అన్వేషించండి

Trinayani October 16th: వల్లభ ముఖాన్ని తాకిన వేడి పెనం.. పెద్దబొట్టమ్మ కోసం నయని చేస్తున్న మరో సాహసం!

మారువేషంలో ఇంట్లో పెద్ద బొట్టమ్మ అడుగుపెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Trinayani October 16th Written Update : ఈరోజు ఎపిసోడ్​లో..

నా చేత్తో చేసిన చపాతీలు అంటే మా వారికి ఎంత ఇష్టమో అనుకుంటూ చపాతి పిండితో చపాతీలను చేస్తుంది దురంధర. ఇంతలో వేగంగా మెట్లపై నుంచి నయని, హాసినిలు గాబరాగా కిందకి దిగుతూ ఉంటారు.

నయని: పిన్ని ఆ చపాతీలను కాల్చేస్తుందేమో వెంటనే వెళ్లాలి అని హాసినితో అంటుంది. వీళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ వెళ్లడాన్ని తిలోత్తమ, వల్లభలు చూస్తారు.

తిలోత్తమ: వీళ్ళిద్దరూ ఎందుకురా ఇంత గాబరాగా పరిగెడుతున్నారు?

వల్లభ: అవును మమ్మీ అసలు పిండి ఎందుకు తెచ్చిందో? అది ముద్దగా ఎలా మారిపోయిందో ? అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు.

తిలోత్తమ: కానీ ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది రా. వాళ్ల వెనకాతనే వెళ్దాము అని నయని వాళ్ళని వెంబడిస్తారు.

ఇంతలో దురంధర చపాతీని కాల్చడానికి పెనం మీద పెడుతుండగా కంగారుగా హాసిని, నయనీలు వస్తారు.

హాసిని: పిన్ని ఆగండి ఆ చపాతీలను కాల్చొద్దు. నేను చెల్లి కలిపి చేస్తాము మీకు ఎందుకు ఆ కష్టం?

దురంధర: అంటే ఏంటి నేను సరిగ్గా చపాతీలు చేయననా మీ అభిప్రాయం? నేనే చపాతీలను కాలుస్తాను.

నయని: ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే మంచిది కదా పిన్ని నేను చేస్తాను లేండి అని అంటుంది. అప్పుడే తిలోత్తమ, వల్లభలిద్దరూ అక్కడికి వస్తారు.

తిలోత్తమ: దురంధర చేస్తానంటుంది కదా ఎందుకు వద్దంటున్నారు నువ్వు చెయ్యు అని అనగా దురంధర చపాతీలను పెనం మీద పడుతుంది. వెంటనే ఆ చపాతి .. ఆ పిండి ముద్ద దగ్గరకు వెళ్లిపోయి ఆ వేడిగా ఉన్న పెనం ఎగిరి వల్లభ ముఖాన్ని తాకుతుంది.

పెనం వేడికి వల్లభ గట్టిగా అరుస్తూ ఉండగా.. అదే సమయంలో నయని వెనుక నుంచి ఆ పిండి ముద్దను తీసుకొని వెళ్ళిపోతుంది. వల్లభ అరుపులకి కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చి చేరుతారు.

వల్లభ: మమ్మీ మమ్మీ ఆ పెనం వచ్చి నన్ను కొట్టింది మమ్మీ.

తిలోత్తమ: అవును నేను చూశాను ఆ పెనమే వల్లభ మీదకి వచ్చి కొట్టింది. 

విశాల్: అసలు ఆ పెనం దగ్గరకి వెళ్లి నువ్వు ఎందుకు తలపెట్టావు బ్రో?

హాసిని: అప్పటికి చెప్తూనే ఉన్నాను విశాల్, ఆ చపాతిని కాల్చొద్దు అని కానీ అసలు వినరే.

దురంధర: అవును ఇంతకీ నయని ఏది? ఆ చపాతీ పిండి కూడా కనిపించట్లేదు.

హాసిని: చెల్లి చపాతీలు వేయడానికని ఆ పిండిని తీసుకొని వెళ్ళినట్టుందని అనగా తర్వాత ఎవరు పనులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు.

మరోవైపు నయని ఆ పిండిని తీసుకొని వచ్చి కింద పెట్టగా పెద్ద బొట్టమ్మ తన మనిషి రూపంలోకి వస్తుంది. కానీ తన ముఖం మొత్తం కాలిపోయి ఉంటుంది.

నయని: అయ్యో పెద్ద బొట్టమ్మ ముఖమంతా కాలిపోయింది అందుకే చెప్పాను సాహసాలు వద్దని.. 

పెద్ద బొట్టమ్మ: మరి నన్ను ఏం చేయమంటావు నయని.. నా కూతుర్ని చూడడం కూడా తప్పేనా అయినా? ఈ గాయం పోవాలంటే దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది. అది ఉలూచి వల్లే అవుతుంది.

నయని: మళ్లీ పెద్ద సాహసం చేయాల్సి వస్తుంది పెద్ద బొట్టమ్మ. సుమనకి తెలిస్తే పెద్ద గొడవవుతుంది. పాప రూపంలో ఉంటే తేలేము కానీ పాము రూపంలో మారితే ఏదైనా చేయగలనేమో. నువ్వు అమ్మవారు ఇచ్చిన చీరని కట్టుకొని రాత్రికి రా అప్పుడు ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు వెళ్ళు అని పెద్ద బొట్టమని పంపించేస్తుంది నయని.

ఆ తర్వాత సీన్లో తిలోత్తమ, వల్లభలు ఇద్దరు అఖండ స్వామి దగ్గరికి వస్తారు. అఖండస్వామికి జరిగిన విషయం అంతా చెప్తారు.

అఖండ స్వామి: ముగ్గు పిండిని దేవుడి గది దగ్గర లేకపోతే తులసి కోట దగ్గర ఉంచుతారా?

తిలోత్తమ: అవును, నయని విధంగా చేయడం నేను చాలాసార్లు చూశాను.

అఖండస్వామి: ఎప్పుడైతే చపాతి పిండి ఆ ముగ్గు పిండితో కలపబడుతుందో అప్పుడు దానికి శక్తులు వస్తాయి. నాకు తెలిసినంతవరకు ఇంట్లోకి ఏదో నాగుపాము వచ్చినట్టు ఉన్నది. దానిమీద ఈ రెండు కలిపి వేయగా అది ముద్దగా మారింది అని అనగా తిలోత్తమ జరిగిన సంఘటనలని అన్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటుంది.

తిలోత్తమ: అవును స్వామి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. పెద్ద బొట్టమ్మో లేకపోతే నాగయ్యో వచ్చి ఉంటారు.

అఖండస్వామి: నీ చావు.. నా చావు.. ఏ పిల్ల చేతిలో ఉన్నదో తెలుసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పాను దాని విషయం ఎంతవరకు వచ్చింది?

తిలోత్తమ: ఆ పిల్ల గాయత్రి మా గాయత్రి అక్క కాదు స్వామి ఎందుకంటే తన చేతిలో చేయి పెట్టినా మంటలు రాలేదు.

వల్లభ: ఒకవేళ చేతికి ఏమైనా చేసుంటారా?

తిలోత్తమ: నువ్వు ఆగరా ఎక్కడలేని ఎదవ సలహాలు అన్ని ఇస్తావు.

అఖండస్వామి: ఏదో తప్పు జరిగింది ముందు నుంచి ఎవరో జాగ్రత్త పడి ఉంటారు

తిలోత్తమ: పోనీలెండి స్వామి ఈ గాయత్రి అయితే మా గాయత్రి అక్క కాదు అని నిర్ధారణ అయిపోయింది. ఇంకేమైనా అనుమానంగా ఉంటే మీకు చెప్తాను ప్రస్తుతానికి వెళ్లి ఆ నయని మీద ఒక కన్నేసి ఉంచుతాము అని వళ్ళభ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిలోత్తమా.

అఖండ స్వామి: కంటి ముందు ఇంత నిజం కనబడుతున్నా కూడా తెలుసుకోలేని మూర్ఖులు మీరు అని మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత సీన్​లో హాసిని పాలు పట్టుకొని హాల్లో ఉంటుంది. పక్కనే డమ్మక్క ఉంటుంది.

హాసిని: పెద్ద బొట్టమ్మ రాడానికి ఎంత టైం పడుతుంది ఇంకా?

డమ్మక్క: అమ్మవారి చీర కట్టుకుంటున్నారు కదా మరి ఎవరికి కనిపించకుండా ఉండడానికి టైం పడతాది. 

నయని: ఇందులో ఉన్న ఒక సమస్య ఏంటంటే అమ్మవారి చీర కట్టుకుంటే పెద్ద బొట్టమ్మ అందరికీ కనిపిస్తుంది. అందుకే ఎవరు గుర్తుపట్టలేని రీతిలో చీర కట్టుకున్నది.

హాసిని: అయితే నేను పాలు పట్టుకుని ఉలూచి దగ్గరికి వెళ్తాను అని డమ్మక్కని తీసుకొని వెళ్తుంది హాసిని.

మరోవైపు పెద్ద బొట్టమ్మ అమ్మవారి చీరని గుజరాతి స్టైల్ లో కట్టుకొని ముఖాన్ని కప్పుకుంటుంది. అప్పుడు కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు. అక్కడున్న వాళ్ళందరూ ఎవరు ఈవిడ అని పెద్ద బొట్టమ్మ గురించి అడుగుతారు.

నయని: ఈవిడ పేరు నాగలక్ష్మి మన పక్క సందులో ఉంటుంది.- ఈవిడ కూతురు పెద్దమనిషి అయిందని పేరంటకానికి మన అందరిని పిలవడానికి వచ్చింది.

వల్లభ: నాగలక్ష్మి అంట. చాలా మంచి పేరు పెట్టుకున్నారు మా ఇంటి చుట్టు నాగుపాములే తెల్సా?

విక్రాంత్: ఇప్పుడు మన ఇంటి విషయాలు బయటకు చెప్పడం అవసరమా బ్రో?

సుమన: అయినా మీరు ఎందుకు ముఖాన్ని దాచుకుంటున్నారు.

పెద్ద బొట్టమ్మ: మేము గుజరాతి వాళ్ళము. ఇల్లు దాటితే ముఖాన్ని పరాయి వాళ్లకి ఎవరికీ చూపించము.

తిలోత్తమ: ఇంతకీ హాసిని ఏది?

నయని: నాగలక్ష్మికి వాయనం తేవడానికి పైకి వెళ్ళింది అని అంటుంది. మరోవైపు హాసిని, డమ్మక్క ఆ పాలు పట్టుకొని సుమన గదిలోకి వెళ్తారు.

ఆ పాలని నేల మీద పెట్టగా అక్కడికి ఉలూచి వస్తుంది.

హాసిని: అమ్మ.. నీ అమ్మ అయిన పెద్ద బొట్టమ్మకి గాయం జరిగింది. నువ్వు మాత్రమే ఆ గాయాన్ని నయం చేయగలవు. దయచేసి ఈ చీరలోకి రా అని అక్కడ ఒక చీరని పెడుతుంది హాసిని.

డమ్మక్క: ఈ విషయం పాపకి తెలుసు. ఒక పాము ప్రమాదంలో ఉంటే ఇంకొక పాము ఆ విషయాన్ని పసిగడుతుంది అని అనగా ఉలూచి ఆ చీరలోకి వెళ్తుంది.

డమక్క: ఇప్పుడు ఆ చీరని పెద్ద బొట్టమ్మకి వాయినం ఇద్దాము. దాన్ని కళ్ళకు అద్దుకున్న పెద్ద బొట్టమ్మ ఉలూచి చేత మందు తీసుకుంటుంది. అప్పుడు నయమవుతుంది.

హాసిని: ఇప్పటివరకు లాగాము, ఇంకొక పది నిమిషాలు ఇలాగే సాగితే చాలు చిట్టికి తెలియకుండా పనైపోతే బాగున్ను అని ఆ చీరని పట్టుకొని కిందకి వెళ్తుంది హాసిని.

హాసిని: ఇదిగో నాగలక్ష్మి నీకు వాయనం తెచ్చాము.

తిలోత్తమ: ఈవిడ నీకు ముందే తెలుసా?

హాసిని: హా చాలాసార్లు చూశాను.

సుమన: బయటికి వెళ్తే ముఖం దాచేసుకుంటుంది అన్నారు? మరి నువ్వు ఎలా చూసావ్ అక్క అని హాసినిని అడుగుతుంది సుమన. అప్పుడు హాసిని తెల్ల మొఖం పెడుతుంది.

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
Embed widget