Trinayani Serial Today December 4th: 'త్రినయని' సీరియల్: తను నయని కాదు త్రినేత్రినే.. పోలీస్ చంద్రశేఖర్ రాకతో క్లారిటీ!
Trinayani Today Episode విశాల్ ఇంటికి పోలీస్ చంద్ర శేఖర్ వచ్చి ఇంట్లో ఉన్నది నయని కాదు త్రినేత్రి అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని ఒక్కోసారి ఒకలా ఉండటానికి కారణం ఏంటి అని విశాల్ విశాలాక్షిని అడుగుతాడు. దానికి విశాలాక్షి నయనిలా ఉండటానికి విశాలాక్షి అమ్మవారు, త్రినేత్రిలా ఉండటానికి మహాంకాళి అమ్మవారు కారణం అని చెప్తుంది. ఇక విశాలాక్షి వారు వీరు వీరు వారు వారే వీరు వీరే వారు అని ఎవరికీ అర్థం కానట్లు చెప్తుంది. అందరూ ఏంటి ఏం అర్థం కావడం లేదని అంటే అదే నిజం అని నయని అంటుంది. అర్థమైనట్లు చెప్పమని తిలోత్తమ అడుగుతుంది.
నయని చెప్పలేను అని అంటుంది. ఇక తిలోత్తమ నయని రాసుకున్న పేపర్లు అన్నీ చింపేస్తుంది. వద్దు అత్తయ్యా టైం ఒంటిగంట అవుతుంది అలా చేయొద్దని బతిమాలినా వినకుండా తిలోత్తమ చింపేస్తుంది. ఇక విశాలాక్షి ఏం చేసినా దానికి ప్రతిఫలం ఉంటుందని గుర్తించుకోండి అంటుంది. విశాలాక్షి వెళ్లిపోతాను అని చెప్తే నయని త్రినేత్రిలా మారి అమ్మా మహాంకాళి అని అని అంటుంది. విశాలాక్షి నువ్వుకుంటుంది.
హాసిని: మనసులో అర్థమైంది చెల్లి నువ్వు నయనిలా కేవలం 3 గంటలు మాత్రమే ఉంటావు. ఎప్పుడు ఉంటావు అన్నదే తెలీదు. అది తెలుసుకొని ఎందుకు అలా జరుగుతుందో కూడా తెలుసుకోవాలి.
తిలోత్తమ: మహాంకాళి వెళ్లకండా ఆపరా వల్లభ.
త్రినేత్రి: మహాంకాళి అమ్మవారి మీద చేయి వేసే మగాడు ఇంకా పుట్టలేదు పుట్టడు అని వల్లభని తోసేస్తుంది. నువ్వు క్షేమంగా వెళ్లి రామ్మా.
విశాలాక్షి: ఈ సారి నా దగ్గరకు నువ్వే రావాలి అమ్మ నిన్ను ఇలా చేసిన వాళ్ల సంగతి చూడాలి కదా వెళ్లొస్తాను.
సుమన: మా అక్కని ఏం చేశారు.
విశాల్: నయనికి ఇలా అవ్వడానికి ఎవరైనా కారణం అయ్యుంటారా.
విక్రాంత్: వాళ్లు ఎవరో తెలుసుకోవచ్చని విశాలాక్షి చెప్పింది కదా బ్రో.
త్రినేత్రి గాయత్రీ పాపని ఎత్తుకొని బుక్ చూస్తుంటే విశాల్ వెళ్లి నయని నీ మనసులో తలెత్తుతున్న రకరకాల ప్రశ్నలు నాకు చెప్పు అని అంటాడు. నువ్వు మర్చిపోతాను అనుకునే పనులు నేను చెప్తానను అని అంటాడు.
విశాల్: నయని నాకు విశాలాక్షి అమ్మవారు వేరు మహాంకాళి అమ్మవారు వేరు నయని వేరు త్రినేత్రి వేరు అని అర్థమైంది నయని.
నయని: మనసులో అవును బాబుగారు మీ మనసు నిజం చెప్తుంది కానీ మీకు ఆధారాలు లేవు అంటే.
సుమన చిత్తు పేపర్లు చూస్తే ఉంటే విక్రాంత్ ఏమైంది అని అడుగుతాడు. దానికి మా అక్క అన్నీ రాసుకుంటుంది కదా ఆస్తి గురించి ఏమైనా రాసిందేమో తెలుసుకుందామని చూస్తున్నా అని చెప్తుంది. ఎంత చిల్లర బుద్ధి నీది అని తిడతాడు. అందరూ హాల్‌లో కూర్చొంటారు. దురంధర సీమంతం గురించి మాట్లాడుకుంటారు. విక్రాంత్ అత్తయ్యా సీమంతం అవసరమా అని అడుగుతాడు. ఇప్పటికే ఇంట్లో ఇబ్బందిగా ఉంది కదా మరి ఎందుకు అని అంటాడు. తిలోత్తమ నయని వల్లేనా అని అడుగుతాడు. ఇంతలో పోలీస్ అక్కడికి వస్తాడు. విక్రాంత్ కంప్లైంట్ ఇచ్చాడని ఆ పని మీదే వచ్చామని అంటాడు. నీ చిన్న కొడుకే నిన్ను పట్టించడానికి వచ్చాడని వల్లభ అనేస్తాడు.
తిలోత్తమ కవర్ చేస్తుంది. ఇంతలో త్రినేత్రి వస్తుంది. చంద్ర శేఖర్ నీ కోసమే వచ్చారు చెల్లి అని హాసిని అంటే వారు ఎవరు త్రినేత్రి అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక పోలీస్ త్రినేత్రి అని పిలుస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మేం చెప్పక ముందే మీకు ఎలా తెలుసని అందరూ అడిగితే తను మీ నయని కాదు దేవీపురం త్రినేత్రి మాత్రేమే అని పోలీస్ చెప్తారు. విశాల్‌తో మీ భార్య కాదు అని చెప్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా విశాల్ మాత్రం తను నాభార్య అని అంటాడు. మనకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని త్రినేత్రి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.