Trinayani Serial Today December 31st: 'త్రినయని' సీరియల్: విశాల్‌నే పెళ్లి చేసుకుంటానన్న త్రినేత్రి.. నయని ప్లాన్ ఏంటి?
Trinayani Today Episode త్రినేత్రి, నయని వేరు వేరని ఇద్దరినీ ఒకేసారి చూశానని బామ్మ రత్నాంభ ఇంట్లో వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode హాల్లో అందరూ ఉంటే బామ్మ అక్కడికి ఏడుస్తూ వస్తుంది. నా మనవరాలు లేకుండా నేను బతకలేను అని ఏడుస్తుంది. ఇక బామ్మతో పాటు నయని, విక్రాంత్ వస్తారు. బామ్మ ఎందుకు ఏడుస్తుందని విశాల్ అడిగితే త్రినేత్రి ఉక్రోషంతో వెళ్లిపోయిందని నయని చెప్తుంది. ఎక్కడికి అని ముక్కోటి అడిగితే తెలీదని బామ్మ చెప్తుంది.
వల్లభ: మరి ఇక్కడున్నది ఎవరు.
బామ్మ: మీ పెద్ద మరదలు నయని.
తిలోత్తమ: నాటకాలు ఆడుతున్నావా త్రినేత్రి. నువ్వే లంగా వోణి కట్టుకొని వచ్చి త్రినేత్రి అంటావ్ మళ్లీ నువ్వే చీర కట్టుకొని వచ్చి నయని అంటావ్. ఎవర్ని పిచ్చి వాళ్లని చేద్దాం అని.
విక్రాంత్: అమ్మ త్రినేత్రి బామ్మ గారిని నయని వదిన దగ్గరకు తీసుకెళ్లింది.
సుమన: అదేంటి అచ్చం నాలా ఉందని మా అక్క నోరు వెళ్లిబెట్టుంటుంది.
బామ్మ: మీ అక్క ఏమో కానీ నేను నోరెళ్లబెట్టాను. అచ్చం ఒకేలా ఉన్నారు. ఇద్దరినీ ఇలా ఎదురెదుగా చూశాను. కవల పిల్లలు కూడా అంత దగ్గర పోలికలతో ఉండరేమో. ఆ అమ్మవారి లీల ఏంటో కానీ ఇద్దరినీ అలా పుట్టించిందమ్మా.
విశాల్: అది సరే బామ్మ త్రినేత్రి ఎక్కడికి వెళ్లింది.
బామ్మ: ఊరెళ్లిపోదాం అంటే తప్పో ఒప్పో విశాల్ బాబుగారిని భర్తగా భావించాను. పెళ్లి అయినా కాకపోయినా తనే నా భర్త అనుకొని ఇక్కడే ఉండిపోతా అని బెట్టు చేసింది.
విశాల్: ఆ అమ్మాయి అలా అన్నా సరే కలలో కూడా నేను నయనికి అన్యాయం చేయను.
నయని: ఇదే మాట నేను చెప్పాను బాబుగారు.
విక్రాంత్: ఇక్కడుండనిస్తే సరే సరి లేదంటే దేవీపురం రానని చెప్పింది.
బామ్మ: నేను కోప్పడ్డాను ఎలా రావో చెప్తానని అనడంతో ఏడుస్తూ ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. పెళ్లీడుకొచ్చిన పిల్ల.
అందరూ త్రినేత్రి ఏమైందా అని కంగారు పడతారు. వెతుకుందామని విశాల్ అంటాడు. తిలోత్తమ మాత్రం తనకు అనుమానం ఉందని చెప్తుంది. ఈ రోజే మనకు త్రినేత్రి కనిపించింది నిన్నా మొన్నా లేదు కదా అంటుంది. దానికి విక్రాంత్ ఉంది నేను చూశానని అంటాడు. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. కళ్లెదురుగా నయని వదినను త్రినేత్రిని ఒకే సారి చూశానని అంటాడు. త్రినేత్రిని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని విశాల్ చెప్తాడు. తిలోత్తమ మాత్రం ఇంకా నాకు అయోమయంగా ఉందని అంటుంది. ఎక్కువ ఆలోచించొద్దని విశాల్ చెప్పి త్రినేత్రిని మీ ముందు ఉంచుతానని అంటాడు. ఇక ముక్కోటి త్రినేత్రి వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉంటామని అంటారు. విశాల్ వాళ్లు సరే అంటారు. బామ్మ నయనితో మా త్రినేత్రి వచ్చే వరకు నీలోనే మా నేత్రిని చూసుకుంటానని అంటుంది. నయని సరే అంటుంది.
హాసిని, నయని రాత్రి బయట మాట్లాడుతూ ఉంటే తిలోత్తమ, వల్లభలు వచ్చి నువ్వే నటిస్తున్నావని అంటుంది. విశాల్ బాబు త్రినేత్రిని తీసుకొస్తే మీరు నమ్ముతారని చెప్పి నయని వెళ్లిపోతుంది. మరోవైపు సుమన విక్రాంత్ బుర్ర తినేస్తుంది. నయని, త్రినేత్రి ఇద్దరూ ఒకేలా ఉన్నారా.. ఒకేలా ఉంటే అటు ఇటూ మార్చేసి ఆస్తి కొట్టేయొచ్చని త్రినేత్రిని మన వైపు తిప్పుకుందామని అంటుంది. దాంతో విక్రాంత్ ఫుల్‌గా ఇచ్చి పడేస్తాడు. ఇక ఉదయం బామ్మకి సుమన, హాసినిలు పాప గురించి గాయత్రీ దేవి గురించి చెప్తారు. ఇలాంటి వాళ్లకి ఇంట్లో విషయాలు చెప్పొద్దని వల్లభ అంటాడు. ఇక సుమన వైకుంఠాన్ని చూసి ఈమె నగలు కొట్టేసేలా ఉందని అంటుంది. ఇక నయని వల్లభని బావ అని పిలుస్తుంది. దాంతో బామ్మ వీడిని బావ అని పిలుస్తావేంటే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మా అమ్మ ఎవరు? అసలు ఉందా లేదా? ఇంట్లో వాళ్లని ప్రశ్నించిన బంటీ