అన్వేషించండి

Naga Panchami Serial Today March 15th: 'నాగ పంచమి' సీరియల్: నాగులావరం శివయ్య దగ్గరకు మోక్షను తీసుకెళ్తున్న పంచమి - మహంకాళి ప్రత్యక్షం

Naga Panchami Serial Today Episode: మోక్ష బతికే ఉన్నాడనే నమ్మకంతో పంచమి మోక్షను తన ఊరు తీసుకెళ్తానని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Naga Panchami Telugu Serial Today Episode మోక్ష పంచమితో కలిసి స్ఫృహ తప్పి పడిపోతాడు. ఎంత లేపినా లేవడు. ఊపిరి అందదు. పల్స్ దొరకదు. అందరూ మోక్ష చనిపోయాడు అని గట్టిగా ఏడుస్తారు. వైదేహి పంచమి వల్లే ఇలా జరిగింది అని పంచమిని ఇంట్లో నుంచి తరిమేస్తుంది. పంచమి ఏడుస్తూ గుడికి వస్తుంది. మోక్షకి కాపాడమని అందుకు బదులు తన ప్రాణాలు తీసుకోమని వేడుకుంటుంది. స్వామి పాదాల చెంత తన తలపగటకొట్టుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో సుబ్బు వస్తాడు..

సుబ్బు: పంచమి పంచమి ఏమైంది ఏడుస్తున్నావు. పంచమి కన్నీళ్లు తుడుస్తాడు. అంత కష్టం ఏమొచ్చింది పంచమి.
పంచమి: చాలా ఘోరం జరిగిపోయింది సుబ్బు. మోక్షాబాబు ఇక లేరు. ఆ స్వామికి నువ్వు కూడా చెప్పు సుబ్బు. నేను ఇప్పుడే ప్రాణదానం చేస్తాను. 
సుబ్బు: మోక్ష చనిపోలేదు. 
పంచమి: సుబ్బు ఏం చెప్తున్నావ్ సుబ్బు. ఒకవేళ తను ప్రాణాలతో ఉంటే నువ్వు ఇక్కడ చనిపోయావు అని తెలిస్తే అప్పుడు నిజంగానే చనిపోతాడు పంచమి. 
పంచమి: మోక్షాబాబులో చలనం లేదు. ఎంత పిలిచినా లేవడం లేదు.
సుబ్బు: ఏదో జరిగుంటుంది అనే భయంతో ఒక నిర్ధారణకు రాకూడదు పంచమి పూర్తిగా నిజం తెలుసుకొని నువ్వు ఏ త్యాగానికైనా సిద్ధపడు.
పంచమి: నన్ను బయటకు తోసేశారు సుబ్బు. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలీడం లేదు. నీ మోక్ష నీకు చెప్పకుండా ప్రాణాలు వదలడు. భర్త శరీరంలో భార్య సగభాగం. నీ అంగీకారం లేకుండా ఏం జరగదు. నువ్వు భయపడకు పంచమి. కళ్లు మూసుకొని ధ్యానంలో కూర్చో పంచమి. నీ ఆత్మతో చూడు మోక్ష ఆత్మ కనిపిస్తుంది. అలా కనిపించలేదు అంటే మోక్ష ఆత్మ నిన్ను వదిలి పరమాత్మలో చేరినట్లే.. అధైర్య పడకు ముందు ధ్యానంలో కూర్చో.. మనసు పక్కన పెట్టి చూడు. 

 పంచమి స్వామిని ధ్యానిస్తుంది. మరోవైపు మేఘన తన అన్న నంబూద్రీ ఆత్మని పిలిచి అంతా అయిపోయింది అని పంచమి మోక్షని చంపేసింది అని చెప్తుంది. పంచమి విషకన్య అని తెలిసి కూడా మోక్ష పంచమితో కలిసి తనను తాను ఆత్మార్పణ చేసుకున్నాడు. లేకపోతే మోక్ష చనిపోయే అవకాశమే లేదు. 
నంబూద్రీ: పంచమి తన చేతులతో తాను మోక్షను చంపుకోదమ్మ. 
మేఘన: పంచమి వారించి దూరం పెట్టి ఉంటే మోక్ష ప్రాణాలు పోయేవి కాదు. మోక్షని బలిచ్చి శక్తులు పొందాలి అని ఎదురు చూస్తున్న నాకు ఇది పెద్ద శరాగతంలా మారింది. ఇక నాకు ఈ ఇంట్లో పని లేదు అన్నయ్య. పరిస్థితి చూసి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తా..
నంబూద్రీ: నువ్వు మాత్రం నిరాశపడకు. 

డాక్టర్ వచ్చి మోక్షని చూస్తారు. మోక్షకు పల్స్ దొరకడం లేదు బ్రీత్ కూడా అందడం లేదు అని చనిపోయాడో లేదో నిర్ధారించలేకపోతున్నాను అని డాక్టర్ చెప్తాడు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ ఏడుస్తారు. మరోవైపు పంచమి ధ్యానంలో కూర్చొంటుంది. ఇక మోక్ష ఆత్మ వచ్చి పంచమిని పిలుస్తుంది. దీంతో పంచమి ఆత్మ కూడా మోక్ష దగ్గరకు వెళ్తుంది. 

మోక్ష:  నిన్ను వదిలి పెట్టి నేను వెళ్లగలనా పంచమి నేను నీతోనే నీలోనే ఉన్నాను పంచమి. ఎక్కడికీ పోలేదు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే అప్పుడు నా ప్రాణాలు పోతాయి పంచమి. అంత వరకు నేను ప్రాణాలు వదిలిపెట్టను. నా ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి పంచమి. ఇంకెవ్వరూ తీసుకెళ్లలేరు. నాకు ప్రాణాలు పోసినా తీసినా నువ్వే చేయగలవు పంచమి. అని చెప్పి మోక్ష ఆత్మ వెళ్లిపోతుంది. ఇక పంచమి ఆత్మ కూడా పంచమిలో వచ్చి చేరుతుంది. 
పంచమి: పంచమి సంతోషంతో మోక్షాబాబు.. సుబ్బు.. సుబ్బు.. సుబ్బు మోక్షాబాబు చనిపోలేదు బతికే ఉన్నారు. 
సుబ్బు: నేను చెప్పాను కదా పంచమి. వెళ్లి నువ్వే మోక్షని కాపాడుకోవాలి. 
పంచమి: నన్ను ఇంట్లోకి రానివ్వరు సుబ్బు.
సుబ్బు: మోక్ష నీ భర్త పంచమి. నువ్వు మనసు పెట్టి ధైర్యం చేస్తే నిన్ను ఎవరూ అడ్డుకోలేరు ఆలస్యం చేయొద్దు పంచమి. నువ్వు పరమ శివుడి వరపుత్రికవు. శివయ్య కళ్లముందే పురుడు పోసుకున్నావు. నీ మెడలో శివయ్యే తాళి కట్టించారు. నీ సౌభాగ్యం అంత సులభంగా పోదు. నీ మాంగల్యం గట్టిది పంచమి. గట్టి నమ్మకంతో మోక్షని మీ ఊరు తీసుకెళ్లి ఆ శివయ్య కాల దగ్గర కూర్చొని వేడుకో. శివరాత్రి గడియలు ప్రారంభం అయ్యాయి. అణువణువుగా శివశక్తి ప్రారంభం అయ్యుంటుంది. బయల్దేరు పంచమి. 

జ్వాల: మోక్షని ఆ పంచమినే చంపుంటుంది. నేను అప్పడే చెప్పాను కదా.. 
మేఘన: తనలో తాను.. పంచమి పాము అని చెప్పేస్తే దాని కొట్టి చంపేస్తారు. అలా జరగకూడదు. అది నా చేతిలోనే చావాలి. నేనే దాన్ని చంపాలి.
పంచమి: మోక్షాబాబుకి ఏం కాలేదు. తనని నేను బతికించుకుంటాను. 
వైదేహి: నీకు ఎంత ధైర్యం మళ్లీ వస్తావు. నిన్ను ఇక్కడే చంపేస్తాను. నా కొడుకును ఈ స్థితికి తీసుకొచ్చిన నిన్ను వదలిపెట్టను. 
పంచమి: అత్తయ్య.. అత్తయ్య అని వైదేహిని తోసేసి.. మోక్షాబాబు నా భర్త. నాభర్తని  నేను బతికించుకుంటాను. 
వైదేహి: చూడండి నా కొడుకును ఏదో చేసి మళ్లీ ఇప్పుడు ఇలా అంటుంది. 
పంచమి: నా మాట నమ్మండి మామయ్య. మోక్షాబాబుకి ఏమైందో నాకు తెలుసు. నేను ప్రాణం కాపాడుతాను. 
శబరి: నా మనవడు బతికితే మాకు అంతకంటే ఏం కావాలమ్మా.. ఎలా మామూలు మనిషి అవుతాడో చెప్పమ్మ.
పంచమి: నా పసుపు కుంకుమలే నా భర్తను కాపాడుతాయి బామ్మగారు. నేను కోరుకుంటే తప్ప నా మాంగల్యభాగ్యాన్ని తుడిచే శక్తి ఎవరికీ లేదు.
వైదేహి: ఓసేయ్ నీకు పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావే. నిన్నూ..
పంచమి: ఈరోజు శివరాత్రి కదా మా ఊరు వెళ్లి పూజలు చేద్దామని అనుకున్నాం కదా మోక్షాబాబుని అక్కడికి తీసుకెళ్దాం. ఆ శివయ్యే మోక్షాబాబుకి ప్రాణం పోస్తాడు. 
శబరి: పంచమి మీద నాకు నమ్మకం ఉంది. ఈ ఇంటికి రాకముందే పంచమిని నేను కలలో ఓ దేవకన్యలా చూశాను. కచ్చితంగా పంచమి మోక్షను బతికిస్తుంది. 

పంచమి అందర్ని బతిమిలాడి వేడుకుంటుంది. పూజ పూర్తి అయ్యేలోపు మోక్షాబాబు కళ్లు తెరవకపోతే మీ కళ్లముందే నేను మంటల్లో కాలి బూడిద అవుతాను అని పంచమి చెప్తుంది. దీంతో పంచమి చెప్పినట్లు చేయడానికి రఘురాం ఒప్పుకుంటాడు. మరోవైపు కరాళి మహాంకాళి ధ్యానంలో ఉండటం అక్కడే ఉన్న నాగేశ్వరి చూస్తుంది. పాము రూపంలో కరాళి ఉన్న చోటుకి వెళ్లి దాక్కొని పరిశీలిస్తుంది. ఇక మహాంకాళి ప్రత్యక్షం అవడం చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  ప్రశాంత్‌ వర్మ: 'హనుమాన్‌' ఓటీటీ అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్ - స్ట్రీమింగ్‌ ఆలస్యంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ
  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget