Krishnamma kalipindi iddarini July 28th: సునందను గట్టిగా నిలదీసిన గౌరీ.. ఈశ్వర్ కు ఆదిత్య ప్రేమ గురించి నిజం చెప్పేసిన సౌదామిని?
సౌదామిని ఆదిత్య, అమృతల ప్రేమ గురించి ఈశ్వర్ కు చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini July 28th: గౌరీ తన అత్తను పక్కకు తీసుకెళ్లి కంగారుపడుతూ కనిపిస్తుంది. ఏం జరిగింది ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని సునంద ప్రశ్నించడంతో.. అమృత అని అంటుంది గౌరీ. దానితో షాక్ అవుతుంది సునంద. ఈ సమయంలో ఆ అమ్మాయి గురించి ఎందుకు అని కంగారుపడుతూ మాట్లాడుతుంది సునంద. ఏదైనా ఉంటే వ్రతం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది.
కొన్ని నిజాలు తనను వెంటాడుతున్నాయని. ఆ నిజాలతో నేను వ్రతంలో కూర్చోలేను అని అంటుంది. దాంతో సునంద ఏంటా నిజాలు అనడంతో ఇప్పుడే వస్తాను అని గౌరీ తన గదిలోకి వెళ్లి గ్రీటింగ్ కార్డ్, ఫోటో తీసుకుని వస్తుంది. ఇక సునంద అమృత గురించి ఎందుకు అడుగుతుంది ఏదైనా సాక్షాలు ఉన్నాయా అని టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.
ఇక గౌరీ ఆ సాక్ష్యాలు చూపించడంతో షాక్ అవుతుంది సునంద. దాంతో అదంతా నిజం కాదని ఆమె డబ్బు కోసం అలా ఆదిత్యను మోసం చేసింది అంటూ చెబుతుంది సునంద. కానీ గౌరీ మాత్రం అస్సలు నమ్మదు. తను నిజంగా మోసం చేసింది అయితే ఎంగేజ్మెంట్ రోజు అందరి ముందు వచ్చి గట్టిగా నిలదీయకుండా ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్తుంది అని.. అసలు తను రాగానే మండపం నుండి ఆదిత్య కూడా ఎందుకు బయటకు వెళ్ళాడు అని తనలో ఉన్న అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో అడుగుతుంది గౌరీ.
అసలు అఖిలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని గట్టిగా నిలదీస్తుంది. నిజం చెప్పకపోతే తన మీద ఒట్టు అని గౌరీ అనడంతో సునంద ఏమి చేయలేక నిజం చెబుతుంది. మీ పెళ్లి జరగాలి అంటే ఆదిత్య, అఖిల పెళ్లి జరగాలి అని మీ అమ్మ కండిషన్ పెట్టింది అనటంతో గౌరీ షాక్ అవుతుంది. దాంతో నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని.. లేదంటే ఈశ్వర్ టెన్షన్ పడతాడు అని దాంతో తన ప్రాణాలకే ప్రమాదం అని.. అందుకే ఆదిత్య తన ప్రేమ గురించి నాకు చెప్పకుండా తన ప్రేమను త్యాగం చేశాడు అని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని బ్రతిమాలుతుంది సునంద.
ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు సౌదామిని, ఉజ్వల వింటారు. ఇక గౌరీ అక్కడి నుంచి బాధపడుతున్న గదిలోకి వెళ్లి ఎటువంటి దాపరికలు ఉండకూడదన్న తమ మధ్య దాపరికాలు ఉంటున్నాయని ఈశ్వర్ ని తలుచుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఈశ్వర్ గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సునంద అక్కడికి వచ్చి ఈశ్వర్ కి ఆదిత్య, అమృతల ప్రేమ గురించి చెబుతుంది.
మొదట ఈశ్వర్ అవన్నీ నిజం కాదు వాళ్ళిద్దరికీ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పగా.. సౌదామిని మాత్రం అవన్నీ నిజమే అని.. ఆదిత్య అమృతతో మాట్లాడిన మాటలన్ని విన్నాను అని.. కావాలంటే ఆదిత్యను నువ్వే అడుగు అని.. నీ మీద ప్రమాణం చేయించుకుని అడుగుతే ఆదిత్య నిజం చెబుతాడు అని అంటుంది. దాంతో ఈశ్వర్ ఆలోచనలో పడుతున్నట్లు కనిపిస్తాడు.
also read it : Madhuranagarilo July 27th: భర్తకు దగ్గర అవ్వాలనుకుంటున్న శిరోజా.. రాధ మెడలో పండు ముందు తాళి కట్టిన శ్యామ్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial