అన్వేషించండి

Trinayani Serial Today February 21st: 'త్రినయని' సీరియల్: నయని, విశాల్‌లను చంపేందుకు తిలోత్తమ కుట్ర, అక్క మీద కోపంతో విషం కలిపిన సుమన!

Trinayani Serial Today Episode నయనిని అంతం చేయడానికి పూల దండలో విషాన్ని తిలోత్తమ స్ప్రే చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: గురువుగారికి నిజం చెప్పాలా అని సుమనను అడిగితే సుమన వద్దు అనేస్తుంది. ఇక విశాల్ సుమనను వెనకేసుకొని వస్తే నయని ప్రశ్నిస్తుంది. నిజం తెలుసుకోవడానికి సుమన ఎందుకు కంగారు పడుతుంది అని అడుగుతుంది. దీంతో తిలోత్తమ నిజం తెలియడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకొని చెప్పండని గురువుగారికి తిలోత్తమ చెప్తుంది.

గురువుగారు: మంచిదే తిలోత్తమ. నిన్న సుమన ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది కానీ రేపు ఇంకొకరి ప్రాణం పోతుంది. 
ధురందర: అది ఎవరో నువ్వు చెప్పు నయని నీకు ముందే తెలిసిపోతుంది కదా నువ్వు చెప్పేస్తావ్ కదా..
నయని: నాకు తెలీదు పిన్ని. 
సుమన: నేను చెప్పానా మా అక్క చెప్పడం మానేసింది అని. 
విశాల్: సుమన తెలిస్తే నయని చెప్తుంది కదా..
గురువుగారు: రేపు అమ్మవారి గుడికి వస్తే తప్ప ప్రమాదం ఎవరికి పరిష్కారం ఏంటి అనేది తెలీదు. 

అఖండ: వల్లభ గురువుగారు చెప్పింది మరొకరికి గండం అవునా.. 
వల్లభ: అవును స్వామి.. 
అఖండ: గండం ఒకరికి కాదు ఇద్దరికి. 
వల్లభ: ఒకరికి కాదా ఇద్దరికా మమ్మీ నువ్వు నేను గోవింద గోవింద..
తిలోత్తమ: రేయ్ నువ్వు కాసేపు ఆగరా.. స్వామి మీరు చెప్పింది నిజమే ఒకరా ఇద్దరా అని నేను నిర్ణయం తీసుకోవాలి. 
అఖండ: అర్ధం కాలేదా వల్లభ నయనికి గండం అయితే విశాల్ బాబు ప్రాణాలు తీయాలా అని మీ అమ్మ బుర్రలో భయం వెలుగుతోంది. 
వల్లభ: అమ్మ నా అమ్మో నువ్వు ఇలా స్కెచ్ వేశావా.. ఇక వేళ వాళ్లిద్దరికీ కాకుండా ఇంకా ఎవరికైనా గండం వస్తే.
తిలోత్తమ: ఎవరికైనా రానివ్వరా వాళ్లు మాత్రం పోవాలి అంతే. గుడి దగ్గర గండం అని అన్నారు కదా అక్కడకి అఖండ స్వామి వారు కూడా వస్తారు. 
వల్లభ: నాగయ్య పాము వస్తే ఎలా ఉంటుందో తెలుసుకదా..
అఖండ: మీరు గుడికి వెళ్లండి అక్కడ ఇలాంటి రేఖ గీస్తాను ఈ రేఖ దాటి పాము ముందుకు రాలేదు. వస్తే మసి అయిపోవడం ఖాయం. 

తిలోత్తమ: రేపు మనం చేయబోయేది చిన్నా చితకా పని కాదు వల్లభ. చాలా జాగ్రత్తగా ఉండాలి.
వల్లభ: నయని ఆపద గ్రహించనంత వరకు మనం సేఫ్ కదా .
తిలోత్తమ: మనం క్షేమంగా ఉంటడం కాదు వల్లభ. విశాల్ లేకుండా అక్కడిక నాగయ్య పాము రాకుండా చూడాలి. అసలు నయనికి గండం గురించి ఎందుకు తెలీడం లేదా అని ఆలోచిస్తున్నాను. 
వల్లభ: మనకే మంచిది కదా అమ్మా ఎందుకు వర్రీ అవ్వడం.
తిలోత్తమ: లేదు లేదు ఇందులో ఏదో లాజిక్ ఉంది. విశాలాక్షి ఎన్ని గారడీలు చేసిని పర్లేదు కానీ ప్రాణాలతో చెలగాటం అడితే రేపు మనకైనా ప్రమాదమే. 
వల్లభ: అమ్మా అవన్నీ కాదు నువ్వు ముందు సంతాప సభకు ఏర్పాటు చేయు. అడ్డొస్తే ఆ గారడి పిల్లని ఏసేద్దాం. తర్వాత ఈ కంపెనీలను చూసుకోవాలి అనే ఆశ అనుభవం నీకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎవరూ ఒప్పుకోరు.
తిలోత్తమ: డైరెక్ట్‌గా నేను అధికారం తీసుకుంటా అంటే విక్రాంత్ అడ్డుకుంటాడు. అందుకు ఉలూచితో పాటు మిగతా పిల్లలను వారసులుగా ప్రకటిస్తాం వాళ్లని.. పెత్తనం మాత్రం మనదే. ఇక రేపు మనం అనుకున్నది పకగ్భందీగా జరిపించడమే. 

హాసిని: పూల దండ పట్టుకున్న భర్తని చూసి.. ఫస్ట్ టైం మా ఆయన పని చేస్తున్నాడు చూశారా.. 
విశాల్: అమ్మవారి సేవ చేస్తే మంచిదే కదా వదినా. 
హాసిని: ఈ రోజు మంచి ఎక్కడ జరుగుతుంది విశాల్.. ఎవరో ఒకరు పోతారు కదా..
నయని: శుభమా అని శాంభవి పూజ చేసుకుంటూ ఏంటక్క ఆ మాటలు. 
సుమన: పెద్ద బావగారు పట్టుకొస్తున్న దండ అమ్మవారికి బదులు పోయే వారికి వేసేలా ఉన్నారు. 
విక్రాంత్: ఆ సైజ్ దండ నువ్వు మోయలేవులే.
సుమన: అంటే నన్నే పొమ్మంటున్నారా. 
వల్లభ: ఈ దండకే పాయిజన్ స్ప్రే చేశావ్ కదా మమ్మీ అలాంటి దండను నాతో మోయిస్తున్నావు. మరోవైపు అందరూ అమ్మవారి దగ్గరకు వస్తారు. అఖండ స్వామి కూడా వస్తారు. 
అఖండ: విశాలాక్షి అమ్మవారి విధి విలాసం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాల్సిందే. నాగు పాముల్ని ఈ లోపలకి వెళ్లకుండా చేయాలి అంటే చుట్టూ అగ్ని రేఖ వలయాన్ని ఏర్పాటు చేయాలి. 
పెద్దబొట్టమ్మ: ఎవరు ఎవరు చేశారు ఈ పని..
అఖండ: నేనే నాగులమ్మ..
పెద్దబొట్టమ్మ: నాగులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవాలి అనుకుంటున్నావా. 
అఖండ: మానవరూపంలో నువ్వు ఈ వలయం దాటి వెళ్లగలవు కానీ ఈరేఖ దాటిన తర్వాత నువ్వు మళ్లీ పాములా మారి లోపల జరుగుతున్న విష ప్రయోగాన్ని అడ్డుకోలేవు.   
పెద్దబొట్టమ్మ: ఇది అన్యాయం. మంచి చేయాలా కానీ తప్పు చేయకూడదు. ఈ విషయం నయనికి చెప్తాను. 
సుమన: అత్తయ్య మీరు ఎవర్నో లేపేస్తారు అని కాదు కానీ పూజ పాడు చేసే ఆలోచన ఏమైనా ఉందా. నాకు మాత్రం ఉంది. అక్కడ పెట్టిన ప్రసాదం మా అక్క తినేలా చేస్తాను.
తిలోత్తమ: అందులో విషం ఉందా.. 
సుమన: అవును.. పెద్ద బొట్టమ్మ వస్తుంది ఏంటి మా అక్కని కాపాడుతుందా.. హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావ్ పెద్దమ్మ.
పెద్దబొట్టమ్మ: విష ప్రయోగం జరుగుతుంది. 
 సుమన: నీకు ఎలా తెలుసు.
పెద్దబొట్టమ్మ: నాగులం అయిన మేం మాత్రమే గ్రహించగలం. 
సుమన: ఒహో నాగయ్య రాకుండా నువ్వు వచ్చావ్ అన్న మాట కాపాడటానికి. 
పెద్దబొట్టమ్మ: అవును సుమన వెళ్దాం పద.
సుమన: ఎక్కడికి.. 
పెద్దబొట్టమ్మ: నయని దగ్గరకు వెళ్లి చెప్తే తను అడ్డుకుంటుంది పద వెళ్దాం
సుమన: నువ్వు రాకు. 
పెద్దబొట్టమ్మ: అదేంటి సుమన నేను వచ్చింది ఉలూచి కోసం. 
సుమన: ఉలూచిని ఇక్కడికి తీసుకురాలేదు.
పెద్దబొట్టమ్మ: సరే పాప గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్దాం పద.
సుమన: ఒక్క నిమిషం పెద్దమ్మ. నీకు ఉలూచిని ఆడించాలి ముద్దు చేయాలి అని ఉందా.. 
గురువుగారు: మృత్యువు మన నీడలా మన వెన్నంటే ఉంటుంది విశాలా.. ఇక దండ నుంచి విషం ప్రసాదంలో పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: త్రిష: పదే పదే అలాంటి వ్యాఖ్యలు - నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, రాజకీయ నేత కామెంట్స్‌పై త్రిష ఫైర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Market Holidays: 2025లో స్టాక్ మార్కెట్లు 13 రోజులు పని చేయవు - హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో
2025లో స్టాక్ మార్కెట్లు 13 రోజులు పని చేయవు - హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో
Laila Release Date: విశ్వక్ సేన్ ‘లైలా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!
విశ్వక్ సేన్ ‘లైలా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget