By: ABP Desam | Updated at : 02 Aug 2023 10:21 AM (IST)
Image credit: Zee5
Trinayani August 2nd: వల్లభ హ్యాండ్సమ్ గా రెడీ అవ్వగా తిలోత్తమా కూడా అందంగా రెడీ అవుతూ నేను ఎలా ఉన్నాను అని ఒకరికొకరు అడుగుకుంటారు. ఇక తిలోత్తమా హీరోయిన్ కి తల్లిగా ఉందని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విక్రాంత్ వచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. మీరేంటి ఇలా తయారయ్యారు అని అడుగుతాడు. ఇక తన అన్నయ్య వల్లభను అచ్చం ఐస్ క్రీమ్ అమ్మే వాడిలాగా ఉన్నాడు అంటూ గోరంగా అవమానిస్తాడు.
దానితో వల్లభ కి కోపం వచ్చి బిజినెస్ పని మీద వెళ్తుంటే ఇలా అంటావేంటి అని కసురుకుంటాడు. ఇక విశాలాక్షి మాటలు వింటే మంచి జరుగుతుంది కదా అని అనటంతో తను చిన్నపిల్ల అంటూ వెటకారం చేసి మాట్లాడుతారు. మరోవైపు విశాలాక్షి ధ్యానంలో ఉండగా సుమన అక్కడికి వస్తుంది. అక్కడే ఉన్న ఎద్దులయ్య విశాలాక్షిని డిస్టర్బ్ చేయొద్దని తను ధ్యానంలో ఉందని అనటంతో వెంటనే సుమన్ బాగా తిని నిద్రపోతుంది అని వెటకారం చేస్తుంది.
ఇక అందరూ అక్కడికి చేరుకోగా వెంటనే విశాలాక్షి కళ్ళు తెరిచి తనను అవమానించిన వాళ్లను చూడటానికి కళ్ళు తెరిచాను అని అంటుంది. ఎవరు అని అనటంతో వెంటనే విక్రాంత్ ఇంకెవరు ఉంటారు సుమన అని అంటాడు. వెంటనే సుమనకు కోపం వస్తుంది. నయని మాత్రం అత్తయ్య, బావ గారు ప్రసాదం విషయంలో అలా చేశారు కాబట్టి వాళ్ల గురించి మాట్లాడుతుందేమో అని.. వాళ్ళని వెళ్లి పిలుచుకొని వస్తాను అని అంటుంది నయని.
కానీ వాళ్లే కిందికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ ముష్టి వాళ్ళ గెటప్ లో ఉండటంతో అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక దురంధర మాత్రం తిలోత్తమాను ముష్టిది అంటూ ఘోరంగా అవమానిస్తూ తిడుతూ ఉంటుంది. దాంతో తిలోత్తమా దురంధరపై బాగా ఫైర్ అవుతుంది. మమ్మల్ని ముష్టివాళ్లు అంటున్నావ్ ఏంటి అంటూ కోపడుతుంది. ఇక ఎద్దులయ్య వారిద్దరు ఒకరినొకరు చూసుకుంటే వాళ్లకు అలా కనిపించరు అని అనగా విశాలాక్షి అద్దంలో వారిని చూపించమని నయని కి చెబుతుంది.
ఇక నయని అద్దం తీసుకొచ్చి వారిద్దరికి చూపించడంతో మొదట తిలోత్తమా తన ముఖం తను చూసి ఎవరో ముష్టి దాని ఫోటో చూపిస్తున్నావు అంటూ తనను తాను అవమానించుకుంటుంది. ఆ తర్వాత అందరూ చెప్పగా మళ్లీ క్లియర్గా చూడటంతో అది తనే అని తెలుసుకొని భయపడిపోతుంది. గట్టిగా అరుస్తుంది. వల్లభ కూడా తన అవతారని చూసి వెంటనే పక్కకు వెళ్లి దాచుకుంటాడు.
వెంటనే ఎద్దులయ్య అమ్మవారి ప్రసాదం తీసుకొని వస్తే తీసుకోకుండా కింద పడేసి అవమానించారు. అంతేకాకుండా బిక్షం వేసుకునే దానిలాగా ఉంది అవమానించారు కాబట్టి మీకే ఆ గతి పట్టింది అని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు పరిహారం అడగడంతో విశాలాక్షి వెంటనే తిలోత్తమాకు, వల్లభాకు మూడుసార్లు భవతీ బిక్షం దేవి అనమని అంటుంది. ఆ మాట అసలు అనను అని తన పరువు పోతుంది అని తిలోత్తమా అంటుంది.
ఆ మాట అనకపోతే మీరు మరింత ఇబ్బంది పడవలసి వస్తుంది అని విశాలాక్షి అన్న కూడా వినకుండా పైకి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు కంగారు పడటంతో వాళ్లే తిరిగి వెనక్కి వస్తారు అని విశాలాక్షి అంటుంది. ఇక పైకి వెళ్లిన తల్లి కొడుకులిద్దరూ ఇలా జరిగిందేంటి అని చర్చ చేసుకుంటూ ఉంటారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Brahmamudi September 29th: మైఖేల్ బెండు తీసిన కనకం- ఇంటికి తిరిగొచ్చిన స్వప్న, రాహుల్ మైండ్ బ్లాక్!
Guppedanta Manasu September 29th: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>