(Source: ECI/ABP News/ABP Majha)
Trinayani Serial Today March 13th: 'త్రినయని' సీరియల్: లలితాదేవికి ప్రమాదమని తెలుసుకున్న నయని.. తిలోత్తమను టార్గెట్ చేసిన గాయత్రీ పాప!
Trinayani Serial Today Episode గాయత్రీ దేవి పుట్టలో పాలు పోయడానికి కట్టుకున్న చీరను నయనికి అడిగి తిలోత్తమ తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today March 13th Episode తిలోత్తమ, వల్లభ ఇద్దరి చెవిలో నయని వేడి ఆయిల్ వేసి కాటన్ పెడుతుంది. ఇక డమ్మక్క ఇద్దర్ని తీసుకెళ్తుంది. ఇక ఇద్దరి చెవిలు ఒకేసారి వినిపించకుండా పోవడానికి కారణం ఏంటని సుమన ప్రశ్నిస్తుంది. ఇక శివ అనే రామచిలుక మళ్లీ నయనితో మాట్లాడుతుంది. ఇక తిలోత్తమ తన భర్తలకు పట్టించుకోవడం లేదని.. విక్రాంత్ కూడా సుమనతో సరిగా లేదు అని అంటుంది. సమన మీద తనకున్న కోపం అంతా చిలుక వ్యక్తపరుస్తుంది. ఇంతలో నయనికి తన దివ్యదృష్టి వల్ల గాయత్రీ దేవి అక్క లలితా దేవికి ఇంట్లో గొడవల వల్ల చేతికి రక్తం వచ్చినట్లు కనిపిస్తుంది.
నయని: మనసులో.. కంగారుగా విశాలాక్షి అమ్మ తల్లి పెద్దమ్మ గారి చేతికి రక్తం అంటింది ఎందుకు. ఏం జరగబోతుంది.
విశాల్: నయని విన్నావా శివ ఏమన్నాడో..
నయని: వినలేదు బాబుగారు.
విశాల్: నయని ఏమాలోచిస్తున్నావు. అయినా నేను ఒక విషయం చెప్పాలి అని వచ్చి శివని చూడగానే ఆగిపోయాను. నయని పెద్దమ్మ ఫోన్ చేశారు.
నయని: కంగారుగా లలితమ్మ గారా..
విశాల్: రేపు ఇంటికి వస్తున్నారు అంట.
నయని: ఇక్కడికా..
శివ: గాబరా పడుతున్నావ్ ఏంటి నయని..
నయని: ఏదైనా పని ఉంటే మనమే పెద్దమ్మ గారి దగ్గరకు వెళ్దాం బాబుగారు.
విశాల్: పెద్దమ్మ వస్తాను అంటే వద్దు అన్నామ్ అంటే సీరియస్ అవుతారు.
గదిలో తిలోత్తమ, వల్లభలు చెవులు వినిపించక డీలాగా కూర్చొంటారు. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది. తిలోత్తమకు ఫోన్ వస్తే హాసిని తీసుకొని ఫోన్ మాట్లాడుతుంది. తిలోత్తమ కంగారు పడి వల్లభతో కలిసి ఫోన్ తీసుకుంటుంది. ఇక హాసిని వల్లభను తిడుతుంది. ఇద్దరిని ఓ ఆట ఆడేసుకుంటుంది.
ఇక నయని చీర పట్టుకొని హాల్‌లో నుంచి వెళ్తుంటే దురంధర చూసి ఎందుకు అని అడుగుతుంది. ఇక అందరూ అక్కడికి వస్తారు. మళ్లీ హాసిని తిలోత్తమ, వల్లభలను చెవుడు అని నవ్వుతూ తిడుతుంది.
విశాల్: వదినా ఛాన్స్ వచ్చింది కదా అని చెలరేగిపోవచ్చు కానీ టైం బాలేకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది..
విక్రాంత్: వదిన రిలాక్స్ ఏం తోచక హాల్‌లోకి వచ్చారు వదిన వదిలేయ్..
డమ్మక్క: తిలోత్తమ ఆ చీరను చూశావా..
దురంధర: ఇంత మంది గొంతులు చించుకుంటున్నా తనకేం వినపడట్లేదు. నువ్వు చెప్తే వినిపిస్తుందా.. తనకే చెప్తున్నావ్.
డమ్మక్క: చీరను చూస్తే సర్వం తెలుసుకుంటుంది ఆడది.
తిలోత్తమ: ఎక్కడిది ఆ చీర..
నయని: డమ్మక్క చెప్పింది నిజమే అత్తయ్యకు వినిపించకపోయినా చీర గురించి అడిగారు చూశారా..
తిలోత్తమ: ఆ చీర అయితే నయనిది కాదే..
విశాల్: కరెక్ట్‌గా చెప్పింది అమ్మ ఆ చీర నయనిది కాదు మా అమ్మది.
సుమన: ఇప్పుడెందుకు తీశారు బావగారు.
విశాల్: శుక్లషష్ఠి రోజు మా అమ్మ ఈ చీర కట్టుకొని పుట్టలో పాలు పోసింది మా అమ్మ. కాసేపు దేవుడి గదిలో ఉంచి తీశారు. నయని లోపల పెట్టు.
తిలోత్తమ: నయని ఆగు..
వల్లభ: ఆ చీర గురించి పూర్తి డిటైల్స్ చెప్పండి..
పావనా: ఇప్పుడే కథ అంతా చెప్పారు కదా.. మళ్లీ మొదటి నుంచి చెప్పమంటారా..
తిలోత్తమ: మనం చిచుకొంటే కాదురా వాళ్లు అర్థమయ్యేలా చెప్పాలి.
ఇక హాసిని సైగలు చేస్తూ ఆ చీర కోసం తిలోత్తమ వాళ్లకు చెప్తు తిలోత్తమ గొంతు పట్టుకుంటుంది. దీంతో తిలోత్తమ అర్థమైంది నన్ను వదలవే అంటుంది. ఏమర్థమైంది అని హాసిని అడిగితే.. తిలోత్తమ గాయత్రీ అక్కయ్య ఆ చీర కట్టుకొని పుట్టలో పాలు వేసిందని చెప్తుంది.
తిలోత్తమ: మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అనవసరం కానీ నాకు ఆ చీర అవసరం.
నయని: ఈ చీరతో మీకు ఏం పని అత్తయ్య.
తిలోత్తమ: ఈ చీరతో ఏం పని అని మీరు అనుకోవచ్చు. అయితే గాయత్రీ అక్కయ్య పుట్ట దగ్గర పూజ చేసినప్పుడు కట్టిన ఈ చీర ఈ పూట నా భుజం మీద ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది.
సుమన: కట్టుకోనప్పుడు మీద వేసుకుంటే ఏమవుతుంది.
తిలోత్తమ: మీరు ఏదైనా అనుకోండి చీర కావాలి అన్నాను ఇస్తారా ఇవ్వరా..
హాసిని: ఈవిడ కళ్లు పడ్డాయి అంటే అంతే విడిచిపెట్టదు.
నయని: బాబుగారు ఏమంటారు.
విశాల్: పర్వాలేదు నయని ఇచ్చేయ్ రేపు ఉదయం తీసుకో..
తిలోత్తమ: ఇస్తారా ఇవ్వరా..
నయని: ఇస్తాను అత్తయ్య.. ఇదిగో అని తిలోత్తమ భుజం మీద కప్పుతుంది నయని.
మరోవైపు గాయత్రీ దేవి ఫొటోని గాయత్రీ పాప చూస్తూ ఉంటుంది. ఇంతలో డమ్మక్క అది చూసి నీ చిత్రపటాన్ని నువ్వే చూసుకుంటున్నావ్ ఏంటి అమ్మ అని అంటుంది. ఇక గాయత్రీ పాప దగ్గరకు వెళ్లాలి అని అడుగు ముందుకు వేస్తే అక్కడ నీరు పడి ఉంటాయి. అది చూసి ఒక్క అడుగు ముందుకు వేసున్నా నేను పడేదాన్ని అని అనుకుంటుంది డమ్మక్క. ఇక ఈ నీరు ఇక్కడ పడేసింది నువ్వే కదా తిలోత్తమ కోసమే కదా ఇలా చేశావ్ అని అనుకుంటుంది డమ్మక్క. ఇక గాయత్రీ దేవి పగకు సాయం చేస్తాను అని డమ్మక్క అనుకొని తిలోత్తమ గదికి వెళ్తుంది. అక్కడ తిలోత్తమ గాయత్రీ దేవి చీర కప్పుకొని పడుకొని ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్ మార్చి 12th: ఆపదలో పంచమి.. మహారాణి ఆత్మ సాయం కోరిన నాగేశ్వరి!