అన్వేషించండి

Trinayani Serial Today July 16th: 'త్రినయని' సీరియల్:చితి పెట్టడానికి సిద్ధమైన సుమన.. నాగయ్య, పెద్దబొట్టమ్మలకు అండగా ఉలూచి! 

Trinayani Serial Today Episode ఉలూచిని పాములా మార్చిన పెద్దబొట్టమ్మని సుమన చంపకుండా నాగయ్య పాము అడ్డురావడం నాగయ్యని కాపాడటానికి ఉలూచి సుమనకు అడ్డు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode ఉలూచి కాళ్ల గాయాలు తగ్గిస్తానని పెద్దబొట్టమ్మ పసుపు తీసుకొని వచ్చి రాస్తుంది. దాంతో ఉలూచి పాములా మారిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. సాక్సులు తీసినందుకే అలా అయిందని విశాల్ అంటాడు. సాక్సులు తీయొద్దన్నాను కదా అని తిలోత్తమ సుమనతో అంటుంది. 

సుమన: వీళ్లే కదా అత్తయ్య నయం అవుతుందని పసుపు రాయించారు. 
పెద్దబొట్టమ్మ: పెద్దగా నవ్వుతూ.. సాక్సులు తీస్తే పాము పిల్లగా మారుతుందని మీకు తెలిసినా ఆ విషయం మర్చిపోయారు నయని. ఇప్పుడు ఉలూచి పాము పిల్లలా మారిపోయింది. మళ్లీ ఆడపిల్లలా ఎవరు మారుస్తారు. 
విశాల్: అంటే ఇలా మారాలి అనే పసుపు రాశావా పెద్దబొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: అవును విశాల్ బాబు. పసుపు రాస్తే నయం అవుతుందని నేను అబద్దం చెప్పాను. సుమన కోపంగా లోపలికి వెళ్తుంది.  
తిలోత్తమ: ఇక పాము పిల్లగానే ఉండిపోతుందా ఉలూచి. 
పెద్దబొట్టమ్మ: లేదు తను తిరిగి ఆడపిల్లలా మారాలి అంటే విశాలాక్షి అయినా తిరిగి రావాలి లేదంటే నేను అయినా మార్చాలి. 
విక్రాంత్: ఆ పని చేయి పెద్దబొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: కాసేపు అయినా ఇలా ఉన్ని బాబు నాతో నా బిడ్డ కొద్ది సేపు అయినా ఆడుకుంటుంది. తన ఆలనా పాలనా చూసుకుంటాను.

సుమన లోపల నుంచి కర్ర తీసుకొని వచ్చి పెద్దబొట్టమ్మ తలమీద కొట్టేస్తుంది. పెద్దబొట్టమ్మ కళ్లు తిరిగి పడిపోతుంది. చంపేస్తానని సుమన అంటే నయని, విక్రాంత్ ఆపుతారు. తన బిడ్డ మళ్లీ ఆడపిల్లలా మారేది ఎప్పుడని ఏడుస్తుంది. తన బిడ్డని మళ్లీ ఆడపిల్లలా మార్చకపోతే ఈ ఇంట్లో నుంచి పెద్దబొట్టమ్మ శవం వెళ్తుందని సుమన సీరియస్‌గా అంటుంది. విక్రాంత్ సుమన వెనకాలే వెళ్లి రౌడీ అనుకుంటున్నావా అని తిడతాడు. ఉలూచిని ఆడపిల్లలా మార్చకపోతే మాత్రం పెద్దబొట్టమ్మని ఉంచనని అంటుంది. మరోవైపు పెద్దబొట్టమ్మని సోఫా మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లి అందరూ లేపుతారు. పెద్దబొట్టమ్మ లేవదు. విక్రాంత్ వచ్చి డాక్టర్‌ని పిలుద్దామని అంటాడు. ఇంతలో ఎవర్నీ పిలవక్కర్లేదని చేతిలో నిప్పు పట్టుకొని సుమన వస్తుంది. 

నయని: సుమన ఎందుకు మంట అంటుకున్న కర్ర పట్టుకొని వచ్చావ్.
విశాల్: సుమన ఏమైంది నీకు.
సుమన: మీరంతా కలిసి నేను రాకముందే పెద్దబొట్టమ్మని లేపి పంపేయాలి అని చూస్తున్నారు కదా. 
నయని: నువ్వు కొట్టిన దెబ్బకి పెద్దమ్మ ప్రాణం పోతుందేమో అని లేపే ప్రయత్నం చేస్తున్నాం అంతే. 
తిలోత్తమ: తను లేవగానే ఆగుతుందా పాముగా మారిపోయి ఇక్కడి నుంచి పారిపోతుంది. 
వల్లభ: పాము పిల్లగా మారిన ఉలూచి పరిస్థితి ఏంటి ఇక అలాగే ఉండాలా. 
పావనా: అమ్మ అసలు ఎందుకు నిప్పు తీసుకొచ్చావ్.
సుమన: పెద్దబొట్టమ్మకు చితి పెడదామని. 
నయని: ఏయ్ పిచ్చా నీకు తను ఇంకా ప్రాణాలతో ఉంది.
తిలోత్తమ: అయితే ప్రాణాలు పోయే వరకు ఆగండి. అంతే కదా నాన్న. తను ప్రాణంగా చూసుకునే కూతురు పాములా మారితే సుమన పరిస్థితి ఎలా ఉంటుంది. 
వల్లభ: అసలే ఆస్తి పోగొట్టుకున్నానని బాధలో ఉంది.

సుమన నిప్పు పెడతాను అని అంటే అందరూ సుమనను తిడతారు. సుమన మంట పెడతానని వస్తే నయని అడుగు ముందుకేస్తే చచ్చిపోతావ్ అని అంటుంది. కాలు ముందుకు వేస్తే నాగయ్య కాటేస్తాడని అక్కడికి వచ్చిన నాగయ్య పాముని చూపిస్తుంది. కోపంతో సుమన ముందు నాగయ్య పాముకే చితి పెడతానని నిప్పు పెట్టబోతే పెద్దబొట్టమ్మ లేచి అంత పని చేయకు సుమన అని రెండు చేతులు జోడించి దండం పెడుతుంది. తన భర్తని ఏం చేయొద్దని ఏడుస్తుంది. నాగయ్యని కాల్చాలని చూస్తే తన బిడ్డ ఉలూచిని కూడా చంపాల్సి ఉంటుందని నాగయ్య పాము మీద ఉన్న ఉలూచి పాముని చూపిస్తాడు విశాల్. సుమనతో పాటు అందరూ షాక్ అయిపోతారు. భార్యని కాపాడాలని భర్త, తల్లిదండ్రులను కాపాడాలని ఉలూచి వచ్చిందని నయని అంటుంది. ఇక వల్లభ కాల్చేయ్ మంటే తిలోత్తమ వల్లభను కొడుతుంది. తన వల్ల ఉలూచి పాదాలు కాలిపోయావని గిల్టీగా ఉంటే నాగుపాములను సజీవంగా ఉన్నప్పుడు చంపమంటావా అని తిడుతుంది. తన తల్లి రివర్స్ అయిందంటే ఏదో ప్లాన్ వేసుంటుందని వల్లభ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: లక్ష్మీని ఉద్యోగం నుంచి తీసేసిన అర్జున్.. జేఎమ్మార్‌ని ఇంప్రెస్ చేసేదెవరు.. ప్రాజెక్ట్ దక్కించుకునేదెవరు?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget