Trinayani Serial Today December 24th: 'త్రినయని' సీరియల్: విశాల్ ప్రశ్నలకు నయని దొరుకుపోతుందా.. సుమన ఒంట్లో నయని ఆత్మ!
Trinayani Today Episode ఇంట్లో ఉన్నది నయని కాదు త్రినేత్రి అని చెప్పడానికి సుమన తన శరీరంలోకి చనిపోయిన నయని ఆత్మ వచ్చినట్లు నటించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode వల్లభ త్రినేత్రి బామ్మ రత్నాంబ గురించి ఇంట్లో అందరికీ చెప్తాడు. బామ్మ మనవరాలు అచ్చం నయనిలా ఉంటుందని అంటాడు.. దానికి తిలోత్తమ నయని బయట ఎక్కడో ఉందని నయని రూపంలో ఇంట్లో ఉన్నది త్రినేత్రి అని చెప్తుంది. ఎవరూ నమ్మరు. కావాలి అంటే ఆ బామ్మనో త్రినేత్రి అత్తామామల్ని తీసుకురమ్మని చెప్తారు. అందరూ వాళ్లని ఇంటికి తీసుకురావాలని అనుకుంటారు. అందరూ వెళ్లిపోతారు తర్వాత నయని ఆలోచిస్తూ ఉంటే విశాల్ అక్కడికి వెళ్తాడు.
విశాల్: నయని వల్లభ అన్నయ్యతో ఆ బామ్మ వచ్చుంటే ఇలా ఆలోచనలో పడేదానివి కాదు కదా.
నయని: మనసులో ఎక్కడ ఆ బామ్మ ఇంటికి వచ్చేస్తుందో అని భయపడుతూ ఆలోచిస్తున్నాను బాబుగారు మీరు ఇలా అర్థం చేసుకున్నారా.
విశాల్: అన్నయ్య మాటలు విన్నాక తను నిజమే చెప్పాడని అనిపిస్తుంది. ఎవరో ఒక బామ్మ ఎదురు పడి నీ ఫోటో చూపించి అడిగారని చెప్పుంటే నమ్మకపోయే వాడిని కానీ త్రినేత్రి అని బామ్మ పేరు మామయ్య అత్తయ్యల పేర్లతో సహ చెప్పేసరికి నమ్మాను.
నయని: నాలా ఉన్న ఆ త్రినేత్రిని చూడాలని మీకు ఉందా బాబుగారు
విశాల్: నిజానికి నువ్వు సమాధానం ఇవ్వాలి నయని ఆ త్రినేత్రి నీలా ఉంటుందని మాకు ఇప్పుడు తెలుసు కానీ నీకు ఎప్పుడో తెలుసుని అనిపిస్తుంది. షాక్ అయ్యావా నయని నేను నీకు ఇలా ఎందుకు అడిగాను అంటే నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే నేనే త్రినేత్రిని అని అన్నావ్ ఆ తర్వాత నేనే నయనిని అని అన్నావ్. మొత్తానికి కన్ఫ్యూజ్ చేసినా నీకు కంగారు పెట్టకూడదని మేం ఓపిక పట్టి నిన్ను మామూలు మనిషిలా మార్చుకున్నాం. అసలు నువ్వు ఆ త్రినేత్రిని ఎప్పుడు చూశావ్ ఎక్కడ చూశావ్. నువ్వు దేవీపురం వచ్చిన నాకు ఫోన్ చేశావ్ కానీ ఇంకెవరినీ కలవలేదు. మరి ఎందుకు తనే నువ్వు అన్నావ్. తన వివరాలు నీకు ఎలా తెలుసు. తనలా ఎలా ప్రవర్తిస్తున్నావ్.
నయని: చెప్తా బాబు గారు కానీ కొంచెం టైం కావాలి. తనలో తాను నాకు అన్నీ గుర్తున్నాయి కానీ చెప్తే మీరు తట్టుకోలేరు బాబుగారు.
తిలోత్తమ, సుమన, వల్లభలు నయని, త్రినేత్రి గురించే మాట్లాడుకుంటారు. త్రినేత్రి నయనిలా ఎలా చెక్‌ల మీద సంతకాలు పెడుతుందని అనుకుంటారు. ఇక తిలోత్తమ నయని ఆత్మ మనలో ఎవరి మీద వాలినట్లు నటించి ఇంట్లో ఉన్నది నయని కాదని చెప్దామని అంటుంది. ఇక ఎవరు నటిస్తారు అని అనుకుంటే దాంతో తిలోత్తమ ఆత్మ సోకినట్లు నువ్వే నటించు సుమన అని చెప్తుంది. ఇక రాత్రి సుమన హాల్‌లో జుట్టు విరబోసుకొని కూర్చొంటుంది. అందరూ హాల్లోకి వచ్చి దెయ్యం అని భయపడతారు. సుమన అని విశాల్ అంటే విక్రాంత్ ఏమైందో ఏంటో అని దగ్గరకు వెళ్తే దగ్గరకు రావొద్దు అని సుమన అరుస్తుంది అందరూ భయపడతారు. నేను సుమన కాదు నయని అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సుమనకు దెయ్యం పట్టిందని తిలోత్తమ అంటుంది. నయని అయింటుందని వల్లభ అంటే నయని చనిపోయి ఆత్మలా తన చెల్లిలోకి చేరిందని అంటుంది. నోటి కొచ్చినట్లు మాట్లాడి ఎందుకు ఇబ్బంది పెడతారు అని విశాల్ అంటాడు.
ఇక దురంధర కూడా నయని ఏం అనకుండా ఊరుకుంది అని అది తన గొప్పతనం అని అంటుంది. నయని కూడా నేను ఆత్మని అయినా మీకు బాగానే కనిపిస్తున్నాను కదా అని తిలోత్తమ వాళ్ల మీద సెటైర్లు వేస్తుంది. ఇంతలో సుమన నేను నయని అంటే అర్థం కావడం లేదా విక్రాంత్ బాబు అని అంటుంది. ఇక నయని ఇంట్లో వాళ్లతో సుమనకు గాలి సోకి ఉంటే గాయత్రీ పాపకి ఏం చేయాలో బాగా తెలుసు అని అంటుంది. ఎవరూ అర్థం కాలేదు అంటే దానికి హాసిని పాప పడుకుంటే నిజమైన గాయత్రీ అత్తయ్య ఆత్మ వస్తుంది కదా అప్పుడు ఈ ఆత్మ సంగతి తేలుతుంది అని అంటుంది. నయని పాపని కిందకి దింపుతుంది. పాప సుమన దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

