అన్వేషించండి

Trinayani Serial Today March 4th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని పరీక్షించడానికి నయని ఇంటికి వచ్చిన అఖండ స్వామిని కాటేసిన పాము!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపే విశాల్ తల్లి అని నిరూపించడానికి అఖండ స్వామి నయని ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Telugu Serial Today Episode: సుమన గదికి హాసిని వచ్చి గాయత్రీ పాపని బుట్టలో పెట్టడం చూశాను అని అందుకే బుట్టలో రాళ్లు పెట్టాను అని అంటుంది. దీంతో సుమన నువ్వా రాళ్లు పెట్టింది అని అడుగుతుంది. దీంతో హాసిని చెప్తావా వెళ్లి చెప్పు. నీకు కూడా కూతురు ఉంది కదా చిన్న బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా అని ప్రశ్నిస్తుంది. దానికి సుమన ఆ గాయత్రీ మా అక్క కన్న బిడ్డకాదు కదా గాయత్రీ గురించి అంత సీరియస్‌గా తీసుకోవాలా అని అడుగుతుంది. దీంతో హాసిని సుమన చెంప పగలగొడుతుంది. ఇక విక్రాంత్ వచ్చి సుమనకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. 

విక్రాంత్: గాయత్రీ పాపని హాల్‌లోకి తీసుకొని వచ్చి.. ఎందుకు అమ్మా పాపని తీసుకురమ్మన్నావ్..
తిలోత్తమ: జోగయ్య శాస్త్రిగారి మనవరాలిని దత్తత తీసుకున్నారు కానీ సరైన కేర్ తీసుకోవడం లేదు అనిపించింది. 
హాసిని: హా.. చెల్లి వాళ్ల దగ్గర నుంచి ఇప్పుడు తమరు దత్తత తీసుకుంటారా.. 
వల్లభ: ఆ పిల్లని మేం ఎక్కడ సాకుదమమ్మా.. పాలే లీటర్లు లీటర్లు తాగుతుంది. రెండు ఆవులు కొన్నా సరిపోవుగా..
హాసిని: మీ అమ్మ ఉందిగా.. 
ధురందర: ఏం మాట్లాడుతున్నారే మీరు.
హాసిని: పిల్లని దత్తత తీసుకున్నప్పుడు పాలు లేకపోతే పది కిలోమీటర్లు వెళ్లి అయినా తీసుకురావాలి అని అంటున్నా.
విక్రాంత్: వదినా తెచ్చిపెడితే హాయిగా తిని కూర్చొనే వాళ్లే ఉన్నారు ఈ ఇంట్లో .. పసిబిడ్డని చూసుకోవడం వీళ్ల వల్ల కాదు.
నయని: విక్రాంత్ బాబు గాయత్రీ ఎవరికీ భారం కాకూడదు.
విశాల్: నయని అయినా మనం ఎవరికి ఇస్తాం. 
పావనా: మీరు చూసుకున్నట్లు ఇంకా ఎవరూ చూడలేరు కదా అల్లుడు.
సుమన: అత్తయ్య ఏది ఉన్నా మా అక్క ముఖం మీదే చెప్పేయండి.
తిలోత్తమ: మేం చూసుకుంటామని గాయత్రీ పాపని రమ్మని చెప్పలేదు  సుమన.
వల్లభ: మా శ్రేయాభిలాషి అభిలాష ఈ గాయత్రీ పాపని చూడటం. 
విశాల్: మీ శ్రేయాభిలాషి ఎవరు అన్న.. ఇంతలో అఖండ స్వామి వస్తారు.  విశాల్ మనసులో.. ఇంతకు ముందు మా అమ్మే గాయత్రీ పాప అని ఈయన గుర్తుపట్టారు. సమయానికి స్వామిజీ కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి. 
అఖండ: సందేశాన్ని నివృత్తి చేసుకొని వెళ్దామని వచ్చాను. 
నయని: స్వామి మీరు గాయత్రీ పాపని చూడాలి అనుకున్నారు కదా చూడండి.. 
సుమన: ఆ పాప వాళ్లు సొంత బిడ్డ అనుకోకండి దత్తత తీసుకున్నారు.
అఖండ: బిడ్డను దత్తత తీసుకోవచ్చు. కానీ తల్లిని ఎక్కడా దత్తత తీసుకోరు. వాళ్ల అమ్మ గాయత్రీ దేవి గురించి నేను చెప్పేది.
తిలోత్తమ: నాకు అర్థమైంది స్వామి గాయత్రీ అక్కయ్య పేరు పెట్టుకున్ను ఈ బిడ్డని దత్తత తీసుకుంటే గాయత్రీ అక్కయ్యని స్వీకరించినట్లే అని మీరు అంటున్నారు అంతేనా..
అఖండ: అది ఇదీ ఒక్కటైనప్పుడు మరి ఏదీ అనరాదు తిలోత్తమ. వచ్చిన పని పూర్తి కాకుండా నేను వెళ్లిపోవాలి అని హాసిని ప్రయత్నిస్తుంది. 
విక్రాంత్: స్వామి మీ పని ఏంటో చెప్పండి సహకరిస్తాం.
అఖండ: మీ సోదరుడు ఎత్తుకొని ఉన్న గాయత్రీ మీ పెద్దమ్మ గాయత్రీ దేవి అని నా నమ్మకం. అందువల్లే తిలోత్తమకు అడుగడుగునా గండాలు వస్తున్నాయి అని అనిపిస్తుంది.
విశాల్: స్వామి ఈ పాపే మా అమ్మ అయితే అంత కన్నా సంతోషం ఉండదు. పునర్జన్మ ఎత్తిన నాకన్న తల్లి కోసం నేను అక్కడా ఇక్కడే వెతికే అవసరం కూడా ఉండదు. 
నయని: స్వామి గారు అలా అన్నారు అని మనం రాజీ పడితే అమ్మగారిని తీసుకురాలేము కదా బాబుగారు.
సుమన: గాయత్రీ అత్తయ్యనే ఆ పిల్ల అంటుంటే మళ్లీ నువ్వు అమ్మగారు అంటావ్ ఏంటి అక్క. 
నయని: అలా అని చెప్పి మమల్ని సంతోషంగా ఉండమంటే ఎలా.
అఖండ: నిరూపణ చేస్తే అప్పుడు నమ్ముతావు కదా నయని.
నయని: వేరే ఆలోచన కూడా చేయను. 
విక్రాంత్: ఇంతకు ముందు చాలా ప్రయత్నాలు జరిగాయి స్వామి. పాపం దత్తత తీసుకున్నప్పటి నుంచి పాపకు చాలా పరీక్షలు జరిగాయి.
అఖండ: ఆ పాపని కిందకి విడిచిపెట్టండి. మీ అమ్మ పునర్జనమ్మ ఎత్తి ప్రాణాలతో ఉంది అవునా..
విశాల్: అవును స్వామి.
అఖండ: తనే గాయత్రీ దేవి అయితే ఏ మాత్రం ఊరుకోదు. కాసేపు పొరపడుదాం తిలోత్తమ. గాయత్రీ పునర్జన్మ ఎత్తిన తర్వాత ప్రాణాలతో లేదు అని ఆ పటంలో ఉన్న గాయత్రీ దేవి నుదిటన ఈ కుంకుమ పెడతాను. 
నయని: అమ్మగారి నుదిటిన కుంకుమ పెట్టడం ఏంటి అత్తయ్య. 
అఖండ: అపార్థం చేసుకోకండి ఇది కేవలం పరీక్ష మాత్రమే. నిరూపించడానికి మాత్రమే. కుంకుమను నేను పెట్టాలి అనుకున్నాను గానీ ఈ పాపే గాయత్రీ దేవి అయితే నేను పటానికి కుంకుమ పెట్టేలోపు ప్రతిఘటిస్తుంది. 
సుమన: బావగారి దగ్గర ఉన్న పిల్ల మీ దగ్గరకు వచ్చి మిమల్ని అడ్డుకుంటుందా..

అవును అని అఖండ స్వామి గాయత్రీ దేవి ఫొటో నుదిటిన కుంకుమ పెట్టడానికి వెళ్లాడు. ఇక విశాల్ భయంతో ఈ గండం నుంచి రక్షించాలి అని విశాలాక్షిని వేడుకుంటాడు. పాపే తన తల్లి అని నిరూపించకుండా చూడమని ప్రాధేయపడతాడు. మరోవైపు అఖండ కుంకుమ పెట్టడానికి ప్రయత్నించగానే  పెద్ద గాలి వీస్తుంది. గాయత్రీ దేవి పటం మీద నుంచి నాగయ్య పాము వచ్చి అఖండ స్వామిని కాటేస్తుంది దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: తమన్నా: ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌ వచ్చేస్తోంది - షూటింగ్‌ షూరు, ఈ సారి లీడ్‌ రోల్లో మిల్కీ బ్యూటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget