సుమ షోలో వైష్ణవికి ప్రపోజ్ చేసిన ఆనంద్ దేవరకొండ - ఆ పిల్ల జోలికి రావొద్దంటూ వార్నింగ్
సుమ కనకాల హోస్ట్గా వ్యవహరిస్తున్న 'సుమ అడ్డా' షోకి 'బేబీ' మూవీ టీం హాజరైంది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.
బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా తెచ్చుకున్న సుమా కనకాల ప్రస్తుతం ఈటీవీలో 'సుమ అడ్డా' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతివారం ఈ షోలో సెలబ్రిటీ గెస్ట్ లతో సుమ తెగ సందడి చేస్తుంటుంది. పంచులు, ప్రాసలు, తనదైన డైలాగులు వేస్తూ ఈ షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇప్పటికే ఈ షో ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ ని అందుకుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి షోల తర్వాత అంతటి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది సుమ అడ్డా. ఈ క్రమంలోనే తాజాగా ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' మూవీ టీం తాజాగా సుమ అడ్డా షోకి హాజరయ్యారు. ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగే సుమ తనదైన పంచులు డైలాగ్స్ తో ఆకట్టుకుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మూవీ జూలై 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం నుంచి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, లిరీశా సుమ అడ్డా షో లో సందడి చేశారు చేశారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోని పరిశీలిస్తే.. ఇందులో సుమతో కలిసి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పుష్ప సినిమాలోని 'సామి సామి' అనే సాంగ్ కి డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'పుష్ప' మూవీ స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ లో భాగంగా సుమ, ఏందమ్మి ఆ అబ్బాయి నిన్నే చూస్తా ఉండాడు? అని వైష్ణవితో అనగానే.. వైష్ణవి, 'ఏంది సామి పులుపు ఎక్కి పోతాండవంట?' అని చెబుతుంది. అప్పుడు ఆనంద్ దేవరకొండ, 'బాగుండావు కదా' అంటూ చిత్తూరు యాసలో డైలాగ్ చెప్తూ ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత.. వైష్ణవి 'నచ్చినానా నీకు?' అని చెప్తుండగా మధ్యలో సుమ కలుగజేసుకొని 'ఏంటమ్మి? ఇంట్లో అమ్మకు తెలిస్తే ఏంటి నువ్వు పదా.. ఇంతకీ ఎవరతను?' అని సుమ అడగ్గా.. వైష్ణవి, 'సామి' అని చెప్తుంది. 'సామి అయితే గుడిలో ఉండాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు' అంటూ సుమ తనదైన పంచ్ వేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' మూవీ స్పూఫ్ చేశారు. ఇందులో ఆనంద్ దేవరకొండ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ని ఇమిటేట్ చేస్తూ.? 'ఎక్స్ క్యూజ్ మీ మేడం' అని సుమను అడగ్గానే, 'నాట్ ఎక్స్క్యూజ్? అవుట్ ఆఫ్ మై క్లాస్' అంటూ పంచ్ వేస్తుంది. తర్వాత ఆనంద్.. 'ఈ క్లాసులో ఒక అమ్మాయి రెడ్ కలర్ చున్నీ వేసుకొని ఉంది. ఆ పిల్ల జోలికి ఎవరైనా వెళ్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు' అనే డైలాగ్ చెబుతాడు.
దాంతో సుమ, 'ఏంటి నన్ను ప్రేమిస్తున్నావా? అని చెప్పగానే షోలో నవ్వులు విరిసాయి. 'అయినా నీకు కలర్ బ్లైండా? ఇది పింక్ కలర్. ఏవైనా ఉంటే బయట చూసుకుందాం. స్టూడెంట్స్ మధ్య వద్దు' అంటూ సుమ తననైన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఇక ప్రోమో చివర్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య 'బొమ్మరిల్లు' మూవీ స్పూఫ్ చేశారు. చివర్లో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్యని 'ఐ లవ్ యు' చెప్తూ ప్రపోజ్ చేయడం ఆకట్టుకుంది. అలా ఈ ప్రోమో అంతా ఎంతో సరదాగా సాగింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. కాగా వచ్చే శనివారం రాత్రి 9: 30 గంటలకు ఈటీవీ లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Also Read : తెలుగులోకి అర్జున్ దాస్ తమిళ సినిమా - లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ గురూ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial