Trinayani Serial Today January 11th: శుభవార్త చెప్పిన హాసిని, నయని.. కుమిలిపోతున్న సుమన!
Trinayani Serial Today Episode నయని కడుపులో పెరుగుతోంది గాయత్రీదేవి అని సుమన అనుమానం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode విశాల్ ఫ్యామిలీ మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో సందడి సందడిగా గడుపుతారు. అందరూ డ్యాన్స్‌లతో అదరగొడతారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేక్ కట్ చేసి రచ్చరచ్చ చేస్తారు. ఇంతలో నయని కడుపు నొప్పి అని నయని గట్టిగా అరుస్తుంది. అందరూ కంగారు పడతారు. ఇక కొద్ది సేపటికి హాసిని కూడా కడుపు నొప్పి అని విలవిల్లాడిపోతుంది. ఇక వల్లభ ఇద్దరూ జ్యూస్ తాగడం వల్లే ఇలా అయింది అంటే జ్యూస్‌లో ఏమైనా తేడా ఉంది అని విక్రాంత్ తిలోత్తమ వాళ్లను అడుగుతాడు. తిలోత్తమ తెగ టెన్షన్ పడుతుంది.
వల్లభ: మమ్మీ వీళ్లు మన వైపు అనుమానంగా చూస్తున్నారు.
తిలోత్తమ: అంటే ఏంట్రా మేము ఏమైనా తప్పు చేశామనా..
విశాల్: మేం ఏం అడగలేదు అమ్మా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు. మిగతా వాళ్లు అందరూ మందు తాగినా ఏం కాలేదు. నయని వాళ్లు పళ్ల రసాలు తాగితే ఎందుకు కడుపు నొప్పి వస్తుంది.
పావనా: అల్లుడు కడుపు నొప్పితో విలవిల్లాడిపోతున్నారు డాక్టర్‌ని పిలుద్దాం.
ఇంతలో డమ్మక్క ఎవర్నీ పిలవాల్సిన అవసరం లేదని అంటుంది. ఎద్దులయ్య మంచి నీళ్లు అందుకో అని చెప్పిన డమ్మక్క ఓం నమశ్శివాయ అని తాగమని ఇస్తుంది. ఇక ఇద్దరూ డమ్మక్క ఇచ్చిన నీళ్లు తాగుతారు. వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. ఇక ఇద్దరి చేతులు చూసిన డమ్మక్క ఇద్దరు ప్రెగ్నెంట్స్ అని చెప్తుంది డమ్మక్క. దీంతో అందరూ హ్యాపీగా ఫీలైతే.. వల్లభ, తిలోత్తమలు షాక్ అవుతాడు. అందరూ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు.
ఇక సుమన తన గదిలో లైట్స్ ఆఫ్ చేసి ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చొంటుంది. ఇంతలో విక్రాంత్ అక్కడికి వచ్చి భయపడతాడు. లైట్స్ వేసి ఏంటి ఇలా కూర్చొన్నావు.. ఇప్పుడు టైం ఎంతో తెలుసా.. ఇంకో గంట ఆగితే తెల్లారిపోతుంది అని కింద చాప పరుచుకుంటాడు.
సుమన: ఏం ఆలోచిస్తున్నానో అడగండి.. మా అక్కకి మళ్లీ పిల్లలు పుడతారా..
విక్రాంత్: ఎందుకు పుట్టరో చెప్పు. నీకు నాకు సంతాన భాగ్యం లేదు అంటే ముక్త కంఠంతో చెప్తాను. బ్రో వదినల జీవితం చందమామ కథలా అందంగా ఉందని అందరకీ తెలుసు.
సుమన: తనకేం పిల్లలు మీద పిల్లలు పుడుతూనే ఉంటారు. నాకేమో ఒక బిడ్డ పురిటిలోనే పోయింది. మరొకటి సగం బిడ్డ.. సగమే అని ఎందుకు అన్నానంటే.. పగలు మాత్రమే కదా ఆడపిల్ల. అలాంటి పిల్ల కూడా ఒక్కర్తే ఉంది.
విక్రాంత్: ఉన్నదాంతో తృప్తి పడటం నేర్చుకోవే ఇలా నిద్ర సమస్య ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పడుకో..
సుమన: ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అండీ ఇక్కడికి..
విక్రాంత్: రాత్రి పార్టీ అయినప్పటికి 1 అయింది. బాల్కానీలో పడుకున్నానా చలి. నువ్వు ఎలాగూ బెడ్ మీద పడుకొని ఉంటావు కదా.. కింద పడుకొని మార్నింగ్ లేచి వర్క్‌వుట్‌కి వెళ్దాం అనుకున్నా.
సుమన: అదేదో ఇప్పుడు చేయొచ్చు కదా..
విక్రాంత్: మెంటలా నీకు నేను వ్యాయామం చేస్తే నువ్వు చూస్తూ ఉంటావా..
సుమన: నాకు నిద్ర పట్టడం లేదు ఏం చేయమంటారు. అయినా మనకు మాత్రం ఇంకో బిడ్డ పుడితే బాగున్ను అని మాత్రం ఆలోచన చేయరు.
విక్రాంత్: చచ్చినా చేయను. నేను బాగున్నాను. నన్ను ఇలానే చావనివ్వు.
తిలోత్తమ: రేయ్ రాత్రి తాగినది అంతా దిగిపోయిందిరా..
వల్లభ: ఏం అర్థం కావడం లేదు మమ్మీ.. విశాల్, నయని అంటే అన్యోన్యంగా ఉంటారు. హాసిని నేను ఎలా ఉంటామో నీకు తెలుసుకదా..
తిలోత్తమ: అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసిన పాపం నాదే అంటావా..
వల్లభ: మమ్మీ.. విషం కలిపిన జ్యూస్ తాగితే కళ్లు తేలేస్తారు కదా మళ్లీ అమ్మలము అయ్యామని ఇద్దరూ పళ్లు ఇకిలించారు. చూశావు కదా..
తిలోత్తమ: ఇంకొద్ది సమయంలో ప్రాణం పోతుంది అన్న భయం నయనిలో చూస్తాను అనుకున్నా కానీ మళ్లీ బిడ్డను కంటున్నాను అని చూడమే తిలోత్తమ అనేలా చూసిందిరా ఆ నయని..
వల్లభ: అయితే మళ్లీ గాయత్రీ పెద్దమ్మ పెద్ద మరదలి కడుపున పుడుతుంది అంటావా..
తిలోత్తమ: ఎన్ని సార్లు పుడుతుందిరా గాయత్రీ అక్క.
వల్లభ: నిన్ను చంపడానికి తాను ఎన్ని సార్లు చావడానికి మళ్లీ పుట్టడానికి అయినా రెడీగా ఉంటుంది.
తిలోత్తమ: నన్ను ఒక్కసారి చంపితే చాలు అంటావా.. నయని, హాసినిలు గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుంచి నాకు నిద్ర కూడా పట్టడం లేదు.
వల్లభ: పునర్జన్మలోనూ గాయత్రీ పెద్దమ్మ పుటుక్కుమంది. అందుకే మళ్లీ పెద్ద మరదలి కడుపున మరోసారి పుట్టబోతుంది.
తిలోత్తమ: అలా అయితే నయని కలలో కనిపించి చెప్పాలి కదా మళ్లీ పుడుతున్నాను అని. అయితే నువ్వు అన్నట్లు గాయత్రీ అక్క మళ్లీ నయని కడుపున పుట్టాలి అని చూస్తే మనం ఏం చేయాలో తెలుసుకదా..
వల్లభ: ఎస్ మమ్మీ.. ఎక్కడికి అక్కడే సమాప్తం చేయాలి.
ధురందర పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఇద్దరు కోడళ్లు ఒకేసారి గర్భవతులు అయ్యారు కాబట్టి దిష్టి తీస్తాను అంటుంది. ఇక సుమన డాక్టర్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకున్నారా అని అడుగుతుంది. వీధిలో ఉండే డాక్టర్‌ని కలిశామని నయని చెప్తుంది. ఇక విక్రాంత్ తనతో సంతోషంగా ఉండడు అని తాను ఇంకో బిడ్డను కనలేను అని సుమన అంటుంది. తాను ఒక విషయం చెప్తే మీరంతా బాధ పడతారు అని నేను చెప్పడం లేదని సుమన అంటుంది. అందరూ చెప్పమని అడగడంతో నయని, విశాల్‌తో మీ పెద్ద కూతురు ఇప్పటి వరకు దొరకలేదు కదా అని.. ఇప్పుడు మళ్లీ నెలతప్పిన మా అక్క కడుపులో మీ అమ్మ గాయత్రీ దేవిగారు జీవం పోసుకుంది ఏమో అని సుమన తన అనుమానాన్ని భయటపెట్టేస్తుంది. దీంతో హాసిని సుమన దగ్గరకు వెళ్తుంది. గాయత్రీ అత్తయ్య జాడ తెలీడం లేదు అంటే తను లేదు అనుకున్నావ్.. అందుకే ఇప్పుడు చెల్లి గర్భంలో చేరింది అని అంటున్నావ్.. నీ లెక్క ప్రకారం అదే అయొండొచ్చు కానీ అసలు విషయం నీకు చెప్పాలి అని హాసిని అంటే ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.