అన్వేషించండి

Trinayani Serial Today June 12th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షిని చూసి అఖండ దగ్గరకు పరుగులు పెట్టిన తిలోత్తమ.. గ్లౌజ్ విషయంలో రిస్క్ చేద్దామన్న నయని!

Trinayani Serial Today Episode విశాలాక్షిని చూసిన తిలోత్తమ కుడి చేయి వణికి ఏమైపోతుందా అనే భయంతో అఖండ స్వామి దగ్గరకు పరుగులు తీయడం పరిష్కారం తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode ఉలూచిని విశాలాక్షి గారడి చేసి పాముగా మార్చిందని సుమన భావించి చేయి ఎత్తుకొని వెళ్తుంది. దీంతో వెంటనే నయని వచ్చి సుమన చెంప పగల గొడుతుంది. ఆస్తి రాలేదని ఫీలవ్వొద్దని ఎలాగూ ఆస్తి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇస్తానని విశాల్ అంటాడు. సుమన హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నయని మాత్రం చిల్ల గవ్వ కూడా ఇవ్వనివ్వను అని అంటుంది. తాను కూడా సంతకం పెడితేనే ఆస్తి వాటా తనకు వెళ్తుందని అందుకే తను ఆ ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టను అని తెగేసి చెప్తుంది నయని.

నయని: మా చెల్లి పొగరు దగ్గరుండి చూసిన దాన్ని ఆస్తి వచ్చిన తర్వాత పాము పిల్ల ఆడ పిల్ల నాకు ఎందుకు అని వదిలేసినా ఆశ్చర్యం లేదు. అందుకే పూర్తి అర్హత సంపాదించే వరకు ఒక్క రూపాయి కూడా రాసిచ్చే ప్రసక్తే లేదు.
విశాలాక్షి: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ అమ్మ. 
డమ్మక్క: ఇంకేం చూస్తున్నావ్ సుమన ఉలూచిని తీసుకెళ్లి పాలు ఇవ్వు.

తిలోత్తమ: ఏంటి స్వామి మీరు కూడా నన్ను గుర్తు పట్టడం లేదా.
అఖండ: నీ దేహం మారలేదు తిలోత్తమ నీ రూపం మాత్రమే మారింది. సర్పదీవి నుంచి బయట పడ్డాక నువ్వు ఎవరిని కలిశావో ఏం చేశావో నాకు అంతా తెలుసు.
తిలోత్తమ: నాకు తెలియని ఒక విషయం కోసం వచ్చాను స్వామి. 
అఖండ: నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంట్లో లేవో చెప్తే నీ సందేహం కూడా నివృత్తి అవుతుంది తిలోత్తమ. 
తిలోత్తమ: నేను గుమ్మం ముందు నిలబడి ఫోన్ మాట్లాడుతున్నా స్వామి ఉన్నట్టుండి నా కుడి చేతి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయి. ఏం అయ్యాయా అని చూస్తే విశాలాక్షి ఇంటి వైపు వస్తుంది. తన దగ్గరకు వస్తే నా కుడి చేయి నా నుంచి దూరంగా వెళ్లిపోతుంది అనిపించింది. గారడీ పాపలో మంత్రం ఉందో మాయ ఉందో తను నా రూపానాకి శాపం కాకూడదు అనుకొని అక్కడి నుంచి దూరంగా వెంటనే మీ దగ్గరకు వచ్చాను. ఎందుకు ఇలా జరిగింది అంటారు.
అఖండ: తిలోత్తమ ఆ చేతిని నువ్వు ఏం చేశావు. 
తిలోత్తమ: అంటే స్వామి అది..
అఖండ: మానవాతీత శక్తిని ఆపాదించుకునే ప్రయత్నం చేశావ్. తంత్ర, మంత్ర, కుతంత్ర శక్తిని కూడ దీసుకున్నా సరే విశాలాక్షి శక్తి ముందు సరిపోదు తిలోత్తమ. నివ్వెరపోయావా తిలోత్తమ.
తిలోత్తమ: గారడి పిల్ల ఆఫ్ట్రాల్ మ్యాజిక్‌లు చేసుకొనే అనాథ నన్ను మించిన శక్తి కలదా.
అఖండ: ఈ గర్వమే మనిషిని నిలువెల్లా ముంచేస్తుంది. నిన్ను మించిన శక్తి లేదు అని విశాలాక్షిని చూడగానే పారిపోయి వచ్చావు.
తిలోత్తమ: నా చేతికి ఏమైందో అని వచ్చాను.
అఖండ: నీ చేతిని అలా మార్చిన వారి దగ్గరకు వెళ్లకుండా నా దగ్గరకే ఎందుకు వచ్చావ్. నీ మనసు రప్పించింది. పరిష్కారం దొరకకపోతే ఏమవుతావో అనే భయం ఈ పని చేయించింది. విశాలాక్షి ఓ శక్తి. పరమేశ్వరుడిని తను ఆరాధించినట్లు, తను మమేకం అయినట్లు ఎవరూ చేయలేరు.
తిలోత్తమ: శివభక్తురాలిని నిలువరించడం ఎలా.
అఖండ: భక్తితోనే అంటూ చేతికి పువ్వు ఇచ్చి అది విశాలాక్షికి భక్తితో సమర్పించమని ఎప్పుడూ తన జోలికి వెళ్లొద్దని చెప్తారు. లేదంటే తన దరిదాపుల్లోకి వెళ్లలేవని తన జోలికి వెళ్తే ఈ రూపం కూడా నీకు మిగలదు అని అఖండ హెచ్చరించి పంపిస్తారు. 

ఆస్తి పోయిందని సుమన ఏడుస్తుంది. విక్రాంత్ వెటకారంగా సెటైర్లు వేస్తాడు. మరోవైపు హాసిని విశాల్, నయనిల దగ్గరకు నవ్వుతూ వెళ్తుంది. ఎందుకు నవ్వుతున్నావ్ అని ఇద్దరూ అడిగితే సుమన ఆస్తి వస్తుందని గెంతిందని ఇప్పుడు ఢీలా పడిపోయిందని అంటుంది.

నయని: నాకు అర్థం కానిది ఒకటే అక్క. ఉలూచి పాప కాళ్లకు వేసుకున్న సాక్సులు మా చెల్లి తీయడం తర్వాత పాము పిల్లగా మారిందని విశాలాక్షి చెప్తుంది. సాక్సులు తీసేస్తే మార్పు ఎలా వస్తుంది.
విశాల్: ఆ సాక్సుల్లోనే గమ్మత్తు ఉంది అనుకుంటా నయని.  
నయని: పాప సాక్సుల వల్ల మార్పులు జరిగితే తిలోత్తమ అత్తయ్య చేతికి వేసుకున్న గ్లౌజ్ వల్ల కూడా ఏదైనా మార్పు జరుగుతుందా.  
విశాల్: ఆ గ్లౌజ్‌ల జోలికి వెళ్తే అమ్మ అపరకాళిలా మారిపోతుంది. అది తెలిశాక ఇంకా ఏం తెలుసుకోవాలి అని.
నయని: అది తెలుసుకోవాలి అంటే ఈ విషయంలో ఇంకేం తెలుసుకోలేం సుమనకు సాయం చేయలేం. ఉలూచి పాప పెరిగి పెద్దయ్యే కొద్ది అందరికీ సమాధానం చెప్పి జీవనం సాగించాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. రిస్క్ చేద్దాం. 

మరోవైపు తిలోత్తమ అఖండ స్వామి ఇచ్చిన పువ్వు తీసుకొని వస్తుంది. ఇక హాల్‌లో విశాలాక్షి ధ్యానం చేస్తుంటుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. తిలోత్తమ చేతిలో పువ్వు చూస్తారు. ఇక తిలోత్తమ విశాలాక్షికి పువ్వు ఇవ్వాలి అనుకుంటుంది. ఇక సుమన విశాలాక్షి అంత ఘనకార్యం చేయలేదు అని ఇంట్లో జరిగిన సంగతి తనకు తెలియాలి అని సుమన అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిత్రని కాపాడిన లక్ష్మీ.. అరవిందకు తెలిసిపోతుందా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget