Trinayani Serial Today July 17th: 'త్రినయని' సీరియల్: నయని తొలిబిడ్డకు గండం.. ఈసారి కచ్చితంగా నయని తన బిడ్డను కలుస్తుందన్న గురువుగారు!
Trinayani Serial Today Episode గాయత్రీపాపని గంటలమ్మకు గురుదక్షిణగా ఇచ్చేస్తానని తిలోత్తమ వల్లభకు చెప్పడం గురువుగారు ఇంటికి వచ్చి నయని తొలి బిడ్డకు గండం ఉందనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode ఉలూచిని తిరిగి ఆడపిల్లలా మార్చమని తిలోత్తమ పెద్దబొట్టమ్మకు చెప్తుంది. పెద్దబొట్టమ్మ ఉలూచిని పిలిచి ఆడపిల్లలా మార్చి నయనికి ఇస్తుంది. ఇక తిలోత్తమ నాగయ్యకు మంట పెట్టమని సుమనకు సైగ చేస్తుంది. సుమన నాగయ్య పాముకి మంట పెట్టబోతే మేడ మీద నుంచి గాయత్రీ పాప నిప్పు మీద నీరు పోసేస్తుంది. అందరూ సంతోషిస్తారు. క్లాప్స్ కొడతారు. పెద్దబొట్టమ్మ సంతోషంతో గాయత్రీ దేవి ఫొటోకి దండం పెడుతుంది.
వల్లభ: మమ్మీ నువ్వు మళ్లీ ఆస్తి రాసివ్వకపోయినా సరే సుమన నువ్వు సైగ చేయడంతో నాగయ్య పాముకి నిప్పు పెట్టడానికి రెడీ అయిపోయింది. కానీ చిచ్చర పిడుగు గాయత్రీ పాప నాశనం చేసేసింది.
తిలోత్తమ: ఏడాదిన్నర పిల్లకి ఇన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయని ఆలోచిస్తూనే ఉన్నాను వల్లభ. అలాంటి చలాకీ పిల్లనే నాకు పనికి వస్తుందని గంటలమ్మ చెప్తుంది. తాంత్రికపూజ చేసే వారి దృష్టి వేరే ఉంటుంది.
వల్లభ: అందుకేనా గాయత్రీ పాప నాకు కావాలని మొన్న అడిగింది.
తిలోత్తమ: దూరంగా తీసుకెళ్లి తన లక్ష్యం నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది గంటలమ్మ. గాయత్రీ పాప అడ్డుపడుతుంది అంటే ఏంటి దాని అర్థం.
వల్లభ: చిన్న పిల్లలకు కూడా నీ చేష్టలు నచ్చడం లేదని అర్థం.
తిలోత్తమ: రేయ్.. నయని కన్న బిడ్డ కాకపోయిన ఈ దత్త పుత్రిక మన విషయంలో జోక్యం చేసుకుంటుంది. అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను వల్లభ. గాయత్రీ పాపని గంటలమ్మకి అప్పగించాలని అనుకుంటున్నారు. ఏంటి అలా చూస్తున్నావ్. గంటలమ్మ కావాలి అన్నది గురు దక్షిణ చెల్లించాలి అంటే ఈ పని చేయక తప్పదు.
వల్లభ: రిస్క్ ఏమో నయనికి తెలిస్తే.
తిలోత్తమ: తెలిసేలా చేస్తాను అదే నా ప్లాన్.
రాత్రి నయని, విశాల్, హాసినిలు మాట్లాడుకుంటారు. గాయత్రీ పాప డ్రెస్ చాలా బాగుందని అంటుంది. ఇక సుమన విషయంలో తెలిసో తెలీకో గాయత్రీ పాప మంచి పని చేసిందని నయని అంటే.. హాసిని వెంటనే తెలిసే చేసింది గాయత్రీ అత్తయ్యకు అన్నీ తెలుసు కదా అని అంటుంది. నయనితో పాటు విశాల్ షాక్ అవుతారు. గాయత్రీ అత్తయ్య అన్నావు ఏంటి అని నయని అడుగుతుంది. దానికి హాసిని తను పాపని అనలేదని గాయత్రీ ఆత్మ ఇంట్లో ఉందని కాబట్టి మంట ఆర్పమని ఈ పాపకి పురమాయించొచ్చని హాసిని అంటుంది. ఇక మరోవైపు సుమన, విక్రాంత్‌లు గొడవ పడతారు. పాపే తన ఆస్తి అని సుమన అంటుంది. ఉలూచి కోసం పెద్దబొట్టమ్మ వస్తే చంపేస్తానని అంటుంది. పాపని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవని.. ఆశలు కోసం ఆస్తుల కోసం బిడ్డని అప్పగిస్తావని విక్రాంత్ అంటాడు. దానికి సుమన ఈ ఆలోచిన ఏదో బాగుందని లోతుగా ఆలోచించాలని అనుకుంటుంది.
ఉదయం గురువుగారు హడావుడికి ఇంటికి వచ్చి నయనిని కంగారుగా పిలుస్తారు. అందరూ పరుగున వచ్చి ఏమైందని గురువుగారిని అడుగుతారు. హాసిని అయితే గురువుగారు ఇలా పిలుస్తున్నారంటే కీడు వస్తుందేమో అని అంటుంది. గురువుగారు నయనికి కొంగు పట్టుకోమని మంత్రించి కొంగులో పువ్వు వేస్తారు. పువ్వు తీసుకొచ్చి నయని కొంగులో వేశారు ఎందుకని తిలోత్తమ అడుగుతుంది.
గురువుగారు: కడుపు కోత కలగకుండా చూసుకొనే బాధ్యత నయనికి ఉంది.
విశాల్: మన కన్న బిడ్డలు గురించి చెప్తున్నారనుకుంటా.
గురువుగారు: అవును విశాలా మీ బిడ్డకు ప్రాణ గండం ఉంది.
హాసిని: గాయత్రీ పాపకి గండమా.
పావనా: గానవీకి ఉంటుంది కానీ గాయత్రీ పాపకు ఎందుకు ఉంటుందమ్మా.
తిలోత్తమ: ఎవరికి గండం వచ్చినా నయనికి తెలిసిపోతుంది కదా.
గురువుగారు: తనకి గానీ తన బిడ్డలకు గానీ ఆపద వస్తే గ్రహించలేని దురదృష్టవంతురాలు నయని.
సుమన: ఇంట్లో ఉన్న గానవిని కాపాడుతావు అక్క. ఇంటికి రాని తొలిబిడ్డ పరిస్థితి ఏంటి.
దురంధర: మరి ఆ పుష్పం ఎందుకు ఇచ్చినట్లు.
గురువుగారు: తన బిడ్డల్లో ఎవరికి ఆపద వచ్చినా ఈ పుష్పం రక్షించడానికి సాయ పడుతుంది. అమ్మవారి శిరస్సున అలంకరించిన పుష్ఫం నయని దరికి చేరింది. ఇప్పుడు గండం కనుక తన కన్న తొలిబిడ్డను కబళించబోతుంది అన్నప్పుడు ఈ పుష్పం ఆధారంగా నయని తన తొలి బిడ్డ దగ్గరకు వెళ్తుంది.
సుమన: మా అక్క కన్నబిడ్డను కలవడమే ఓ గండం అని అర్థమైంది.
దురంధర: నీ మొఖమే. మాకు అయితే నయని తన తొలిబిడ్డ దగ్గరకు వెళ్తుందని అనిపిస్తుంది.
గురువుగారు: సత్యం.
నయని: అంటే నేను అమ్మగారిని కలుసుకోబోతున్నానా స్వామి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.