అన్వేషించండి

Trinayani Serial Today March 16th: 'త్రినయని' సీరియల్: సిగ్గు, సంబంధం లేకుండా ఆస్తి అడిగిన సుమన - ఉలూచి, గాయత్రీలకు అసలు పోలికే లేదన్న హాసిని!

Trinayani Serial Today Episode సుమన గాయత్రీ పాప పేరిటి రాసే ఆస్తిని తన కూతురు ఉలూచి పేరుమీద రాయమని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode ఆస్తిలో అయిదు పైసలు కూడా నీకు ఇవ్వమని నయని సుమనకు చెప్తుంది. ఇక విశాల్ అయితే మరో ఛాన్స్ ఉంది సుమన నువ్వు ఇలా గొడవలు పడకుండా నీ మనసు మారి విక్రాంత్ నిన్ను దగ్గరకు తీసుకొని నువ్వు ఓ బిడ్డకు తల్లి అయితే ఆస్తిలో కొంత వాటా ఇస్తాం అని అంటాడు. దీంతో నయని దీని ప్రవర్తనకు వాంతి వస్తుంది గానీ ఇదెప్పుడు వాంతులు చేసుకోవాలి అని విశాల్‌ని తీసుకొని వెళ్లిపోతుంది. ఇక విక్రాంత్ కూడా తిట్టి వెళ్లిపోతాడు.  

సుమన: ఇలా ఎందుకు మాట్లాడానో నా ప్లాన్ ఏంటో మీకు అర్థం కాదు..
తిలోత్తమ: అఖండ స్వామి దగ్గరకు వచ్చి.. స్వామి మాకు నిన్నటి నుంచి ఏమీ వినిపించడం లేదు. 
అఖండ: ఏమైంది..
తిలోత్తమ: ఏమైంది అని అడిగారు కదా.. కొత్త ప్రయోగం చేయబోయి దెబ్బతిన్నాం. నయని చెవిలో మంచి నూనె పోసింది కానీ ప్రయోజనం లేదు.
వల్లభ: మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పోనీ పాట పాడండి వినిపిస్తుంది ఏమో..
అఖండ: అల్ప బుద్ధి గల అజ్ఞానివి నువ్వు. నిన్ను ఎన్ని అన్నా లాభం లేదు. 
తిలోత్తమ: వీడి ముఖం చూడకుండా నా ముఖం చూసి మాకు నయం అయ్యేలా చేయండి స్వామి. 
అఖండ: అలాగే.. తల ఒక పక్కకు వంచండి.. అని చెప్పి ఇద్దరి చెవిలో అఖండ స్వామి ఏవో నీరు పోస్తారు.తర్వాత రెండు చెవుల మీద గట్టిగా కొడతారు. దీంతో ఇద్దరికి చెవులు వినిపిస్తాయి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో..
తిలోత్తమ: మా చెవులకు అయిన గాయం మర్చిపోయాం.  మా గుండెకు ఆ లలిత అక్క గాయం చేసింది.
వల్లభ: ఆస్తి మొత్తం ఆ ఆనాథ పిల్లకు రాచిచ్చేసింది. 
అఖండ: ఎందుకు అంత ఆసక్తి అసలు అలా చేయడం వెనక కారణం తెలుసుకున్నారా.
తిలోత్తమ: గాయత్రీ పాప పేరు వెనకు దేవి చేర్చితే ఆ పిల్లే గాయత్రీ దేవిగా చెలామణి అవుతుంది అని ఆస్తి ఆ పాప పేరిట రాస్తారు అంట. 
వల్లభ: పోనీ ఆ పిల్ల అంతా అనుభవిస్తుంది అంటే అది లేదు. ఇంతలో గాయత్రీ పెద్దమ్మ వచ్చేస్తే ఇప్పుడు ఈ పిల్ల పేరిటి రాయనున్న 600 కోట్లు విలువైన ఆస్తి అంతా తూచ్ అని తీసుకుంటారు అంట. అప్పుడు ఈ పాపకి కేవలం 25 కోట్ల విలువైన ఆస్తి మాత్రమే వర్తిస్తుంది అంట.
అఖండ: గాయత్రీ పాప రాకపోతే..
తిలోత్తమ: రాకుండా ఎలా ఉంటుంది.
అఖండ: నేను అన్నది మీకు అర్థం కాలేదు. అసలు లలితా దేవికి ఈ పాప మీద ఎందుకు అంత మమకారమో అది తెలుసుకోండి. 
తిలోత్తమ: అది ఎలా తెలుసుకోవచ్చు.
అఖండ: లలితా దేవి రక్తపు మరకలతో అది తెలుసుకోవచ్చు. 
తిలోత్తమ: నేను చేస్తాను లలితా అక్కకు అయిన గాయంతో గాయత్రీ పాపకు ఆస్తి రాసిస్తాను అనే ఆలోచన కూడా రానివ్వకుండా చేయాలి.

ఇక తిలోత్తమ, వల్లభలు ఇంటికి వస్తారు. హాసిని తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరూ హాసిని దగ్గరకు వెళ్తారు. హాసిని వాళ్లిద్దరికి వినిపించదు అనుకొని నవ్వుతూ చాలా తిడుతుంది. వల్లభ, తిలోత్తమలు కావాలనే వినిపించనట్లు నటిస్తారు. తర్వాత ఇద్దరూ హాసిని కొడతారు. 

హాసిని: మనసులో.. వీళ్లకు వినిపిస్తుంది అని అందరికీ చెప్పాలి లేదంటే నాలాగే వాళ్లు బుక్ అయిపోయేలా ఉన్నారు. సారీ అత్తయ్య.. ఇద్దరికీ సారీ ఇంకెప్పుడూ అలా చేయను.. 
సుమన: దురంధరను లాక్కొని వస్తుంది.. తిలోత్తమ అత్తయ్య, వల్లభ బావగారు ఉండటం కూడా మంచిదే అయింది నువ్వు అడుగు పిన్ని.
దురంధర: వదిలేయవే.. 
విశాల్: అత్తయ్య డబ్బులు ఏమైనా కావాలా..
సుమన: ఆ విషయం కాదు.
విక్రాంత్: నువ్వు వెనక వేసుకొని వచ్చావు అంటే నీకు లాభం అయిన విషయమే అయింటుంది.
నయని: మరీ ముఖ్యమైన విషయం అయితే పెద్దమ్మగారు వచ్చాక మాట్లాడుదాం.
పావనా: వద్దమ్మా వద్దు ఆవిడ లేదు కాబట్టి ఈ మాత్రం అయినా మాట వస్తుంది. 
విశాల్: అత్తయ్య అభిప్రాయం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు..
పావనా: అల్లుడు అభయం ఇచ్చాడు నువ్వు చెప్పవే.
దురంధర: నయని గానవి నువ్వు కన్న కూతురు కదా.. పెద్దక్క ఏమో యావదాస్తిని గాయత్రీ పాపకి అసలు సిసలైన ఆస్తికి వారుసురాలిగా మీరు దత్తత తీసుకున్న ఈ పాపకి అక్క అన్నది అలా కాకుండా అదేదో ఈ గానవిని యువరాణిని చేసుకుంటే బాగుండేది అని పొరపాటున సుమనకు చెప్పాను అంతే.
పావనా: పొరపాటున నా భార్య అంది మీరు ఎవరు సీరియస్ అవ్వకండి..
వల్లభ: నాకు అదే అనుమానం వచ్చింది.
తిలోత్తమ: సొంత వాళ్ల కంటే ఆకట్టుకున్న వాళ్లకే ప్రాధన్యం ఇస్తారు అని తెలిసిన తర్వాత అడగటం అనవసరం అనిపించింది. 
హాసిని: చాలా సంతోషం లలితా అత్తయ్య ఆర్డర్ వేశాక ఇక గుసగుసలు కూడా అనవసరం.
సుమన: ఏంటి అక్క నువ్వు ఏమీ అభ్యంతరం చెప్పవా.. నీ కన్న కూతురి భవిష్యత్ కోసం.. పాల కోసం వచ్చిన ఈ బిడ్డను పరిపాలించే వరకు  తీసుకెళ్తున్నారు. నువ్వేమీ అడగవా..
నయని: బాబుగారు వాళ్ల పెద్దమ్మ మాటని గౌరవించాక నేను అడ్డుపడటం సభ్యత కాదు.
తిలోత్తమ: అర్థమైందా సుమన వాళ్లకు నచ్చనట్లు వాళ్లు చేస్తారు. మనం చూస్తూ ఉండాలి అంతే.
సుమన: గానవిని మీరు పట్టించుకోకపోతే పట్టించుకోలేదు నేను కన్న కూతురు ఉలూచి ఉంది కదా ఈ గాయత్రీ పాపకి వచ్చిన అదృష్టం నా బిడ్డకు అయినా రావాలి కదా అంటున్నా. 
హాసిని: అసలు ఏమైనా సంబంధం ఉందా గాయత్రీ ఎక్కడ ఉలూచి ఎక్కడ. ఇద్దరికీ చాలా తేడా ఉంది.
సుమన: ఈ పక్షపాతమే చూపించొద్దు అంటున్నాను. 
విశాల్: సుమన గొడవలు వద్దు పెద్దమ్మ ముందు చూపుతోనే ఇలాంటి నిర్ణయం చేశారు. జనాలు రకరకాల మాటలు అనకుండా ఇలా చేశారు. 
వల్లభ: మామయ్య వీళ్ల ప్లాన్ మీకు అర్థం కావడం లేదు. ఆస్తి మొత్తం ఈ అనాథ పిల్లకు రాసేస్తే రేపు మా ఆవిడో సుమనో నెల తప్పినా అందులో నుంచి ఐదు పైసల వాటా కూడా అడగలేం అని ప్లాన్ చేశారు.
దురంధర: ఇందులో ఇంత అర్థం ఉందా..
డమ్మక్క: మీ పద్దతే బాగుంటే రెండో బిడ్డను చూసేవాళ్లు..
సుమన: బయటవాళ్లను బాగా చూసుకుంటుంన్నారు కానీ సొంత వాళ్లనే..
హాసిని: నీకేం తెలుసు చిట్టీ ఎప్పుడు చూసినా ఆస్తి డబ్బు వీటి గురించే ఆలోచిస్తావ్. భర్త అన్నాక బాధ్యత ఉండాలి. వేసుకున్న చొక్కనే బరువు అనుకునే భర్తతో నేను కాపురం చేసి ఇంకో బిడ్డను కనాలా..
విక్రాంత్: సేమ్ ఫీలింగ్ సుమనను చూస్తే నాకు వస్తుంది వదిన. 
విశాల్: రేయ్ నువ్వు ఆగు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి దురంధర తన అభిప్రాయం చెప్పింది అంతే కదా..
సుమన: గానవిని ఆస్తికి వారసురాలిని చేయండి లేదంటే ఉలూచిని చేయండి అంతే కానీ ఈ అనాథని అధినేత్రిని చేస్తాను అంటే మేం ఒప్పుకోం.
నయని: ఉదే మాట పెద్దమ్మగారు వచ్చాక చెప్తావా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్: నాగులావరం శివయ్య దగ్గరకు మోక్షను తీసుకెళ్తున్న పంచమి - మహంకాళి ప్రత్యక్షం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Sharmila on YS Jagan |YSRపేరు  ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
IPL 2024: ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం,  ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం, ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
HBD Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Andhra Pradesh: వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
Embed widget