Trinayani July 24th: ‘త్రినయని’ సీరియల్: సుమనకు రూ.10 లక్షల చెక్ ఇచ్చిన తిలోత్తమా, షాకింగ్ విషయాన్ని మోసుకొచ్చిన వల్లభ?
తిలోత్తమా సుమన సీమంతం కోసం పది లక్షలు చెక్ ఇవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani july 24th: విశాల్ ఎద్దులయ్యకు థాంక్స్ చెబుతాడు. నయని కూడా ఎద్దులయ్యను కృతజ్ఞత కోరుతుంది. ఇక విశాల్ తన మనసులో థాంక్స్ చెప్పింది సుమన కోసం కాదు.. గాయత్రి వల్ల కుబుసం వస్తుంది అంటే అమ్మకు అనుమానం వస్తుంది కాబట్టి ఇద్దరు పిల్లలచే తీయించేలా చేశాడు ఎద్దులయ్యా అని అనుకుంటాడు.
సుమన రేపే తన సీమంతం చేయించమని అంటుంది. ఇంట్లో వాళ్ళు ఇష్టం లేనట్లే మాట్లాడుతూ ఉంటారు. వెంటనే హాసిని 9 నెలలు పడ్డాయి జాగ్రత్తగా ఉండు అనటంతో.. అవునని నాగపంచమి రోజే తన డెలివరీ అవుతుంది అని చెప్పటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అకుబుసం తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్తుంది.
ఆ తర్వాత తిలోత్తమా సుమనను పిలిచి రూ.10 లక్షల చెక్ ఇస్తుంది. అది చూసి సంతోషంలో మునిగిపోతుంది సుమన. అంతేకాకుండా తిలోత్తమా ని తెగ పొగిడేస్తూ ఉంటుంది. వెంటనే వల్లభ ఏ రోజు కూడా మా అమ్మను నయని వదిన పొగుడలేదు అని అనటంతో తను అసలు పొగుడుతుందా అని వెటకారంగా మాట్లాడుతుంది సుమన.
అంతేకాదు మా మమ్మీ నయని వదినకు, హాసినికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అనటంతో.. మరి నాకెందుకు ఇచ్చారు అని అడుగుతుంది. దాంతో తిలోత్తమా తనను పొంగించడానికి రెండు మూడు డైలాగులు పడుతుంది. ఆ మాటలకు సుమన ఫిదా అవుతుంది. తను బయటికి వెళ్లి డబ్బులు తీసుకురాలేను అని అనటంతో వెంటనే తిలోత్తమా వల్లభను బ్యాంకుకు వెళ్ళమని అంటుంది.
ఇక సుమన అక్కడ నుంచి వెళ్లిన వెంటనే ఎందుకు మమ్మీ సుమనకు అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అడగటంతో.. తన పుట్టబోయే బిడ్డనుండే ఆస్తులు వస్తాయి కాబట్టి.. అవి మన సొంతం చేసుకోవడానికి ఇటువంటి ప్లాన్స్ అని అంటుంది. ఆ తర్వాత సుమన వల్లభ కోసం డోర్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హాసిని ఎవరికోసం చూస్తున్నావు అంటే మీ ఆయన కోసం అని అనటంతో వెంటనే హాసిని మా ఆయన కోసం ఎదురు చూస్తున్నావా అంటూ పెద్ద గొడవ చేస్తుంది.
అందరూ హాల్లోకి వచ్చి ఏం జరిగింది అని అడగటంతో వెంటనే హాసిని చూశారా తను మా ఆయన కోసం ఎదురు చూస్తుందట అని అంటుంది. దాంతో అందరూ అపార్థం చేసుకున్నారేమో అని అనటంతో.. వెంటనే సుమన బావ గారిని ఒక పని మీద బయటకి పంపించాను అని అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు ఏంటది అని అడగటంతో సీమంతం కోసం తిలోత్తమా తనకిచ్చిన చెక్ గురించి చెబుతుంది.
దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక తన అత్తయ్య చాలా మంచిది అంటూ తన అత్తను తెగ పొగుడుతూ ఉంటుంది సుమన. దాంతో తిలోత్తమా తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే వల్లభ వచ్చి చెక్ పనిచేయలేదు అనటంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే విశాల్ గాయత్రి పాప గురించి అనుమానం వస్తుందేమో అని భయపడతాడు.
ఇక సుమనతో ఆ సీమంతం డబ్బులు నేను ఇస్తానులే అని అంటాడు. అవన్నీ కాదు అసలు చెక్ ఎందుకు పని చేయలేదు అని అడుగుతుంది సుమన. వెంటనే వల్లభ ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ అయింది అని అలా చేయించింది గాయత్రి పెద్దమ్మ అనటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు. వెంటనే నయని అత్తయ్య గారు రావటం ఏంటి.. అసలు అలా ఎలా వచ్చారు అని అనడంతో విశాల్ కాస్త భయపడుతూ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇక తిలోత్తమా కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
also read it : Rangula Ratnam July 22th: అర్చననే తన భార్య అని తెలుసుకున్న శంకర్ ప్రసాద్.. భర్తకు దగ్గర కానని చనిపోవడానికి నిర్ణయించుకున్న పూర్ణ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial