Seethe Ramudi Katnam Serial Today November 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పెళ్లి టైంకి సుమతిని తీసుకొస్తానని శపథం చేసిన సీత.. విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేయమన్న మహాలక్ష్మీ!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేయమని మహాలక్ష్మీ ఎస్ఐకి కాల్ చేసి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పెళ్లి వాళ్లు వస్తారు. సుమతి చనిపోయిందని విద్యాదేవి చంపేసిందని అర్చన వాళ్లు పెళ్లి వాళ్లతో చెప్తారు. అన్నీ శివకృష్ణ తమకు చెప్పారని ఇప్పుడు కన్యాదానం ఎవరు చేస్తారని అడుగుతారు. సుమతి చనిపోయారు కాబట్టి ఆవిడ తర్వాత ఆవిడ స్థానంలో ఉన్న మహాలక్ష్మీకి కన్యాదానం చేయమని పెళ్లి వాళ్లు అడుగుతారు.
చావు ఇంట్లో పెళ్లి గురించి ఎందుకని మహాలక్ష్మీ అంటుంది. దానికి పెళ్లి వాళ్లు సుమతి గారు చనిపోయి చాలా ఏళ్లు అయింది కదా అంటే మాకు నిన్ననే తెలిసిందని అంటారు. గురువారం పెళ్లి అవుతుందా లేదా అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతుంది.
మహాలక్ష్మీ: చూడండి మీ లాంటి సంబంధం వదులు కోవడం మాకు ఇష్టం లేదు కానీ మేం సుమతి చనిపోయిన బాధలో ఉన్నాం. తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అంత వరకు మిమల్ని ఆగమనడం న్యాయం కాదు అందుకని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే బెటర్.
సీత: ఈ పెళ్లి ఆగకూడదు అనుకున్న ముహూర్తానికే జరగాలి.
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ సీత సుమతి చనిపోయిన బాధలో మనం ఉంటే పెళ్లి ఎలా చేస్తాం.
సీత: సుమతి అత్తమ్మ చనిపోలేదు బతికేఉంది పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది పెళ్లి జరిపిస్తుంది.
మహాలక్ష్మీ: ఏంటి జనా ఇది. రామ్ సీతకు ఏమైనా పిచ్చి పట్టిందా తను ఏం మాట్లాడుతుందో తనకు అయినా అర్థం అవుతుందా.
అర్చన: ఆ విద్యాదేవినే సుమతి అక్కని చంపేసిందని మీ నాన్నే కదా ఆ టీచర్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లింది ఇప్పుడు మళ్లీ సుమతి అక్క బతికే ఉందని అంటావ్ ఏంటి సీత.
సీత: అత్తమ్మ చనిపోయిందని మీరు అంటున్నారు బతికే ఉందని నేను నమ్ముతున్నాను. టీచర్ చంపారనే ఆధారాలు నేను నమ్మను. మా నాన్న తప్పని పరిస్థితిలో అరెస్ట్ చేస్తారు.
పెళ్లివాళ్లు: ఏంటండి నీ గందరగోళం మీరు ఒక మాట చెప్తున్నారు మీ కోడలు ఒక మాట చెప్తున్నారు ఇంతకీ సుమతి చనిపోయిందా బతికే ఉందా
మహాలక్ష్మీ: చనిపోయింది
సీత: బతికే ఉంది. ఎక్కడో అత్తమ్మ బతికే ఉందని నా గట్టి నమ్మకం.
మహాలక్ష్మీ: నీ నమ్మకంతో ప్రీతి పెళ్లి చేస్తావా సీత పెళ్లి టైంకి సుమతి రాకపోతే ఏం చేస్తావు.
సీత: సుమతి అత్తమ్మ వస్తుంది. నేను తీసుకొస్తాను. నేను ఇదే మాట మీద ఉంటాను ఈ పెళ్లి జరగాలి.
పెళ్లి పనులు ప్రారంభిద్దామని పెళ్లి ప్రీతి మేనమామ ఇంట్లో అని అందరూ అక్కడికే వచ్చేయండి అని చెప్పి పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు. ఇక రామ్ సీతని పక్కకు తీసుకెళ్లి పెళ్లి వాళ్లతో ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. విద్యాదేవి టీచరే మా అమ్మని చంపేసిందని తెలిసినా నీ శపథాలేంటి అని సీతని ప్రశ్నిస్తాడు. ఇక తల్లి రాదని ఆ విషయం వదిలేయమని ఇంట్లో లేని పోని గొడవలు తేవొద్దని రామ్ చెప్తాడు. సీత మాత్రం ఎలా అయినా అత్తని తీసుకొస్తా సీత అంటుంది. అమ్మ రాకపోతే మా పిన్ని పరువు పోతుందని అమ్మ రాకపోతే నీ పరువు పోతుందని అమ్మ రాకపోతే ప్రీతి పెళ్లి ఆగిపోతుందని ప్రీతి డిసప్పాయింట్ అవుతుందని అంటాడు. అమ్మ వస్తుందంటే సాయం చేస్తా కానీ ప్రీతి ఇబ్బంది పడితే క్షమించనని అంటాడు రామ్.
మరోవైపు మహాలక్ష్మీ, అర్చనలు సీత ఏం చేయనుందా అని ఆలోచిస్తారు. సీతని ఆపకపోతే అన్ని విధాలుగా ప్రమాదమే అని అనుకుంటారు. సీతకి సుమతి గురించి తెలిస్తే ప్రమాదమని ఈ రోజే సుమతిని చంపేయమని మహాలక్ష్మీ పోలీస్‌కి ఫోన్ చేసి చెప్తుంది. రాత్రి సీత ఇంకా బయట చీరలు అమ్ముతుంటే రామ్ ఫోన్ చేసి లేట్ అయింది ఇంకా రావొచ్చు కదా అని అంటాడు. నువ్వు రాత్రి పూట కూడా కష్టపడుతుంటే బాధగా ఉందని అంటాడు. ఇక సీత వచ్చేస్తా అని చెప్తుంది. మరోవైపు విద్యాదేవి మహాలక్ష్మీ మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. సీఐ కానిస్టేబుల్‌తో విద్యాదేవిని బయటకు తీసుకురమ్మని చెప్తాడు. వేరే స్టేషన్‌కి తీసుకెళ్లాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: యమలోకంలో నయని ఆత్మ.. గుమ్మం వైపు చూస్తూ పాప ఏడుపు.. విశాల్ ఎమోషనల్ మాటలు!