Madhuranagarilo July 14th: ‘మధురానగరిలో’ సీరియల్ : గన్నవరంకు మాయమాటలు చెప్పి చితక్కొట్టించిన గోపాల్.. మొత్తానికి రాధని ప్రపోజ్ చేసిన శ్యామ్?
మందు పేరుతో గన్నవరంకు గోపాల్ మాయ మాటలు చెప్పి వాసంతితో కొట్టించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 14th: గోపాల్ గన్నవరం కు తను తెచ్చిన మందు తాగితే తాగిన వాళ్ళు ఎవరు కనిపించరు అని మాయ మాటలు చెప్పి మందు తాపిస్తాడు. గన్నవరం తనను తన భార్య చాలా బాధలు పెడుతుంది అని.. ఇప్పుడు వెళ్లిన తనకు కనిపించను కాబట్టి నగలు అన్ని దొంగలిస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. అయితే ఇదంతా పగ తీర్చుకోవడానికి గోపాల్ చేసిన ప్లాన్.
మరోవైపు శ్యామ్ తన ఫ్రెండ్ కిరణ్ ను కలుస్తాడు. ఇక తను రాధని వెరైటీగా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను అనేటంత మొదట కిరణ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత వెరైటీగా ఏంటి రా అనటంతో.. ఐ లవ్ యు రాధ అని రాయించిన బియ్యపు గింజ తీసి చూపిస్తాడు. అందులో ఏముంది చదువు అని అంటాడు. దాంతో కిరణ్ తనకు కనిపియ్యటం లేదు అని అనడంతో శ్యామ్ భూతద్దం చూపిస్తాడు.
అందులో ఐ లవ్ యు రాధ ఉందని కిరణ్ చెబుతాడు. ఇప్పుడే వెళ్లి రాధకు ఇది చూపిస్తే తనకు నేను ప్రేమిస్తున్నానని అర్థమవుతుంది అని అంటాడు. మరోవైపు గన్నవరం ఫుల్లుగా తాగి ఇంట్లోకి వస్తాడు. ఇక వాసంతి అక్కడే కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. వాసంతి దగ్గరికి వెళ్లి తను వాసంతికి కనిపించనన్న ఉద్దేశంతో నోటికొచ్చింది వాగి బెడ్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో వాసంతిఈయన లోపలికి వెళ్తున్నాడు ఏంటి అని అనుమానం పడుతుంది.
ఇక గన్నవరం లోపలికి వెళ్లి వాసంతి నగలు తీసుకుంటాడు. ఇక బయటికి వచ్చి మళ్లీ కొన్ని మాటలు మాట్లాడి వెళ్తుండగా వెంటనే వాసంతి పట్టుకుంటుంది. అప్పుడే గోపాల్ కూడా వస్తాడు. ఏంటి నేను మీకు కనిపిస్తున్నానా అని గన్నవరం షాక్ అవుతాడు. ఆ తర్వాత వాసంతి బాగా చితక్కొడుతుంది. మరోవైపు రాధ వంట చేస్తూ ఉండగా శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి వంట గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.
దాంతో రాధ వెటకారంగా సమాధానం ఇస్తుంది. ఇక తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అని అంటుంటారు కానీ.. ఈ బియ్యం మీద నీ పేరు ఉంది అని రాధకు తను ఐ లవ్ యూ అని రాయించాడేమో అని అనుమానం వస్తుంది. చూడు ఇందులో నీ పేరు ఉందని శ్యామ్ అనడంతో వెంటనే రాధ ఆ బియ్యపు గింజను తీసుకొని ఉడుకుతున్న అన్నంలో వేస్తుంది.
వెంటనే శ్యామ్ అందులో చెయ్యి పెట్టి తీస్తుండగా చెయ్యి కాలుతుంది. దాంతో రాధ వెంటనే చేతికి కాపురం పెడుతుంది. అప్పుడే పండు వచ్చి ఏం జరిగింది అని అనటంతో అన్నము ఉడికిందా లేదా చూడబోతుంటే చెయ్యి కాలింది అని అంటాడు. అన్నముడికిందంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అని అమ్మ చెప్పింది.. మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు అని పండు మాట్లాడుతూ ఉంటాడు. ఇక శ్యామ్ అక్కడనుండి వెళ్తాడు.
మరోవైపు గన్నవరం డబ్బులు సంపాదించుకోవడానికి మారువేషంలో పాత బట్టలకు స్టీల్ గిన్నెల బిజినెస్ చేస్తూ ఉంటాడు. అది గోపాల్ గుర్తుపడతాడు. గోపాల్ తనకు అసిస్టెంట్ గా ఉంటాడు. ఇక జరిగిన విషయం శ్యామ్ కిరణ్ కి చెప్పటంతో కిరణ్ వెటకారం చేస్తూ నవ్వుతాడు. తర్వాయి భాగంలో రాధ దగ్గరకు వెంట వెంటనే ఐదుగురు అమ్మాయిలు వచ్చి రోజా పువ్వుతో ప్రపోజ్ చేసి వెళ్తారు.
ఆ అమ్మాయిలను చూసేసరికి వెనుకాల శ్యామ్ అని రాసి ఉంటుంది. రాధ అది చూసి ఆశ్చర్య పోతుంది. శ్యామ్ అక్కడికి వచ్చి రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. మొత్తానికి శ్యామ్ కు నేరుగా ప్రపోజ్ చేయడానికి ఇప్పుడు కుదిరింది.
Also Read:
Join Us on Telegram: https://t.me/abpdesamofficial