అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Trinayani Serial Today June 26th: 'త్రినయని' సీరియల్: లలితాదేవి కుడి చేతికి ఏమైంది? చేతికి కట్లు, మసి.. ఇంట్లో ఉంటూనే ఫోన్స్, మెసేజ్‌లు! 

Trinayani Serial Today Episode విశాల్ ఇంటికి వచ్చిన లలితా దేవి కుడి చేతికి కూడా తిలోత్తమకు అయినట్లు గాయం కావడం దాని నుంచి మసిని విక్రాంత్ చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode నయని, హాసినిలు హర్ష గురించి ల్యాప్‌ట్యాప్‌లో సెర్చ్‌ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు. హర్ష ఆత్మ వచ్చి నీతో ఏం చెప్పిందని హాసిని నయనిని అడుగుతుంది. దానికి నయని తిలోత్తమను చూసి భయపడ్డాడు అని చెప్తుంది. 

విశాల్: అమ్మని చూసి హర్ష ఆత్మ ఎందుకు భయపడింది అన్న కోణంలోనే ఆలోచించాలి.
హాసిని: హర్ష చనిపోవడానికి అత్తయ్యకి ఏదైనా లింక్ ఉందా.
నయని: నాకు అదే అనుమానంగా ఉంది. వారం క్రితం హర్షకు ప్రమాదం జరిగినట్లు నాకు కనిపించింది.
విశాల్: ఆపద వస్తే నువ్వు కాపాడుతావు. కానీ ఇక్కడ ఆల్రెడీ హత్యకు గురయ్యాడు అని చెప్పావు. వారం అయింది అంటున్నావ్ అంటే అంతకు ముందే చనిపోయి ఉండొచ్చు.
హాసిని: తిలోత్తమ అత్తయ్య సర్పదీవికి వెళ్లి వచ్చిన తర్వాతే అలా కనిపించిందా.
నయని: అవును.
హాసిని: అయితే అత్తయ్యకి హర్ష హత్యకి లింక్ ఉంది. ఇది గ్యారెంటీ. 
విశాల్: వదినా సాక్ష్యం లేకుండా ఏం అనలేం.
నయని:  ఈసారి హర్ష వస్తే అన్నీ తెలిసిపోతాయి. 

పావనా మూర్తి గాయత్రీ పాపని హాల్‌లో ఆడిపిస్తుంటాడు. అందరూ అక్కడికి వస్తారు. సుమన పాపని బొమ్మలతో ఆడుకునే టైప్ కాదు తల్లిలా మనుషులతో ఆడుకుంటుందని అంటుంది. దానికి విక్రాంత్ వదిన ఎవరి జీవితాలతో ఆడుకుందని అంటాడు. నాతోనే అని సుమన అంటుంది. ఈ ఇంట్లో అందరూ తనని ఇబ్బంది పెడతారని తిలోత్తమ మాత్రమే సపోర్ట్ చేస్తుందని సుమన అంటుంది. ఇక తిలోత్తమ ఇంట్లో లేదు అని రాత్రి నుంచి కనిపించడం లేదని నయని, విశాల్ చెప్తారు. వల్లభ మమ్మీ మమ్మీ అని ఏడుస్తాడు. ఇంతలో లలితా దేవి వస్త్రం కప్పుకొని వస్తుంది. సుమన లలితాదేవితో పది రోజుల్లో అందరి కంటే ఎక్కువ ఆస్తి సంపాదించిందని చెప్తుంది. 

విశాల్: పెద్దమ్మ శాలువా కప్పుకొని వచ్చావ్ ఏంటి. ఏమైంది.  
లలితాదేవి: వయసు మీద పడే కొద్ది ఆరోగ్యం మన చేయి దాటిపోతుంది కదా నాన్న. ఏం కాలేదు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. 

ఇంతలో గాయత్రీ పాప శాలువా లాగేస్తుంది. దాంతో లలితాదేవి చేతికి కట్లు వేసి ఉంటడం అందరూ చూస్తారు. షాక్ అయిపోతారు. ఏమైందని అడుగుతారు. జారి పడ్డానని దెబ్బ తగిలిందని చెప్తుంది. నెల రోజులు చేతికి కట్టు ఉంచాలని డాక్టర్లు చెప్పారని లలితాదేవి చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్ల ద్వారా తిలోత్తమ కుడి చేతి గురించి లలితా దేవికి చెప్తారు. ఇక సుమన తిలోత్తమ కుడి చేతికి దెబ్బ తగిలి ఆస్తులు సంపాదించిందని లలితాదేవికి కుడి చేతికి దెబ్బ తగిలి నష్టాలు వచ్చాయిన్నట్లు మాట్లాడుతుంది. ఇక హాసిని మాటల్లో లలితాదేవి కుడి చేతిని పట్టేస్తుంది. దాంతో లలితాదేవి హాసిని చెంప పగలగొడుతుంది. లలితాదేవి అనవసరంగా కొట్టేశాను అని బాధపడుతుంది. నయని లలితాదేవిని ఓదార్చుతుంది. ఇంతలో వల్లభ మా మమ్మీని అయితే దెప్పిపొడుస్తారు. పెద్దమ్మని ఏమీ అనరు అని అంటాడు. హాసిని మాత్రం కామెడీ చేసేస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. ఇక రెండు రోజులు ఉంటాను అని లలితాదేవి అంటుంది. 

విశాల్: అన్నయ్య తిలోత్తమ అమ్మకి కాల్ చేసి త్వరగా రమ్మను.
లలితాదేవి: నేను వచ్చాను కదా తను రాదు. సర్పదీవి నుంచి ఎలా తిరిగి రాగలిగావు అంత అదృష్టం ఎలా వచ్చిందని రకరకాలుగా అడుగుతాను అని జారుకొని ఉంటుంది. 

సుమన గదిలోకి వెళ్లి తన చేతికి కూడా కట్టు వేసుకుంటుంది. విక్రాంత్ ఏమైందని అడిగితే లలితాదేవి స్నానానికి వెళ్లి బెల్ట్ తీసి పక్కన పెడితే తాను తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అని అంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. తీయమని చెప్తాడు.  సుమన నుంచి ఆ బెల్ట్ తీసుకున్న విక్రాంత్ దానికి మసి అంటడం చూస్తాడు. సుమన చేతికి కూడా మసి అంటుతుంది. పెద్దమ్మని ఎవరు బురిడీ కొట్టించారా అని పెద్దమ్మనే అడుగుతాను అని అంటాడు. ఇక విశాల్‌కి పెద్దమ్మ కాల్ చేసిందని చెప్తాడు. ఇంట్లో ఉన్నామె పిలవకుండా ఫోన్ చేయడం ఏంటని నయని, విశాల్, హాసిని షాక్ అవుతారు. ఫ్రెష్ అవుతాను అని వెళ్లిన వాళ్లు కాల్ చేశారు ఏంటని అనుకుంటారు. వాష్ రూమ్‌లోకి ఫోన్ ఎలా తీసుకెళ్తారు అని అనుమానిస్తారు. ఇక విశాల్ కాల్ చేస్తాడు. కాల్ బిజీ అని వచ్చిందని బిజీగా ఉన్నాను అని మెసేజ్ పెట్టారని విశాల్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఫ్యాన్స్‌కి పండగే.. సత్యలో మొదలైన మార్పు, భర్తని చూ..స్తూ ఉండిపోతుందిగా.. ఎగిరి గంతేస్తున్న క్రిష్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Vizag Crime News: లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Embed widget