Trinayani Serial Today December 18th: 'త్రినయని' సీరియల్: డైరీ చూసి విశాల్ షాక్.. కోమాలో ఉన్న నయని పేరిట హాస్పిటల్ బిల్.. బిత్తరపోయిన విక్రాంత్!
Trinayani Today Episode విక్రాంత్ చెప్పిన ఫేక్ హాస్పిటల్ నుంచి నయని పేరిట విక్రాంత్‌కి హాస్పిటల్ బిల్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని బిజినెస్‌కి సంబంధించి అన్ని విషయాలు చకచకా చెప్పేస్తుంది. అందరూ ఆశ్చర్యపోతూ ఎలా చెప్పగలుగుతున్నావ్ నయని అని అడుగుతారు. దానికి నయని గాయత్రీ పాపని ఎత్తుకోవడంతో ఎక్కడలేని ఉత్సాహంతో అన్నీ గుర్తుంటున్నాయని నయని అంటుంది. దానికి విశాల్ అయితే పాప నిద్రపోయే వరకు నీతోనే ఉంటుంది కదా అంటాడు. వల్లభ తల్లితో మనకు నిద్ర పట్టదు కదా అమ్మ అని అంటాడు. నయని ఇచ్చిన షాక్‌కి తిలోత్తమ, వల్లభ ఇప్పటిలో కోలుకోరని అందరూ అంటారు.
నయని రాత్రి పూట బయట కూర్చొని ఉంటే విశాల్ అక్కడికి వెళ్తాడు. నయని చేతిలో ఉన్న డైరీని విశాల్ అక్కడే పెట్టమని చెప్పి కాఫీ తీసుకురమ్మని అంటాడు. నయని వెళ్లకపోతే దానికి విశాల్ డైరీ వదిలేసి వెళ్లవని నాకు తెలుసు నయని ఎందుకంటే అలా వెళ్తే అందులో ఉన్న సీక్రెట్స్ నాకు తెలిసిపోతాయని అనుకుంటున్నావ్ కదా అంటాడు. అలా ఏం లేదు అని నయని అంటుంది. నీకు సాయంగా నేను ఉండాలి అంటే నీ ఇబ్బందిని కూడా పంచుకోవాలి డైరీ ఇవ్వు అంటే నయని వద్దని ఇవ్వదు. ఈ రాత్రికి నేను నిద్రపోవాలి అంటే ఆ డైరీ నా చేతిలోకి రావాలి అని అంటాడు. ఇక విశాల్‌కి నయని డైరీ ఇస్తుంది. అందులో ప్రతీ సారి గాయత్రీ పాపని ఎత్తుకోవాలి అనే ఉంటుంది. నిద్ర లేవగానే ఎత్తుకోవాలి. పాపని ఎత్తుకొని తినిపించాలి ఇలా ప్రతీ మూడు గంటలకు పాపని ఎత్తుకోవాలని ఉంటుంది. అది చూసి ఇదేంటి అని విశాల్ అడుగుతాడు. తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రతీ పనిలో పాప ఉంది పాపని ఎత్తుకొని అన్నీ పనులు చేయాలని ఎందుకు అనుకుంటున్నావ్ అని అడుగుతాడు. దానికి నయని పాప నా దగ్గరే ఉండాలి అని అలా రాశానని కవర్ చేస్తుంది.
ఇక ఉదయం అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉండగా లిల్లీస్ హాస్పిటల్ నుంచి బిల్లింగ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఓ వ్యక్తి వస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. అందరూ విసిగిస్తారు వెళ్లిపోండి అని నయని అంటే తిలోత్తమ ఆపుతుంది. నయని మనసులో లిల్లీస్ హాస్పిటల్‌లో కోమాలో ఉన్న తన శరీరానికి గురించి అందరికీ తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతుంది. అందరూ రకరకాలుగా అనుకుంటారు. ఎందుకు వచ్చారు అని అనుకుంటారు. దానికి ఆయన విక్రాంత్ గారికి ఈ బిల్ కవర్ ఇవ్వమని మా ఇన్‌ఛార్జ్ చెప్పారని ఆయన అంటారు. విక్రాంత్ షాక్ అయిపోతాడు. సుమన విక్రాంత్‌కి ఆ డాక్టర్‌కి ఏదో సంబంధం ఉన్నట్లు ఊహించుకొని ప్రశ్నలు వేస్తుంది. దాంతో నయని ఆ బిల్ కవర్ తీసుకొని ఆయన్ను పంపేసి మా చెల్లి రకరకాల ప్రశ్నలు వేసి లేని పోని అనుమానాలు పెడుతుందని అంటుంది. నయని అక్కడి నుంచి ఆ బిల్ తీసుకొని వెళ్లిపోతుండగా సుమన ఆపుతుంది.
ఇక విక్రాంత్ ఆ బిల్ చూస్తాను అంటే సుమన ఆపి ఆ బిల్ తీసుకొని నేను చూస్తానని అంటుంది. చదువు రాకపోవడంతో సుమనకు ఏం అర్థం కాదు ఇక తిలోత్తమకు ఆ పేపర్ ఇస్తుంది. దాంతో తిలోత్తమ చూసి షాక్ అయిపోతుంది. అతను వెళ్లిపోయాడా అని వెతుకుతుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన బిల్ సుమారు 42 లక్షలు అని సగం కడితే తప్ప ట్రీట్మెంట్ చేయమని ఉందని చెప్తుంది. ఎవరు అడ్మిట్ అయ్యారని విశాల్ అడిగితే మీ ఆవిడ నయని అని చెప్తుంది. అందరూ బిత్తర పోతారు. పావనా కూడా ఆది చూసి షాక్ అయి నిజమే అంటాడు. అందరికీ ఏం అర్థం కాక తికమకపడతాడు. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు చేర్పించారని ఆ బిల్ అయింటుందని నయని అంటుంది. ఇక విక్రాంత్ తనకు అర్థమైందని బెటర్ ట్రీట్మెంట్ కోసం వదినను ఆ హాస్పిటల్‌లో చేర్పించామని అందుకే బిల్ వచ్చిందని అంటాడు. ఇక విక్రాంత్ మనసులో నోటికొచ్చిన హాస్పిటల్ పేరు చెప్తే ఇలా ఆ హాస్పిటల్ పేరుతో బిల్ రావడం ఏంటి అని షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!