Trinayani Serial Today April 25th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి జాడ కోసం గురువుగారికి ప్రాణహాని తలపెట్టిన తిలోత్తమ.. సుమన నింద మోయాల్సిందేనా!
Trinayani Serial Today Episode గురువుగారితో గాయత్రీ దేవి పునర్జన్మ గురించి తెలుసుకోవడానికి గురువుగారికి తిలోత్తమ విషం సుమనతో ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode తిలోత్తమ గదికి హాసిని వెళ్లి అఖండ స్వామి ఇచ్చిన పౌడర్ తన ముఖానికి రాసుకుంటుంది. అది తెలిసి అందరూ నవ్వుకుంటారు. అందరూ తిలోత్తమకు వెటకారం చేస్తారు. దీంతో నయని పాపని తీసుకొని వెళ్లిపోతుంది. ఇక పావనా మూర్తి, హాసిని, విశాల్‌లు ఓ చోట మీటింగ్ పెడతారు.
పావనా: అల్లుడు నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ వయసులో హార్ట్ ఎటాక్ వస్తే నా పెళ్లాం పరిస్థితి ఏంటి.
విశాల్: అత్తయ్యని చూసుకోవడానికి మేం ఉన్నాం కదా మామయ్య.
పావనా: జోకులెయ్యకు అల్లుడు. గాయత్రీ పాపే గాయత్రీ అక్క అన్న బ్రహ్మరహస్యం ఎవరికీ చెప్పుకోలేక నా కడుపు ఉబ్బిపోతుంది.
విశాల్: చూడు మామయ్య తిలోత్తమ అమ్మ, వల్లభ అన్నయ్యలు అఖండ స్వామి ఇచ్చిన పౌడర్‌తో అమ్మ అచూకి తెలుసుకోవాలి అనుకున్నారు. లక్కీగా వదిన చేసిన పని వల్ల అద్దంలో మా అమ్మకు బదులు పాప పెద్దమ్మ కనిపించింది.
హాసిని: అప్పుడప్పుడు మనం చేసే చిలిపి పనులు కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అని ఈ రోజు తెలిసింది.
నయని: బాబుగారు ఎందుకు ఎప్పుడు చూసినా బాబుగారి దగ్గర మీ ఇద్దరే ఉంటారు.
హాసిని: వెళ్లమంటే వెళ్లిపోతాం రా బాబాయ్.
నయని: అలా కాదు అక్క..
విశాల్: నువ్వు చెప్పు నయని..
నయని: గాయత్రీ అమ్మగారి విషయంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే పోలీస్ అన్నకు ఫోన్ చేస్తుంటే కాల్ కలవడం లేదు. చంద్రశేఖర్ అన్న ఏదో ప్రమాదంలో పడబోతున్నారు అని నాకు అనిపించింది. అందరూ షాక్ అవుతారు.
విశాల్: నయని తనకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందని నీకు తెలుసా.
హాసిని: ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఆల్రెడీ ట్రబుల్‌లో ఉన్నాడా..
నయని: లేదు అక్క గండం ఇంకా ఆయన్ను చేరుకోలేదు.
విశాల్: ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలిస్తే చెప్పు నయని మనం ఆయన్ను రక్షిద్దాం..
తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్లి పని జరగలేదు అని చెప్తుంది. హాసిని పౌడర్ రాసుకుందని చెప్తారు. అన్ని పనులకు హాసిని అడ్డుపడుతుందని చెప్తారు. దీంతో అఖండ స్వామి వాళ్లని తిడతారు. ఇంకేమైనా సలహా ఇవ్వమని అంటే అఖండ స్వామి సీరియస్ అవుతారు. తిలోత్తమ అఖండ స్వామిని రిక్వెస్ట్ చేస్తుంది.
అఖండ: మీ శ్రేయాభిలాషి ఎవరు..
తిలోత్తమ: సుమన..
అఖండ: తనకి గాయత్రీ దేవి తెలీదు.
తిలోత్తమ: కులగురువు మా శ్రేయాభిలాషే..
అఖండ: అడగండి.. తెలుసుకోండి. ఆయన మామూలుగా అడిగితే చెప్పకపోవచ్చు.
వల్లభ: ఇంకెలా అడగాలి మమ్మీ..
తిలోత్తమ: నా స్టైల్‌లో అడుగుతా..
అఖండ: గురువుగారికి హాని తలపెట్టబోతున్నారు మూర్ఖులు.
మరోవైపు డమ్మక్క హాల్‌లో ధ్యానం చేస్తుంటుంది. పావనా మూర్తి అక్కడికి వస్తాడు. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు. తిలోత్తమ, వల్లభలు సంతోష పడతారు.
తిలోత్తమ: చావే అతనికి ఇంటికి రమ్మని పిలిచినట్లు ఉంది.
వల్లభ: విష ప్రయోగం చేసి చావు అంచుల వరకు తీసుకెళ్తే గురువుగారు గాయత్రీ పెద్దమ్మ గురించి చెప్తారు అనుకున్నాం. మరి అందరి ముందు ప్లాన్ అమలు చేయడం ఎలా.
తిలోత్తమ: ఇలాంటప్పుడే ఇంకొకరి మీద నెట్టేయొచ్చురా.. మనం ఏం చేసినా నయని కనిపెట్టేస్తుంది కాబట్టి నేరం సుమన మీద పెట్టేద్దాం.
ఇక గురువుగారు అందర్ని చూడాలి అని వచ్చాను అంటారు. దానికి సుమన ఆఖరి చూపులా స్వామి అంటుంది. దానికి నయని సుమనను తిడుతుంది.
గురువుగారు: తను అలా అన్నా తప్పులేదు నయని.. వయసు మళ్లిన వాడిని మృత్యువుని వెంట పెట్టుకొని తిరిగే వాడిని. ఈ జన్మ ఇక ఏ క్షణం అయినా ఆగిపోవచ్చు.
విక్రాంత్: మీరు నిజం చెప్తున్నా మనసుకి అదోలా ఉంది స్వామి. బాధగా ఉంది గురువుగారు. మంచి కోరే మీరు వందేళ్లు ఉండాలి.
డమ్మక్క: ఉండనిస్తారా అని..
తిలోత్తమ: సుమన ఎండనపడి వచ్చిన గురువుగారికి పళ్లో, మజ్జిగో ఇవ్వు..
సుమన: మా అక్క ఇస్తుంది.
ఇక తిలోత్తమ నేనే తీసుకొని వస్తాను అని అంటుంది. దీంతో గురువుగారు తిలోత్తమకు మంచినీరు అడుగుతారు. పావనామూర్తి గురువుగారితో ఎప్పుడూ అడగని మీరు ఇలా అడిగారు ఏంటో స్వామి అని అంటే గురువుగారు సృష్టి ధర్మం అడగక తప్పదు అంటారు. వల్లభ గురువుగారికి హాని తలపెట్టనున్నట్లు మాట్లాడుతాడు..
సుమన: బావగారి మాటల్లో ఏదో అర్థం ఉంది. అత్తయ్య గారు ఏదో చేయబోతున్నారా.. సుమన వెళ్తుంది.
గురువుగారు: గాయత్రీ దేవి ఎక్కడుందో చెప్పాలని వచ్చాను విశాలా. అందరూ షాక్ అవుతారు.
తిలోత్తమ మంచి నీటిలో విషం కలుపుతుంది. ఇంతలో సుమన అక్కడికి వస్తుంది. మంచి నీరు అడుగుతుంది. దీంతో తిలోత్తమ తాగేస్తావా అంటే తాగేయమంటారా అని సుమన అడుగుతుంది. ఇక పావనా, విశాల్, హాసినిలు ఏంటి స్వామి ఇలా మాట్లాడుతున్నారని అడుగుతుంది. ఇక సుమన తిలోత్తమ విషం కలిపిన నీరు గురువుగారికి ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు