Trinayani Serial Today January 4th: 'త్రినయని' సీరియల్: బామ్మని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసిన తిలోత్తమ.. ఆత్మలింగం కామెడీ కాదు!
Trinayani Today Episode నయని ఇంట్లో ఆత్మలు ఉన్నాయని తిలోత్తమ ఆత్మలింగాన్ని ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode విక్రాంత్, సుమన మాట్లాడుకుంటారు. తాను నయని కాబట్టే హాసిని విషం కలిసిన పాలు తాగకుండా ఆపిందని ఈ విధంగా మరోసారి నిజం నిరూపణ అయిందని విక్రాంత్ అంటాడు. ఆ పాలు ఏదో నువ్వు తాగుంటే నయని వదిన వచ్చి ఆపకుండా నేను అడ్డుకునేవాడిని అని అంటాడు. సుమన ఉడికిపోయి మీ అందరికీ పెద్ద షాక్ ఇస్తా అని చెప్పి వెళ్లిపోతుంది. దురంధర బయట కూర్చొని ఉంటే బామ్మ అక్కడకి వస్తుంది. తిలోత్తమ కూడా వచ్చి మీకు మతి పోయింది అన్న వాళ్లు పిచ్చోళ్లని అంటుంది. సుమన, విక్రాంత్ కూడా అక్కడికి వస్తారు.
తిలోత్తమ: నిజంగా మీరు మీ మనవరాలు త్రినేత్రి ఇళ్లు వదిలి వెళ్లిపోవడం చూశారా.
బామ్మ: విశాల్ బాబుగారితో నేను జీవితం పంచుకోలేనప్పుడు నేను బతికుండి అనర్థం అని పారిపోయింది.
తిలోత్తమ: మీ మనవరాలు ఇన్నాళ్లు ఇక్కడే ఉందని నయని అంది. ఇక్కడ ఉన్నప్పుడు నయని విశాల్ భార్య అని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా నయని జీవితంలో ఎందుకు నాశనం చేయాలి అనుకుంది.
విక్రాంత్: తీగ లాగితే డొంక కదిలినట్లుంది అమ్మని ఎలా ఆపాలి.
తిలోత్తమ: విశాల్ నయనికి అన్యాయం చేయడు కనీసం తన భార్యలా ఉన్న త్రినేత్రితో కనీసం మాట్లాడదు చనువుగా కూడా ఉండడు.
సుమన: అసలు త్రినేత్రి విశాల్ బావగారు కావాలి అంటే ఇంటి నుంచి వెళ్లదు కదా.
తిలోత్తమ: కరెక్ట్.
విక్రాంత్: బామ్మ గారిని భయపెట్టడానికి త్రినేత్రి అలా చెప్పి ఉంటుంది.
బామ్మ: నాకు నిద్ర వస్తుంది.
సుమన: వీటికి బామ్మ సమాధానం చెప్తే.
తిలోత్తమ: నయని ఉనికి మీద కొత్త ప్రశ్నలు పుడతాయి.
బామ్మ ఉదయం ఇంట్లో వాళ్లతో తన మనవరాలి గొప్పలు చెప్తుంది. త్రినేత్రి కూడా గొప్ప భక్తురాలు అని అమ్మవారితో మాట్లాడుతుందని అంటుంది. విక్రాంత్ నయని రెండో కూతుర్ని ఎత్తుకొని ఉంటే సుమన వచ్చి మన పిల్లని ఎత్తుకోరు కానీ గానవినీ ఎత్తుకొని ఇళ్లంతా తిరుగుతారని అంటాడు. దాంతో బామ్మ ముగ్గురు పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారని నా మనవరాలిని తొందరగా పెళ్లి చేస్తా ఏడాదిలో పిల్లలు పట్టుకుంటుందని అంటుంది. ఇక ఇంతలో ఇంటికి చేతిలో రెండు వేపకొమ్మలు పట్టుకొని ఓ మాత్రింకుడు వస్తాడు. లటలటా లుటలుట అంటూ హడావుడి చేస్తాడు. ఆయన ఆత్మలింగం అని వల్లభ చెప్తాడు. దొంగలా ఉన్నాడు అని దురంధర అంటుంది. ఆయన్ను ఎవరు పిలిపించారు అని ఇంట్లో వాళ్లు అడుగుతారు.
దాంతో తిలోత్తమ తానే పిలిపించానని నయని చూపించి నయనినా త్రినేత్రినా ఒక్కరే ఇద్దరా ఇద్దరా అని తెలుసుకోవడానికి ఆత్మలింగాన్ని పిలిపించానని చెప్తుంది. ఇంట్లో ఆత్మలు ఉన్నాయని అందుకే వచ్చారని చెప్తుంది. ఇంట్లో ఆత్మలు ఏంటి అని అందరూ నోరెళ్లబెడతారు. ఆయన్ను ఎక్కడో చూశానని బామ్మ అంటుంది. అందరూ ఆయనతో కామెడీ చేస్తారు. ఇక వల్లభ ఆయనకు డబ్బు ఇచ్చి ఆత్మలల్ని తీసుకెళ్లమని చెప్తాడు. ఆయన ఇంటి మొత్తం మంత్రించిన నీరు చల్లాలని చెప్పడంతో వల్లభ వెనక వెళ్తాడు. నయని చాలా టెన్షన్ పడుతుంది. త్రినేత్రి శరీరంలో తన ఆత్మ ఉందని తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుందని త్రినేత్రి కూడా చనిపోయిందని బామ్మకు తెలిస్తే చాలా కష్టమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!