(Source: ECI/ABP News/ABP Majha)
Trinayani Serial Today April 1st: 'త్రినయని' సీరియల్: దెయ్యమై వచ్చి సుమనకు చుక్కలు చూపించిన పెద్దబొట్టమ్మ - నిజం తెలుసుకున్న నయని!
Trinayani Serial Today Episode రాత్రి పెద్ద బొట్టమ్మ తెల్ల చీర కట్టుకొని వచ్చి సుమనను భయపెట్టి గొంతు నలిపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: వల్లభ నోరు అంతా మంట అని బాధ పడుతుంటే పావనా మూర్తి పంచధార పట్టుకొని వస్తాడు. హాసిని కూడా అక్కడికి వచ్చి ఆ పంచధార లాక్కొని భర్త తినకుండా చేస్తుంది. తల్లీకొడుకులు ఇద్దరూ విశాలాక్షి కాళ్లు కడుకున్న నీళ్లు తాగేశారని వల్లభతో చెప్పి నవ్వుతుంది. దీంతో వల్లభ హాసినిని కొడతాడు. దీంతో హాసిని కూడా రివర్స్‌లో పల్లెంతో వల్లభను హాసినిని ఆపాలి అని ప్రయత్నించిన పావనాను కొట్టేస్తుంది.
మరోవైపు రాత్రి సుమన పాలు పట్టుకొని పాముగా మారిన ఉలూచి కోసం హాల్‌లో వెతుకుతుంది. పక్కనే పావనా, దురంధరలు కూడా అక్కడే ఉంటారు. ఇంతలో కరెంట్ పోతుంది. గాలి విపరీతంగా వీస్తుంది. దురంధర, పావానా మూర్తిలు భయపడి గంతులేస్తారు. ఇక ఆ చీకట్లో పెద్దబొట్టమ్మ తెల్ల చీర కట్టుకొని సుమనకు కనిపిస్తుంది. సుమన కంగారుపడి ఎవరు ఎవరు అని అడుగుతుంది. హాసిని కూడా అక్కడి వస్తుంది. ఇక పెద్ద బొట్టమ్మ పావనా మూర్తి పక్కనే వచ్చి నిల్చొవడంతో పావనా గట్టిగా అరిచి రచ్చ రచ్చ చేస్తాడు. దాంతో ఇంట్లో అందరూ వస్తారు. ఇక పావనా మూర్తి పెద్ద బొట్టమ్మ వచ్చిందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు.
విక్రాంత్: పెద్దబొట్టమ్మ వస్తే పలకరించకుండా ఉంటుందా..
సుమన: అయినా చచ్చిపోయింది ఎలా తిరిగి వస్తుంది.
నయని: అలా ఎలా చనిపోయింది అంటావ్ నువ్వు.
సుమన: మొన్న ఒట్టు వేసి ప్రాణం మీదకు తెచ్చుకొని పారిపోయింది కదా అక్క. అలా ఎలా ప్రాణాలతో బయట పడుతుంది అనుకున్నావ్.
దురంధర: అంటే వచ్చింది దెయ్యమా.
హాసిని: మీకు ఇంకా అనుమానమా..
విశాల్: అసలు సెక్యూరిటీ వాళ్లు ఏం చేస్తున్నారు జనరేటర్ ఆన్ చేయొచ్చు కదా.
హాసిని: ఇంతలో డమ్మో డమ్మ అంటూ వచ్చిన డమ్మక్క మాటలు విని వచ్చింది డమ్మక్క అంటుంది.
పెద్దబొట్టమ్మ సుమన దగ్గరకు వెళ్లి.. నీ కోసమే వచ్చాను సుమన అంటుంది. దీంతో అందరూ అదిరిపడేలా సుమన గట్టిగా అరుస్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు. పావనా, హాసిని కూడా గట్టిగా అరుస్తారు. పెద్ద బొట్టమ్మ వచ్చింది అని నాకోసమే వచ్చింది అక్క అని కంగారు పడుతుంది సుమన. ఇక విక్రాంత్ ఎవరూ లేరు సుమన అని సుమనను తీసుకెళ్లి సోఫాలో కూర్చొపెడతాడు.
డమ్మక్క: జాగ్రత్త సుమన.
హాసిని: చెల్లి నీకు ఆత్మలు కనిపిస్తాయి కదా పెద్దబొట్టమ్మ కనిపించిందా..
నయని: తను ప్రాణాలతో ఉందని నమ్ముతున్నా అక్క.
విశాల్: అవును ఇంతకు ముందు కేక్‌లో విషం తిన్నప్పుడు కూడా పెద్ద బొట్టమ్మకు ఏం కాలేదు గుర్తుందా..
వల్లభ: అవును అవును మాకెందుకు గుర్తులేదు ఆకేక్ తినిపించింది మేమే కదా. అందరూ ప్రశ్నించడంతో కవర్ చేస్తాడు. మరో వైపు పెద్ద బొట్టమ్మ సుమన గొంతు పట్టుకొని నలిపేస్తుంది. మరోసారి సుమన హల్ చల్ చేస్తుంది.
నయని: పెద్ద బొట్టమ్మ ఎక్కడుంది సుమన..
డమ్మక్క: సుమన గుండెల్లో నిద్ర పోతుంది నయని. ఇంట్లోకి వచ్చింది దెయ్యం కాదు. సుమన ఒంట్లోకి వచ్చిన భయం. ఇక మెట్ల మీద కూడా సుమనకు పెద్ద బొట్టమ్మ కనిపిస్తుంది. పెద్ద బొట్టమ్మ చిట్టీకి మాత్రమే కనిపించడం ఏంటి అని హాసిని అనుకుంటుంది. విశాల్ అందర్ని సర్దిచెప్తాడు. అందరూ పెద్ద బొట్టమ్మ కోసం వెతుకుతారు. నయని ఓ చోట పెద్ద బొట్టమ్మని చూస్తుంది. పెద్ద బొట్టమ్మ లేదు అని నయని అబద్ధం చెప్తుంది. నయని పెద్ద బొట్టమ్మకు సైగలు చేయడం హాసిని గమనిస్తుంది.
మరోవైపు సుమన పాముగా ఉన్న ఊలూచిని దారంతో కట్టేస్తుంది. విక్రాంత్ అలా చేయడంతో సుమనకు తిడతాడు. దీంతో పెద్దబొట్టమ్మ వచ్చి ఊలూచిని తీసుకెళ్లకుండా ఇలా చేశానని అంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు.
పెద్దబొట్టమ్మ కిచెన్‌లో ఉండగా డమ్మక్క, నయని, హాసినిలు అక్కడికి వస్తారు. ఎందుకు వచ్చావని హాసిని అడుగుతుంది. దీంతో పెద్ద బొట్టమ్మ రావడం వెనుకు రెండు కారణాలు ఉన్నాయని నయని చెప్తుంది. గాయత్రీ పాపను తాను ఎత్తుకుపోలేదు అని చెప్పడానిక వచ్చిందని.. రెండోది సుమన ఎత్తుకొని ఉలూచి పాపను ముందుగా తన బిడ్డగానే గుర్తించాలి అని అంటుంది. దీంతో హాసిని పెద్దబొట్టమ్మతో గాయత్రీ పాపను నువ్వు ఎత్తుకెళ్లకపోతే ఊపిరాడని పరిస్థితిలోకి ఎందుకు వెళ్తావ్ అని ప్రశ్నిస్తుంది. దానికి సుమన ఇక్కడే లోతుగా ఆలోచించాలి హాసిని. సుమన ఒట్టు వేసినప్పుడు తాను తప్పు చేసి ఉంటే ఉలూచి పాప కన్నతల్లి చనిపోవాలి అని ఒట్టు వేస్తుంది. అంటే తను క్షేమంగా ఉండి పెద్ద బొట్టమ్మ ప్రాణాల మీదకు వచ్చేలా చేసింది అని నయని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
AlsO Read: ‘జై హనుమాన్’ అప్‌డేట్, ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!