Trinayani Serial Today January 1st: 'త్రినయని' సీరియల్: నయని, త్రినేత్రి డ్రామా మొత్తం ఇంట్లో చెప్పేసిన బామ్మ.. కోమాలో ఉన్న నయనిని చూసేశారా!
Trinayani Today Episode నయనిలా త్రినేత్రి నటిస్తుందని నయని కోమాలో ఉందని బామ్మ ఇంట్లో వాళ్లకి చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode వైకుంఠం దొంగ అన్నట్లు సుమన మాట్లాడుతుంది. త్రినేత్రి వచ్చే వరకు ఇక్కడే తిష్ట వేసి మూడు పూటలు తిని ఉండిపోవాలని అనుకుంటున్నారా అని వల్లభ అంటాడు. దానికి నయని అలా అంటారు ఏంటి బావగారు అని అంటే దానికి బామ్మ రత్నాంభ వాడిని బావ అంటావేంటే అని అడుగుతుంది. నయనిని బామ్మ త్రినేత్రి అన్నట్లు మాట్లాడుతుందేంటని అందరూ షాక్ అవుతారు.
బామ్మ: ఇక్కడ వరసలు కలుపుతూ వీళ్లకి ఊడిగం చేయాల్సిన అవసరం ఏంటే త్రినేత్రి. పద మన ఊరు వెళ్లిపోదాం.
విక్రాంత్: బామ్మా..
తిలోత్తమ: త్రినేత్రినా.
బామ్మ: త్రినేత్రి కాకపోతే మీ త్రినయనా..
నయని: బామ్మా..
బామ్మ: నువ్వు ఉండవే పూటకి ఇంత పెడతారో లేదో తెలీదు కానీ.. నోటి కొచ్చినట్లు మాట్లాడుతారా. నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావో వీళ్లకి తెలుసా.
నయని: బామ్మ నువ్వు ఆగు..
సుమన: మా అక్కని పట్టుకొని త్రినేత్రి అంటుంది అంటే త్రినేత్రినే మా అక్కలా చీర కట్టుకొని వచ్చిందేమో.
వైకుంఠం: ఏంటి అమ్మా నువ్వు అనేది తను మన త్రినేత్రినా
బామ్మ: అవునే నీ మొగుడిని పిలువు ఈ ముష్టి బతుకు మాకు అవసరం లేదు.
విక్రాంత్: ఎక్కడికి వెళ్తారమ్మా తను మా వదిన.
తిలోత్తమ: ఇక్కడ జరిగేది నాటకం అని తెలుస్తుంది. త్రినేత్రి చీర కట్టి నయనిలా నటించి వాళ్ల బామ్మని మేనత్తని ఇక్కడ ఉంచింది.
వల్లభ: మమ్మీ మన ఇంట్లో ఉంటూ మనల్ని అవమానించిన వారిని ఇంట్లో ఒక్క నిమిషం ఉంచకూడదు.
బామ్మ: అవును పదవే.
నయని: ఏంటి మీరు తమాషాలు చేస్తున్నారా. నా పిల్లలు భర్తని వదిలేసి మీ త్రినేత్రిలా లంగావోణి వేసుకొని మీ వెంట వచ్చేయాలా.
బామ్మ: అలా అంటావేంటే నువ్వు నయని కాదు కదా మా త్రినేత్రివి కదా. విశాల్ బాబు గారి భార్యగా నటిస్తూ పిల్లల కోసం అయినా కొన్నాళ్లు ఇక్కడ ఉండాలి అని చెప్పావు కదే.
విక్రాంత్: అబ్బా పెద్దావిడ ఆవేశంలో చెప్పింది అంతా మర్చిపోయింది.
అందరూ నయని త్రినేత్రినా అంటూ అడిగితే నయని గగ్గాలించేస్తుంది. వల్లభ మాత్రం నువ్వు ఇలా అరిచినా మేం నమ్మమని అంటాడు. విక్రాంత్ నయనినే అని తను అని చెప్తాడు. ఏం జరుగుతుందో అర్థం కాక వైకుంఠం తల్లిని ప్రశ్నిస్తే నేను చెప్పిందే నిజం అని బామ్మ అంటుంది. ఇక బామ్మ విక్రాంత్‌తో ముగ్గురం కలిసి నాటకం ఆడాలి అని నువ్వే కదా చెప్పావ్ అంటుంది. అందరూ విక్రాంత్ వైపు చూస్తూ షాక్ అయిపోతారు. తిలోత్తమ మాత్రం ఈ డ్రామాలో నీ పాత్ర కూడా ఉందా విక్రాంత్ బాబు అని తిడుతుంది. నయని బామ్మకి దండం పెట్టి విశాల్ బాబు గారు త్రినేత్రిని వెతికి తీసుకొస్తారు మీరు వెళ్లండి అని అంటుంది. దాంతో బామ్మ విశాల్ బాబుకి పెళ్లి అయి పిల్లలు ఉన్నారు నువ్వు ఇక్కడ ఉండి జీవితం నాశనం చేసుకోవద్దని అంటుంది. త్రినేత్రి కనిపించక నీకు మతి పోయిందని వైకుంఠం తల్లిని అంటే బామ్మ లాగిపెట్టి ఒక్కటిచ్చి వీళ్లందరినీ పిచ్చి వాళ్లని చేస్తున్నారే విశాల్ బాబుగారి బామ్మ ఇంకా కోమాలో ఉందని చెప్పేస్తుంది. అందరూ బిత్తరపోతారు. ఎక్కడుంది అని హాసిని అంటే మీ పిన్ని గదిలో ఉందని చెప్తుంది. దురంధర తెలీదు అన్నట్లు ప్రవర్తిస్తే అందుకే తలుపు తాళం వేస్తున్నావా అని సుమన అంటుంది.
దాంతో దురంధర ముసలికి నిజంగానే పిచ్చి అని అంటుంది. దాంతో బామ్మ దురంధర గది తలుపులు తెరవమని అంటుంది. నయనిని చూపించి త్రినేత్రిని తీసుకెళ్లిపోతా అంటుంది. అందరూ గదిలోకి వెళ్లే సరికి అందులో ఎవరూ ఉండరు. తిలోత్తమ ఇళ్లంతా వెతికేస్తుంది. బామ్మ కూడా నయని లేకపోవడంతో షాక్ అయిపోతుంది. నయని, విక్రాంత్, దురంధర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అందరి మీద రకరకాలుగా మాట్లాడుతారు. దురంధర కూడా గదిలో నయని లేదుగా అంటే దానికి నయని నువ్వు కూడా అలా మాట్లాడుతావేంటి పిన్ని అంటుంది. ఇక బామ్మ అయితే ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. నీకు పిచ్చి పట్టిందని బామ్మకి తన కూతురు అంటుంది. ఇద్దరినీ గదిలో చూశానని బామ్మ అంటుంది. కోమా పేషెంట్‌ని ఇంట్లో ఎందుకు ఉంచుతారని అడుగుతుంది. ఇక వైకుంఠం మనసులో మా అమ్మకి పిచ్చి అని చెప్తేనే ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవించవొచ్చని తన తల్లికి పిచ్చి అని చెప్తుంది. తిలోత్తమ రకరకాలుగా ఆలోచించేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: నెత్తి పట్టుకున్న మహదేవయ్య.. చిన్న కోడలిని ఏం చేస్తాడు? కవ్వించి మడతెట్టేసిన సత్య!