉన్న త్రినేత్రిని నయనికి చూపిస్తారు. నీ కలలో కనిపించింది తనే అని చెప్తారు. దాంతో నయని గండం త్రినేత్రికి ఉంటే నాకు అని భ్రమ పడ్డానా అని అంటుంది. త్రినేత్రి ప్రాణాలు అమ్మవారిలో ఐక్యం కావాలని ఉందని త్రినేత్రి ప్రాణాలు తీసి అందులోకి నీ ఆత్మ పంపిస్తానని అంటారు. లేదంటే మూడు నెలలు కోమాలోనే ఉండాల్సి వస్తుందని అంటారు. దాంతో నయని దేహం ఏదైనా పర్లేదు త్రినేత్రి దేహంలోకి వెళ్తానని చెప్తుంది.
యముడు: అయితే ఓ షరతు. పునర్జన్మలో ఉన్న పాపకి అయినా గాయత్రీదేవికైనా నీ చేయి తాకిన అప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే నువ్వు నయని అని తెలుస్తుంది. మిగతా 21 గంటలు నువ్వు త్రినేత్రి లానే ఉండి నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ రహస్యం ఎవరికైనా చెప్పితే మూడు నెలల తర్వాత నువ్వు నీ దేహాన్ని కూడా ఆశ్రయించలేవు బాల. ఇది యమపురి శాశనం.
నయని: ఎవరికీ చెప్పను నన్ను నా వాళ్ల దగ్గరకు చేర్చండి స్వామి. యముడు ఆత్మని పంపేస్తాడు.
మరోవైపు పాప తాగను అని తల ఊపితే అది విక్రాంత్ తీసుకొని తాగేస్తాడు. అందులో విషం ఉందని మర్చిపోతాడు. తర్వాత అందులో విషం ఉందని గుర్తొచ్చి వాంతులు చేసుకోవడానికి పరుగులు పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.