Trinayani Serial Today January 15th: ఆస్తి కావాలి అంటే ఇంకో బిడ్డని కనమని సుమనతో చెప్పిన నయని!
Trinayani Serial Today Episode ఉలూచి భవిష్యత్ గురించి ఆలోచిస్తే కష్టంగా ఉందని ఇంకో బిడ్డని కనమని సుమనకు నయని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: విశాల్‌కు నాగులాపురం నుంచి మరో సారి కొరియర్ వస్తుంది. అందులో మళ్లీ ఇంకో క్యాసెట్ ఉంటుంది. అందులో ఏముందా అని అందరూ టెన్షన్ పడతారు. ఇక నయని వాక్ మేట్ తెస్తుంది. ఇంతలో ధురందర కచ్చితంగా పెద్ద వదిన రికార్డ్ చేసింది అని ఎలా చెప్పగలం అని అడుగుతుంది. దానికి తిలోత్తమ ఈ రోజుల్లో క్యాసెట్లు ఎవరు వాడుతున్నారని అంటుంది. నయని వాక్ మేట్ తెచ్చి అందులో క్యాసెట్ పెట్టి ప్లే చేస్తుంది. అందులో గాయత్రీ దేవి వాయిస్ మళ్లీ వినిపిస్తుంది.
"హలో అందరికీ హాయ్.. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 1999. ఈ ఏడాది మా చెల్లి తిలోత్తమ ఆలోచనల్ని అందరం పంచుకుందాం. తను ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. తిలోత్తమ పనితనం కావొచ్చు. తన ముందు చూపు కావొచ్చు మన వ్యాపారం మరింత పుంజుకోవడానికి కారణం అయింది. ఇంకా చెప్పాలి అంటే నా చెల్లెలు తిలోత్తమ లేకపోయి ఉంటే నేను నా బిజినెస్‌లు రానిచ్చేదాన్నే కాదు. తనే నా ప్రాణం తన రుణం జన్మలో తీర్చుకోలేను. థ్యాంక్యూ తిలోత్తమ."
వల్లభ: ఎందుకు ఆపేశావ్ పెద్ద మరదలా..
నయని: మరీ ఎక్కువ పొగుడుతున్నట్లు అనిపించడం లేదూ..
సుమన: మా అక్కకి కుళ్లు వచ్చేసింది. గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఛైర్మన్ అయినా మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా అక్క, విశాల్ బావ గారే కదండి.. వాళ్లని మెచ్చుకోకుండా తిలోత్తమ అత్తయ్యని మెచ్చుకుంటుంటే అసూయ పడుతున్నారు.
తిలోత్తమ: పర్వాలేదులే సుమన ఎవరి టాలెంట్ వాళ్లదే.
హాసిని: నువ్వేమంటావ్ విశాల్..
విశాల్: అమ్మ మరీ ఇంతలా మెచ్చుకోదు. జస్ట్ ఒక్క మాటతోనే మెచ్చకుంటుంది. ఈ క్యాసెట్‌లో ఏమో చాలా వరకు ఈ అమ్మనే మెచ్చుకున్నట్లు ఉంది.
నయని: ఎందుకు ఉండదు బాబుగారు. మీ పెంపుడు తల్లి ఎలా చెప్పమంటే అలా చెప్పింది ఆ మహాతల్లి ఎవరో కానీ.
ధురందర: చెప్పింది గాయత్రీ వదిన కాదా..
పావనా: కాదని ఎలా చెప్పగలవు తల్లీ.
నయని: మిమిక్రీ ఆర్టిస్ట్ చేత అమ్మగారి వాయిస్‌ని చెప్పించారు బాబాయ్. గాయత్రీ అమ్మగారు గత జన్మలో 1999లొ ప్రాణాలతో లేరు. అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా చెప్పారు బావగారు.
తిలోత్తమ: అక్క పొరపాటున ఆ సంవత్సరం చెప్పినట్లు ఉంది.
నయని: ఆ అవకాశమే లేదు అత్తయ్య. అమ్మగారు బతికున్నప్పుడు పొరపాటున కూడా మిమల్ని చెల్లెలు అని అనలేదు.
విశాల్: అవును కదా అమ్మ మా అమ్మ నిన్ను పేరు పెట్టి పిలిచేది లేదంటే సెక్రటరీ అని పిలిచేది. నువ్వు తనకి చెల్లెలు ఎలా అవుతావు.
డమ్మక్క: ఆ అమ్మ బతికున్నప్పుడు మీరు కానీ జగదీష్ గారిని పెళ్లి చేసుకోలేదు కదా అమ్మ.
ధురందర: అవును లేదే లేదు. గాయత్రీ అమ్మగారు చనిపోయిన తర్వాతే వల్లభని, విక్రాంత్‌ని తీసుకొని వచ్చి మా అన్నయ్యని ఆశ్రయించింది.
సుమన: అత్తయ్య ఇది మీరు చేసిన పనేనా..
తిలోత్తమ: ఇప్పుడేంటి గాయత్రీ అక్కయ్య నన్ను పొగడలేదా..ఇక నయని ఆ క్యాసెట్‌ను విశాల్‌కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
హాసిని, డమ్మక్క, ధురందర, పావనా మూర్తిలు భోగి మంట ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు. ఇక తిలోత్తమ, వల్లభ అక్కడికి వస్తారు. వాళ్లని కూడా భోగి మంటల్లో వేసేస్తా అని హాసిని వాళ్లమీద సెటైర్లు వేస్తుంది. ఇక డమ్మక్క పిల్లలకు భోగిపళ్లు పోయమని సలహా ఇస్తుంది. దానికి తిలోత్తమ నయనికి సొంత కూతురు ఒకరు, దత్త పుత్రిక మరొకరు గాయత్రీ అక్కయ్య లేదు అని ఈ పిల్లలకు రేగిపళ్లు పోసే పని పోస్ట్ పోన్ చేసుకుంటుంది అని అంటుంది.
హాసిని: గాయత్రీ అత్తయ్యకు కూడా రేపు భోగిపళ్లు పోస్తుంది మా చెల్లి.
డమ్మక్క: హాసిని ఏమంటున్నావో మర్చిపోయావా..
హాసిని: రేపయినా వస్తుంది కదా అంటున్నా.
డమ్మక్క: గాయత్రీ అమ్మ రాకపోయినా మా అమ్మ విశాలాక్షి అయినా వస్తుంది.
వల్లభ: చస్తే ఎలా వస్తుంది.
తిలోత్తమ: రాదు.. లేదు కాబట్టి..
హాసిని: వీళ్ల మాటలు ఏవో తేడాగా ఉన్నాయి.
డమ్మక్క: ఎంత తేడాగా ఉన్న అమ్మ నీడ ఈ ఇంట పడటం ఖాయం. అమ్మ రేపు బిడ్డగా మారబోతుంది.
విక్రాంత్ చీపురు పట్టుకొని వచ్చి గదిని శుభ్రంగా ఊడ్చమని అంటాడు. దానికి సుమన ఛీ.. ఛీ అంటుంది. ఇక నయని వచ్చి చీపురు అంటే లక్ష్మీదేవి అని విక్రాంత్ బాబుకి తెలిసినంత కూడా నీకు తెలీదా అని చీవాట్లు పెడుతుంది. ఇక సుమన అయితే ఎప్పటిలా ఆస్తి కావాలి అంటూ అడుగుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఆస్తి నీకు వస్తుంది అంటుంది నయని. దాంతో సుమన ఇప్పుడున్న ఉలూచిని పడేయాలి అని అడుగుతుంది.
నయని: పగలు మాత్రమే పసిబిడ్డగా ఉండే ఉలూచి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ నీకు దూరం అవుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది చెల్లి. అందుకే విక్రాంత్ బాబుతో సంతోషంగా కాపురం చేసి ఇంకో బిడ్డని కనమని చెప్తున్నాను.
సుమన: ఆ మాట మీ మరిదికి చెప్పు అక్క. చీపురు తిరగేసి కొట్టాలి అన్న అతను నాకు కళ్లు తిరగాలి అనేలా చేస్తాడా..
నయని: నువ్వు మారితే విక్రాంత్ బాబు మనసు మార్చుకుంటారు. నేను హామీ ఇస్తున్నాను.
విక్రాంత్: ఇలాంటి దానితో నా జీవితాన్ని ముడిపెడతారు ఏంటి వదిన.
నయని: అలా అనకండి. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా ఆలోచించండి విక్రాంత్ బాబు.
విక్రాంత్: సరే వదినా..
సుమన: ఉలూచికి భవిష్యత్ లేదు అన్నట్లు అంటుంది ఏంటి మా అక్క ఏం జరగబోతుంది.
నయని, సుమన, డమ్మక్క ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. విక్రాంత్, విశాల్ భోగి మంటకు కావాల్సినవి తీసుకొస్తారు. మిగతా అందరూ రెడీ అయి వస్తారు. హాసిని గొబ్బెమ్మలు తీసుకొస్తుంది. ఇంతలో విశాలాక్షి వస్తుంది. విశాలాక్షిని చూసి అందరూ సంతోషించగా తిలోత్తమ, వల్లభ షాకైపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నిండు నూరేళ్ల సావాసం జనవరి 13th - ఇంట్లో బందీ అయిపోయిన అరుంధతి, ఘోర నుంచి భార్యని కాపాడుకున్న అమర్!