YS Sharmila: జగన్, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది మోడీనే - వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు
YS Viveka Case: వివేకా కేసులో జగన్, అవినాష్ రెడ్డిలను మోదీనే కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. సునీత ఆరోపణల్లో నిజం ఉందని ఎందుకు మళ్లీ దర్యాప్తు చేయరని ప్రశ్నించారు.

Sharmila accuses Modi of protecting Jagan and Avinash Reddy: వివేక హత్య విషయంలో మళ్ళీ దర్యాప్తు ఎందుకు జరగకూడదు ? వై నాట్ ? అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం.. ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. సునీత పోరాటం లో న్యాయం ఉంది. సునీత ఆరోపణలో నిజం ఉందన్నారు. జగన్ మోడీ కి దత్తపుత్రుడు .. CBI మోడీ చేతిలో కీలుబొమ్మ .. జగన్ కోసం మోడీ CBI గొంతు నొక్కాడని ఆరోపించారు. జగన్ కోసం అవినాష్ రెడ్డి నీ కాపాడుతున్నారు. నిజంగా CBI అనుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేదని స్పష్టం చేశారు. వివేక హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు ఉన్నాయి.. హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటన స్థలంలో ఉన్నాడని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు పెట్టుకొని న్యాయం ఎక్కడ జరుగుతుందని షర్మిల ప్రశ్నించారు. CBI విచారణ సరిగా లేదు అనే సునీత ఆరోపణలో నిజం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
టీడీపీ బీజేపీ మిత్ర పక్షమేనని కానీ టీడీపీ పెట్టింది తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమని గుర్తు చేశారు. ఇవ్వాళ తెలుగు వాడు నిలబడి ఉన్నాడు ఈ సమయంలో తెలుగు వారి పక్షాన నిలబడాలని ఎందుకు అనిపించడం లేదని .. ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావించారు. అనాడు పీవీ కోసం NTR నంద్యాల సీట్ వదులుకున్నారని... తెలుగు బిడ్డ ఉన్నత స్థాయి లో ఉండాలి అనుకున్నారని గుర్తు చేశారు. ఇవ్వాళ తెలుగు తమ్ములు, తెలుగు జాతి ముఖ్యం అనుకోవడం లేదన్నారు. చంద్రబాబుకి తెలుగు జాతి కంటే..మోడీ ఖ్యాతి ముఖ్యమని విమర్శించారు. చంద్రబాబు తీరు నిస్సిగ్గుగా ఉంది. CP మోడీకి మద్దతు ఇవ్వడం దారుణమని.. ఇండియా కూడా అభ్యర్థి రాజకీయాలకు అతీతం... జగన్ సామాజిక వర్గం కి చెందిన వ్యక్తి. అయినా బీజేపీ తో అక్రమ పొత్తు కాబట్టే nda అభ్యర్థికి మద్దతు ఇచ్చారన్నారు. అసలు NDA అభ్యర్థికి ఎందుకు జగన్ మద్దతు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ లో 44 EOI లకు టెండర్లు ఇవ్వడం అంటే ప్లాంట్ ను అమ్మేయడమేనని విశాఖ స్టీల్ ప్లాంట్ పై YCP ఉద్యమం చేయడం సిగ్గుచేటన్నారు. 2021 లో ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడితే YCP గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమిందా అని ప్రశ్నించారు. ఇప్పటికే కార్మికులను సగం తగ్గించారని ఒకప్పుడు YSR హయంలో 35 వేల మంది పని చేసే వాళ్ళు.. ఇప్పుడు ఆ సంఖ్య ను 20 వేలకు కుదించారన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు అప్పగిస్తే కార్మికుల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 లక్షల టన్నుల ఐరన్ ఓర్ కావాల్సి ఉంటే ఇప్పుడు 5 లక్షల టన్నులకు కుదించారు ..విశాఖ స్టీల్ అప్పుల్లోకి నెట్టి అదానికి అప్పగించాలని చూస్తున్నారన్నారు. విశాఖ స్టీల్స్ ఆస్తుల విలువ 4 లక్షల కోట్లు ఆ భూముల మీద మోడీ కన్నుపడిందన్నారు. ఒక చేతితో 11 వేల కోట్లు ఇచ్చి మరో చేత్తో మొత్తం లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ సెయిల్ లో విలీనం చేయాలి అన్నారు.. డిల్లీ దాకా వెళ్తా అన్నారు.. అసెంబ్లీలో తీర్మానం చేయాలి అన్నారు. అఖిల పక్షం వేయాలి అన్నారు.. ఎన్నికల్లో అన్ని మాటలు చెప్పి ఇప్పుడు మోడీకి మద్దతు ఇవ్వడం అన్యాయమన్నారు.





















