Trinayani Serial Today April 2nd: 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి జాడ కోసం పిండి పూజ.. సుమన బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతానన్న పెద్దబొట్టమ్మ!
Trinayani Serial Today Episode గాయత్రీ దేవి జాడ తెలుసుకునేందుకు నయని ఇంట్లో విశాలాక్షి బియ్యం పిండితో పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode పెద్దబొట్టమ్మ, నయని, హాసిని, డమ్మక్కలు కిచెన్‌లో మాట్లాడుకుంటారు. సుమన ఉలూచి కన్న తల్లి అని పెద్దబొట్టమ్మ మీద ప్రమాణం వేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న పెద్దబొట్టమ్మ దెయ్యంలా సుమనను భయపెడుతుంది. ఇక పెద్దబొట్టమ్మ నయని ఇంట్లోనే ఉలూచి కన్నతల్లిలా ఉండిపోతా అంటుంది.
డమ్మక్క: అది జరిగే పనేనా..
హాసిని: మేమంతా ఇళ్లు ఖాళీ చేసి నువ్వు నాగయ్య ఉలూచి ఇక్కడే కాపురం చేయాలి. అప్పుడు దీన్ని విల్లా అనరు. పాముల పుట్ట అంటారు.
పెద్దబొట్టమ్మ: ఇక్కడ ఉండం హాసిని ఉలూచిని తీసుకొని నాగలోకం వెళ్లిపోతాం.
డమ్మక్క: ఒక్కసారి అక్కడికి వెళ్లారు అంటే తిరిగి రావడం చాలా కష్టం.
నయని: వద్దు పెద్దమ్మ పాపని సుమనకు దూరం చేయొద్దు.
పెద్దబొట్టమ్మ: నా భర్తను నన్ను వేరు దూరం చేయాలి అనుకున్న ఆ సుమనపై నేను ఎందుకు జాలి పడాలి. నిజానికి విరుచుకుపడి కాటేసి వెళ్లిపోవాలి. ఉలూచిని పెంచే తల్లి లేకుండా పోతుంది అని వదిలేశాను. సుమనకు భయపడి నా బిడ్డను ఆరు నెలలకు ఒకసారి వచ్చి చూడమంటారా. నయని నీ మంచితనం వల్లే సుమన ఇంకా బతికి ఉంది. లేదంటే ఎప్పుడో చంపేసేదాన్ని. ఈ సారి వదలను.
హాసిని: చెల్లి వెళ్లిపోయింది.
డమ్మక్క: మళ్లీ వస్తుంది. కానీ ఈ సారి జాగ్రత్తగా ఉండాలి.
వల్లభ ఒక్కడే అఖండ స్వామి దగ్గరకు వస్తాడు. తిలోత్తమ రాలేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అనకుంటాడు వల్లభ. ఇక అఖండ స్వామి తన దివ్య దృష్టితో చూసి మీ ఇంట్లో పూజ జరుగుతుందని వల్లభతో చెప్తాడు. ఇక వల్లభకు అఖండ స్వామి బియ్యం పిండి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లమంటాడు. ఈ పిండి వల్ల గాయత్రీ దేవికి సంబంధించిన సమాధానం లభిస్తుందని చెప్తారు.
ఇంట్లో అందరూ పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ పూజ వల్ల నీ తొలి బిడ్డ జాడ తెలుస్తుంది అని ఎద్దులయ్య నయనితో చెప్తాడు. దీంతో హాసిని విశాల్‌తో ఈ పూజ జరగకుండా ఆపేద్దామా అని అడుగుతుంది. నయనికి తెలిస్తే గోల అవుతుంది అని విశాల్ అంటాడు. ఇక హాసిని ఈ పూజ నేనే ఆపేస్తా అని రంగంలోకి దిగుతుంది.
సుమన: మొత్తానికి గాయత్రీ అత్తయ్య జాడ తెలుస్తుంది అన్న ఆనందం మా అక్క ముఖంలో తెలుస్తుంది కానీ మా బావగారే కిమ్మనకుండా ఉన్నారు.
విక్రాంత్: బ్రో తన ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలీక లోపలే ఉబ్బితబ్బిబైపోతున్నారు అనుకుంటా.
విశాల్: అవును..
మరోవైపు విశాలాక్షి చేస్తున్న ఈ పూజను ఆపేయాలి అనుకున్న హాసిని బియ్యం పిండిని పారబోసేస్తుంది. ఖాళీ డబ్బా తీసుకొని వచ్చి హాసిని బియ్యం పిండి ఖాళీ అయిపోయింది అంటుంది. ఇంతలో అఖండ స్వామి ఇచ్చిన పిండిని వల్లభ తీసుకొని వస్తాడు. పిండి ఎవరు తీసుకురమ్మన్నారు అని వల్లభని అందరూ ప్రశ్నిస్తారు. దీంతో సుమన నేనే చెప్పాను అని తన మీద వేసుకొని కవర్ చేస్తుంది.
ఇక విశాలాక్షి బియ్యం పిండితో మూడు ముద్దలు చేయమని నయనికి చెప్తుంది. చేశాక ఒకటి తులసి దగ్గర పెడతారు. మరొకటి సుమన పట్టుకుంటుంది. మూడో ముద్ద రోటిలో వేసి అందులో పాలు పోసి చెరకు గడలతో దంచితే పాలతో తడిసిన పిండి గాయత్రీ దేవి జాడ తెలిసిన వారిమీద పడుతుంది అని విశాలాక్షి చెప్తుంది. విశాల్, హాసిని, పావనా మూర్తిలు కంగారు పడతారు.
విక్రాంత్: అంటే దీని అర్థం ఏంటి.
ఎద్దులయ్య: తేలిక బాబు. ఆ గాయత్రీ తల్లి గురించి తెలిసిన వారు ఇక్కడే ఉన్నారు అని.
ఇక మూడో బియ్యం పిండి ముద్దను రోటిలో వేయగానే పాలు పోసి చెరకుతో విశాలాక్షి దంచుతుంది. ఇక పాల చుక్కలు పడాలి కాబట్టి కొంచెం దగ్గరగా రండి అని సుమన పిలుస్తుంది. దీంతో పావనా మూర్తి ఇప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సుమ కనకాల: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!