Trinayani September 30th: విశాలక్షిని ఇంటి నుంచి తరిమేసిన సుమన - నయని, విశాల్ లకు ప్రాణగండం ఉందా!
నయని,విశాల్ లకు ప్రాణగండం ఉందని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani September 30th Written Update: నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నా పాప నా ఇంట్లోకి వచ్చేవరకు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని సుమన విశాలాక్షితో అంటుంది.
నయని: ఆగు చెల్లి విశాలాక్షిని ఏమనకు
విశాలాక్షి: పర్వాలేదు అమ్మ నేను బయలుదేరుతాను శ్రీశైలం వెళ్లాల్సిన సమయం వచ్చింది.
సుమన: నువ్వు శ్రీశైలం వెళ్తావో కాశీకి వెళ్తావో నీ ఇష్టం ముందు ఇక్కడి నుంచి బయలుదేరు అని గెంటేయపోతుండగా
నయని: తనంతట తానే వెళ్తానీ అంటుంది కదా బలవంతంగా నెట్టేయడం ఎందుకు చెల్లి?
సుమన: నా కడుపు మంట మీకేం తెలుసు అక్క అని విశాలాక్షిని ఇంటి నుంచి బయటకు నెట్టేస్తుంది.
విశాలాక్షి: వెళ్లే ముందు అమ్మానాన్నలకు చిన్న మాట చెప్పాలి. ఈ రెండు రోజులు గడప దాటి బయటికి వెళ్లొద్దు మీ ఇద్దరికీ ప్రాణ గండం ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విశాలాక్షి.
పెద్ద బొట్టమ్మ: ఈ పూట నేను ఎవరికీ కనిపించను వినిపించను అని అమ్మ చెప్పింది. లేకపోతే ఇక్కడే నిజాన్ని అందరి ముందు బయటపెట్టిద్దును. సాక్షాత్తు విశాలాక్షి అమ్మనే బయటకు నెట్టేశారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తన్ని ముట్టుకునే భాగ్యమైనా దక్కింది మీకు. పాపమని జాలిపడి ఏం చేయకుండా వెళ్లిపోయింది అమ్మ లేకపోతే కంటి చూపుతో నైనా మిమ్మల్ని మాడ్చేసేది అని కోపంగా ఏడుస్తుంది.
ఆ తర్వాత సీన్ లో నయనీ, విక్రాంత్, విశాల్ లు మాట్లాడుకుంటూ ఉంటారు.
నయని: మీ ఫైల్స్ అన్ని దాచి పెట్టేసాను బాబు గారు మళ్ళీ మీరు అర్జెంట్ మీటింగ్ అని గడప దాటితే ప్రాణాలకు ప్రమాదం. రెండు రోజులు వరకు ఏవి ఇవ్వను.
అనుకి పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చిన మాన్సీ - నిజం తెలుసుకుని షాక్ లో అను!
విశాల్: ఉలూచిని దాచినట్టే వాటిని కూడా దాచేసావా?
విక్రాంత్: ఏంటి బ్రో వదిననే అనుమానిస్తున్నావా?
విశాల్: లేదు నేను ఆ విధంగా అనలేదు. ఒకవేళ పాపకి ఏమైనా అయితే నీకు ముందే తెలుస్తుంది కదా అందుకే ప్రాణగండం ఉందని ఏమైనా దాచావా అని అడుగుతున్నాను
నయని: లేదు బాబు గారు పాపకి ప్రాణగండం ఉన్నట్టు నాకు ఏమీ తెలియలేదు పాప సురక్షితంగానే ఉంది. కానీ ఎక్కడుందో తెలియట్లేదు.
విక్రాంత్: పెద్ద బొట్టెమ్మ పాపని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తను పాముగా మారి తన వెనుక వెళ్ళుంటుంది. ఇంతలో దారి తప్పి ఉంటాది. ఇంత పెద్ద ట్రాఫిక్ లో మనుషులే దారి తప్పుతున్నారు ఆ పాము చిదిగిపోయి ఉంటుందా
నయని: లేదు విక్రాంత్ బాబు మీరు అలాగనోద్దు కలలో కూడా పసివాళ్ళ మీద అలాంటి ఆలోచనలు రాకూడదు. వాళ్లకి నిండు ఆయుష్య తో ఉండాలని కోరుకోవాలి.
ALso Read: మహేంద్ర బాహుబలి రేంజ్ లో జగతికి మాటిచ్చిన రిషి - ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్సవకండి!
విశాల్: ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నదని అంటున్నాడు. అయినా ప్రమాదం జరిగితే నీకు తెలుస్తుంది కదా అయితే ప్రమాదం జరగలేనట్టే అంటే పాప ఎక్కడో దగ్గర క్షేమంగానే ఉండి ఉంటుంది. దేనికైనా కొంచెం సమయం కావాలి వెళ్లి సుమనకి కొంచెం ఓర్పుగా ఉండమని చెప్పు అని విక్రమ్ తో అంటాడు విశాల్.
ఆ తర్వాత సీన్లో వల్లభ తన గదిలోకి వచ్చి నవ్వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తిలోత్తమ లోపలికి వచ్చి తలుపు గెడపెడుతుంది.
తిలోత్తమ: అందరూ బయట పాప కనిపించట్లేదని బాధగా ఉంటే నువ్వు అప్పుడు ఏంట్రా ఇలా నవ్వుతున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు.
వల్లభ: పాప గురించి ఒకళ్ళ మీద ఒకరు నిందలు వేసుకుని పడుతుంటే భలే ఉంది మమ్మీ. అయినా పాప వాళ్లకి ఎంతకీ దొరకదు అఖండ స్వామి చెప్పినట్టే పాపని తీసుకొచ్చేసాము అని గతంలో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటారు.
ముందు రోజు రాత్రి తిలోత్తమ, వల్లభలు ఉలూచి దగ్గరకు వెళ్తారు. అఖండ స్వామి ఇచ్చిన విభూదిని తీసుకొని వచ్చి పాము మీద వేయగా పాము స్పృహ తప్పి పడిపోయినట్టు ఉంటుంది. అప్పుడు ఆ పాముని తన చీరలో దాచుకొని తిలోత్తమ వల్లభ నీ తీసుకొని బయటకు వచ్చేసి ఆ పాముని దాచేస్తుంది.
తిలోత్తమ: అఖండ స్వామి చెప్పినట్టు నయని వాళ్లకు ప్రాణగండం ఉంది అలాగే శివ భక్తురాలు అయిన విశాలాక్షి కూడా అదే చెప్పింది. ఒకవేళ పాపని వెతుక్కుంటూ వీళ్ళు గడప దాటితే వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం అని నవ్వుకుంటారు ఇద్దరు.
ఆ తర్వాత సీన్లో విశాల్, సుమన దగ్గరికి వస్తాడు.
విశాల్: నన్ను ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు సుమన?
సుమన: లోపలికి రండి బావ గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి
విశాల్: ఏదైనా మాట్లాడాలంటే హాల్లో కాని గార్డెన్లోని కానీ మాట్లాడుకుందాము. గదిలో వద్దు అని అనగా ఇంతలో విక్రాంత్ కూడా అక్కడికి వస్తాడు.
విక్రాంత్: అది మా బ్రో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం. నేను ఇక్కడే ఉంటాను కాని ఇప్పుడు విషయం ఏంటో చెప్పు.
సుమన: మీరు నా కోసం నా కూతురి కోసం పది కోట్లు ఇచ్చి మాకు సహాయం చేశారు. కానీ మీ భార్య మాత్రం నాకు 10 కోట్లు రాకూడదని కుళ్ళుతో నా పాపను దాచేసింది.
విక్రాంత్: అసలేం మాట్లాడుతున్నావే నువ్వు?
సుమన: అయితే పాపని తీసుకుని వచ్చి నేను తప్పు అని నిరూపించండి చూద్దాం. అక్క తప్పు చేస్తుంది దాని వెనకాతలు మీరిద్దరూ తనకి సపోర్ట్ గా ఉంటున్నారు అని అంటుంది. అప్పుడు కోపంతో విక్రాంత్ తన మెడ పట్టుకుంటాడు.
విశాల్: తనని వదలరా. చూడమ్మా ఉలూచిని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నాది. అప్పటివరకు ఓర్పుగా ఉండు అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత సీన్లో నయని, విషాల్ లు అందరూ ఫోన్లో ఎవరెవరికో ఫోన్ చేసి పాప గురించి ఆరా తీస్తారు.
విశాల్: ఇప్పుడే పోలీసులకు కూడా ఫోన్ చేశాను ఎవరు పాప దొరికిందని కంప్లైంట్ ఇవ్వలేదట కనుక ప్రాసెస్ చాలా లేట్ అవుతుందట.
తిలోత్తమ: ఈ లోపల కిడ్నాకర్స్ పాపం ఏమైనా చేస్తే?
సుమన: పాపను ఎవరు కిడ్నాప్ చేయలేదు పెద్ద బొట్టమే తీసింది.
దురంధర: మళ్లీ మొదటికి వచ్చావ్ ఏంటి సుమ్మీ. పెద్ద బొట్టమ్మ పాపని ఎందుకు తీస్తాది? మీరేమీ సకం పాప నీది సగం పాప నాది అని వాటాలు వేసుకోలేదు కదా.
ఎద్దులయ్య: లోపల ఉన్న వాటిని బయటకు పంపి బయట ఉన్న వాటిని లోపలికి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు.
పవనుమూర్తి: నువ్వు ఉండయ్యా సమయం సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడుతావు
ఎద్దులయ్య: కాదా అమ్మగారు మీరే చెప్పండి అని తిలోత్తమతో అంటాడు.
తిలోత్తమా: ఇక్కడ అసలికే పాప కనబడక అందరూ కంగారులో ఉన్నారు. నువ్వు ఇలాంటి అనుమానాలు పెట్టి ఉన్న బంధాలను కూడా తెంచకు.
ఎద్దులయ్య: విశాలాక్షి మాటకోసం ఎదురు చూస్తాను అప్పటివరకు నేనేమనను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial