అన్వేషించండి

Seethe Ramudi Katnam August 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాకి బోల్తా కొట్టించిన రామ్, సీతలు.. సూర్య, మధులకు గుడ్ న్యూస్ చెప్పిన అన్న!

Seethe Ramudi Katnam Today Episode మహాకి తెలీకుండా సీత దగ్గరకు రామ్ వెళ్లడం మహాలక్ష్మీకి దొరకకుండా సీతారామ్‌లు తప్పించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode శివకృష్ణ లలితలో ప్రీతి పట్ల విక్కీ చేసిన పని చెప్తాడు. లలిత షాక్ అయిపోతుంది. అంత జరిగిందా అని సమయానికి మీరు వెళ్లకపోయి ఉంటే జరిగబోయేది తలచుకుంటే భయంగా ఉందని అంటుంది. ఇంతలో ప్రీతి మామయ్య అనుకుంటూ వస్తుంది. మామయ్య మిమల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమించమని కాళ్ల మీద పడుతుంది. నువ్వు నా మేనకోడలివి అని శివకృష్ణ ప్రీతిని దగ్గరకు తీసుకుంటాడు. రామ్ కూడా మామయ్యకి థ్యాంక్స్ చెప్తాడు. 

శివకృష్ణ: మీరు ఇలా నన్ను నోరారా మామయ్య అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుంది.
లలిత: అబ్బో మామయ్య, అల్లుడు, కోడలు ఒకటైపోయి ఈ అత్తని మర్చిపోయారా. 
ప్రీతి: ఆయన మా మామయ్య అయితే మీరు మా మేనత్త మిమల్ని ఎలా మర్చిపోతాం అత్తయ్య అని ప్రీతి హగ్ చేసుకుంటుంది. 
సీత: మీరంతా దగ్గర అయిపోయి నన్ను అనాథని చేసేయండి. మీ ప్రేమలు మీవే కానీ ఇక్కడ సీత ఉందని మర్చిపోయారు. 
ప్రీతి: అవును సీత మా ఫ్రెండ్స్ నీకు ఎలా తెలుసు.
రామ్: వాళ్లు విక్కీ వల్ల ఇబ్బంది పడ్డారని నీకు ఎలా తెలుసు. 
సీత: ఆ విక్కీ గాడు మన ఇంటికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. విద్యాదేవి టీచర్‌కి కూడా వాడి ప్రవర్తన నచ్చలేదు. అప్పటి నుంచి వాడి మీద నిఘా పెట్టా. నాన్న నాకు నువ్వు వాడితో వెళ్తున్నావని చెప్పగానే నేను అలర్ట్ అయ్యా. నాన్న వాడిమీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిల గురించి చెప్పగానే వాళ్లని ఫోన్‌లో కాన్‌టాక్ట్ చేసి రప్పించా.
ప్రీతి: చాలా థ్యాంక్స్ సీత ఈ రోజు నువ్వు కూడా మామయ్యతో కలిసి నన్ను కాపాడావు.
సీత: ఇది నా బాధ్యత మరదలు పిల్లా. అవును మీరు మీ పిన్నితో చెప్పి ఇక్కడికి వచ్చారా.
రామ్: లేదు లేదు పద ప్రీతి.

సూర్య ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే ముగ్గురు కుర్రాళ్లు అడ్డుపడి నీ భార్య నీ దగ్గరకు వచ్చేసింది కదా వాడి మీద మోజు పోయిందా అసలు నువ్వే దాన్ని అక్కడికి పంపావా అని అడుగుతాడు. నీ పెళ్లాం వేరో వాడితో తిరిగి వస్తే దానితో కలిసి ఉంటున్నావ్ అని మళ్లీ ఎవరితో అయినా వెళ్లిపోతుందని అంటాడు. సూర్య అడ్డుకుంటే వాళ్లు సూర్యని తోసేస్తారు. అవమానిస్తారు. ఇంతలో మధు కర్రతో వాళ్ల తల పగలగొట్టి చితక్కొడుతుంది. తన భర్తని అవమానించి తనని అనరాని మాటలు అంటారా అని చితక్కొడుతుంది. దాంతో ముగ్గురు పారిపోతారు. మధు సూర్యని లేపి ఇంటికి తీసుకెళ్తుంది. 

రామ్ కారు తుడుస్తున్నట్లు నటిస్తూ సీత బయటకు వస్తే బాగున్ను అనుకుంటాడు. ఇంతలో సీత బయటకి వస్తుంది. రామ్ చాలా సరదా పడతాడు. తన కోసమే వచ్చావా అని అడుగుతుంది. మాట్లాడాలి అని ఉందని రామ్ అంటే ఇంట్లో ఎవరూ లేరు రమ్మని సీత చెప్తుంది. ఎలా రాను అని రామ్ అడిగితే సీత చీర విసురుతుంది. దాని వంకతో రమ్మని సైగ చేస్తుంది. రామ్ చీర పట్టుకొని వెళ్తుంటే సాంబ నేను ఇస్తాను అంటే రామ్ సాంబకి కారు తుడవమని తాను సీతకి చీర ఇచ్చి వస్తానని అంటాడు. చీర పట్టుకొని రామ్ సీత దగ్గరకు వెళ్తాడు. రామ్ సీతని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. ఆషాఢం వల్లే దొంగ చాటుగా కలుసుకోవాల్సి వచ్చిందని రామ్ అంటాడు. ఇక సీత ఆషాఢం వల్లనో అత్తయ్య వల్లనో తెలీదు కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిందని సీత అంటుంది.. రామ్ సీతకి ముద్దు పెట్టుకుంటాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. రామ్ ఆకలేస్తుంది ఏమైనా ఇవ్వమంటే సీత ద్రాక్షపళ్లు తీసుకొస్తుంది. సీతనే తినిపించమని రామ్ అంటాడు. సీత ఒడిలో రామ్ పడుకుంటే సీత రామ్‌కి తినిపిస్తుంటుంది. ఇక ముద్దు కూడా పెట్టుకుంటారు. 

మరోవైపు మహాలక్ష్మీ రామ్‌ కోసం వెతుకుతుంది. సాంబని అడుగుతుంది. సాంబ తెలీదు అని చెప్పి సీత ఇంటికి మాత్రం వెళ్లలేదు అని అంటాడు. దాంతో మహా రామ్ సీత దగ్గరకే వెళ్లుంటాడని అనుకొని వస్తుంది. మహా వచ్చేసరికి రామ్ సీత చీర కప్పుకుంటాడు. మహా కనిపెట్టలేకపోతుంది. రామ్ వచ్చాడా అని సీతని అడుగుతుంది. ముసుగు వేసున్నది ఎవరు అని అడిగితే నా ఫ్రెండ్ మేరీ అని చెప్తుంది.. మేరీని అడ్డు పెట్టుకొని సీత తన అత్తని తిడుతుంది. మేరీ భర్త తింగరోడని అంటుంది. మహా కోపంతో వెళ్లిపోతుంది. ఇక మహాకి అనుమానం వచ్చి వెనక్కి వస్తుంది. రామ్ సీత చేతిలో చీర పెట్టేసి వెళ్లిపోతాడు. ఇక సీత మేరీ డ్రస్ మార్చుకోవడానికి వెళ్లిందని చెప్తుంది. రామ్ బయటకు వస్తాడు. రామ్ ఇంటికి వెళ్తానంటే సీత వెనక దారిలో వెళ్లమని చెప్తుంది. మరోవైపు మహా కోపంతో పూల కుండీ పగల గొడుతుంది. అందరూ వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. రామ్ ఇంట్లో లేడు బయట లేడు సీత దగ్గర లేడని అంటుంది. ఇంతలో రామ్ మేడ మీద నుంచి కిందకి వస్తాడు. 

ఇళ్లంతా వెతికాను నువ్వే లేవని ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. రామ్ వణుకుతూ బాత్‌రూమ్‌లో ఉన్నానని చెప్తాడు. వర్క్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. రామ్ మనకు తెలీకుండా ఏదో చేస్తున్నాడని అంటుంది. రామ్ సీత దగ్గరకు కచ్చితంగా వెళ్లాడని మహా అనుకుంటుంది. మరోవైపు మధు సూర్యకి కాఫీ ఇస్తుంది. తన మీద తనకు కోపం ఉందని ఏం చేయలేని తన నిస్సాయత మీద తన అవిటి తనం మీద కోపంగా ఉందని అంటాడు. నాతో నువ్వు సంతోషంగా ఉండలేవని అంటాడు. ఇక సూర్య అన్న వచ్చి నీకు కాలు వస్తుందని ఓ డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పాడని చిన్న ఆపరేషన్‌తో నువ్వు ఎప్పటిలా నడుస్తావని అంటాడు. మధు చాలా సంతోషిస్తుంది. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయిద్దామని అంటే అందుకు చాలా ఖర్చు అవుతుందని జలజ అంటుంది. ఇక ఆపరేషన్ పది లక్షలు అవుతుందని సూర్య అన్న చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: నలుగురి పిల్లలకు మృత్యు గండం.. గాయత్రీదేవిని ఇంటికి తీసుకొస్తానని ఛాలెంజ్ చేసిన నయని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget