Trinayani Serial Today August 15th: 'త్రినయని' సీరియల్: మృత్యువు ఎప్పుడో తనని ఆవహించిందన్న తిలోత్తమ.. నయనికి అజ్ఞాత లెటర్!
Trinayani Today Episode నయని కన్నతొలి బిడ్డ జాడ తనకి తెలుసని తనని కనిపెడితే పాప జాడ చెప్తానని నయనికి లెటర్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నలుగురి పిల్లల చుట్టూ మృత్యు దోషం పరిభ్రమిస్తుందని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు ఇంట్లో వాళ్లకి చెప్తారు. అందరూ షాక్ అవుతారు. నలుగురిలో ఎవరికి అనేది స్పష్టత లేదని గురువుగారు అంటారు.
విక్రాంత్: గురువుగారు ఓ సందేహం గాయత్రీ పాప ఈ ఇంటి పిల్ల కాదు కదా తనకి కూడా గండం తనకు కూడా వర్తిస్తుందా.
విశాల్: స్వామి ఎవరికి వాళ్లు ఎలా పడితే అలా ఊహించుకుంటున్నారు. అసలు ఆ దోషం ఎలా వస్తుందో చెప్పగలరా.
గురువుగారు: ఎలా వస్తుందో తెలీదు కానీ ఎవరి వల్ల వస్తుందో చెప్పగలను.
తిలోత్తమ: నా వైపు చూస్తారేంటి స్వామి.
సుమన: మా అత్తయ్య గారి వల్ల దోషం వస్తుంది అంటారా.
నయని: స్వామి పరోక్షంగా అయినా చెప్పండి మేం జాగ్రత్త పడతాం.
గురువుగారు: ఫలానా వారి వల్ల అని నేను చెప్పడానికి దేవుడిని కాదు కానీ ఎవరి తొందర పడే వారి వల్లే ఈ దోషం కలుగుతుంది.
విక్రాంత్: తొందరపాటు అంటున్నారు హాసిని వదినా నువ్వే దూకుడుగా ఉంటావ్.
హాసిని: నా మాటల వల్ల హర్ట్ అవుతారు కానీ నా పనులు వల్ల కాదు.
దురంధర: సుమ్మీ నీ మాటల వల్ల దోషం రావొచ్చు జాగ్రత్తగా ఉండు.
పావనా: వీల్లిద్దరి తప్ప మిగతా వాళ్లు ఆచి తూచి అడుగేసేవాళ్లే.
తిలోత్తమ: గురువుగారు చెప్పిన మాటలు పాటిస్తూ తొందర పడకుండా ఉంటే చాలు దోషం దానికి అదే పోతుంది.
గురువుగారు: విశాల్ శాంతంగా ఉండే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు తొందర పడకు.
సుమన విక్రాంత్‌తో గాయత్రీ పాప అనాథ కాబట్టి దత్త పుత్రిక అయిన తనకి దోషం ఉండదని సుమన అంటుంది. మరోవైపు తిలోత్తమ వల్లభతో మనం వేసిన పాచిక పరుగెడుతుందని ఒక్క అవకాశంతో గాయత్రీదేవిని పట్టుకోవడంతో పాటు ఆస్తి కూడా దక్కుతుందని అంటుంది. మరోవైపు విశాల్ నయనితో పిల్లల్ని ఎలా రక్షించుకోవాలని అంటాడు. దానికి నయని పుండరీనాథం, ఉలూచిలకు ఏం అవుతుంది అన్నా తనకి తెలిసి పోతుందని అంటుంది నయని.
విశాల్: అలా అయితే గానవి, గాయత్రీలకే దోషం ఉంటుందా.
నయని: మా చెల్లి అన్నట్లు గాయత్రీని పక్కన పెడితే బెటర్ బాబుగారు. గానవి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
హాసిని: గాయత్రీని కూడా లెక్కలోకి తీసుకో చెల్లి.
విక్రాంత్: నయని వదిన అందరి విషయంలో సమానంగా ఆలోచిస్తుంది కానీ పిల్లల విషయంలో త్యాగం చేయాల్సి వస్తే ఉలూచినే త్యాగం చేయొచ్చు.
సుమన: అలా అంటారేంటి బుల్లిబావగారు.
విక్రాంత్: మృత్యువు ఆకలి తీర్చాలి అంటే.
సుమన: అబ్బా ఆపండి అడుక్కుతిని అయినా నా బిడ్డని పోషిస్తాను కానీ ఎవరి దోషానికో నా బిడ్డని బలి ఇవ్వను.
దురంధర: సుమ్మి నేను కూడా ప్రెగ్నెంట్ కదా నా బిడ్డకు ఏమైనా అవుతుందా.
సుమన: నన్ను ముంచేశావ్ కదా పిన్ని ఈ సారి అనుభవిస్తావేమో చూద్దాం.
పావనా: ఎందుకమ్మా అలా అంటావ్ కావాలి అంటే మా ఆవిడ పేరు మీద రాసుకున్న ఆస్తి నీకు ఇచ్చేస్తుందిలే.
సుమన: నిజమేనా.
తిలోత్తమ: నేను సర్పదీవికి వెళ్లినప్పుడు కరాడీ పాము తల మీద జ్యోతి వెలిగించినప్పుడు మృత్యు దేవత నన్ను ఆవహించింది. దాని అర్థం గండం నన్ను కమ్మేసిందని.
వల్లభ: కొంప తీసి నువ్వు నా తల్లివి కాదేటి నన్ను ఇబ్బంది పెట్టకుమమ్మీ.
తిలోత్తమ: నేను నీ కన్నతల్లినేరా నా రూపం కాలిపోతున్నా నన్ను గజగండ కాపాడాడురా.
ఇద్దరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని విశాల్ అంటే ముగ్గురు అని గాయత్రీ అమ్మగారు పసిబిడ్డగా ఉన్నారని నయని అంటుంది. ఇక విక్రాంత్ ఉలూచికి ఏమైనా పర్లేదని అనుకుంటే నీకు ఆస్తి ఇస్తారని అంటే సుమన సరే అంటే దురంధర తిడుతుంది. నయనికి సాయం అడుగుదామని వెళ్లిపోతుంది. ఉదయం ఇంటికి పోస్ట్ వస్తుంది. హాసిని తీసుకుంటుంది. నయనికి పోస్ట్ వచ్చిందని హాసిని అంటుంది.
" శ్రీమతి నయని మీరు కన్న కూతుళ్లలో మొదటి బిడ్డ కాన్పు అయిన రోజే తప్పిపోయిందని మీకు తెలుసు. నాకు కూడా తెలుసు. అయితే ఆ పసిబిడ్డ ప్రస్తుతం ఎక్కడ ఉందో మీకు ఎవరికీ తెలీదు. కానీ నాకు తెలుసు. ఇంకో నెల రోజుల్లోపే మీ పాప పుట్టిన రోజు వచ్చేస్తుంది. ఈ లోపే మీరు మీ తొలిబిడ్డ ఆచూకీ తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను ఇందులో అడ్రస్ గానీ ఫోన్ నెంబరు గానీ రాయడం లేదు నన్ను కలవడానికి మీకు ఓ క్లూ ఇస్తాను తెలుసుకోగలిగితే మిమల్ని కలుస్తాను లేదంటే.. "
అంతే రాశారని ఇంకేం రాయలేదని హాసిని లెటర్ చదివి ఇంట్లో వాళ్లకి చెప్తుంది. క్లూ కూడా లేదని అంటుంది. నయని లెటర్ తీసుకొని చూస్తుంది. ఎవరో బెదిరించడానికే ఇలా చేస్తారని పావనా అంటాడు. అందరూ ఆలోచిస్తుంటారు. ఆలోచించి చూస్తే ఏదో ఐడియా వస్తుందని ఈ లెటర్ రాసింది ఆడవాళ్లే అని నయని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.