అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 30th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిరణ్‌తో రేవతి పెళ్లి జరగనివ్వమన్న మహాలక్ష్మీ.. ఎదురు తిరిగిన సీత!

Seethe Ramudi Katnam Today Episode రేవతి కిరణ్‌లు తమ మొదటి పెళ్లి శుభలేఖని మహాలక్ష్మీ వాళ్లకి ఇవ్వడం పెళ్లి జరగనివ్వమని వాళ్లు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి టీచర్‌నే సుమతి అని మహాలక్ష్మీ పిన్ని ఆలోచిస్తుందంటే అర్థముంది నువ్వు కూడా ఎందుకు సీత అలానే ఆలోచిస్తున్నావ్ అని రామ్ అడుగుతాడు. దానికి సీత టీచర్‌ని చూస్తుంటే నాకు అనుమానంగానే ఉందని ఆవిడ సుమతి అత్తమ్మలా ప్రవర్తిస్తుందని అంటుంది సీత. 

రామ్: అలా ఎలా సీత అమ్మ ముఖం వేరు ఈ టీచర్ ముఖం వేరు కదా.
సీత: ఒకవేళ అత్తమ్మకు ఏదైనా అనుకోని ఘటన జరిగి ముఖం మారిపోయి ఉంటే. మారు రూపంలో తను ఇక్కడ ఉంటే.
రామ్: నీవన్నీ పిచ్చి ఆలోచనలు ఈ సీత. నీ ఆలోచనలకు ఎలాంటి ఆధారాలు లేవు..
సీత: ఉంది మామ. సుమతి అత్తమ్మ బతికే ఉంది కానీ ఇంటికి రావడం లేదు ఇంట్లో ఉన్న టీచర్ నిన్ను, ప్రీతిని తన పిల్లల్లా చూస్తుంది. మా అమ్మానాన్నల్ని తన సొంత అన్నావదినల్లా చూస్తుంది. నీకు తెలియని ఇంకో విషయం కూడా ఉంది. మొన్న అగ్రిమెంట్‌లో సంతకం చేసింది నేను కాదు టీచర్ గారు. ఆ రోజు మనం నిద్రపోతున్నప్పుడు ఆవిడ మన గదికి వచ్చి సంతకం చేశారు అందుకే నాకు ఆవిడ మీద అనుమానం వచ్చింది. అందుకే నేను నిన్న టీచర్‌కి ఇచ్చిన ఫోన్‌లో ఆటో రికార్డింగ్ పెట్టించా అందుకే పొద్దున్న ఆవిడ రౌడీతో మాట్లాడటం విని నిన్ను తీసుకొని ఆమెను ఫాలో అయింది.
రామ్: వద్దు సీత మా పిన్ని చేసిన తప్పు కంటే ఇది పెద్ద తప్పు. వద్దు ఇలా చేయొద్దు. నాకు అస్సలు ఇష్టం లేదు.
సీత: నిజం తెలిసిన తర్వాత ఆపేస్తా మామ అప్పటి వరకు నువ్వు ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్. 

విద్యాదేవి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది. దేవుడి దగ్గరకు వెళ్లి తన రూపం మారిపోవడం అదృష్టమో దురదృష్టమో తెలీడం లేదని ప్రస్తుతానికి తప్పించుకున్నా కానీ ప్రతీ సారి ఇలా అవుతుందో లేదో తెలీదని అనుకుంటుంది. తన గురించి ఎవరికీ నిజం తనంతట తాను చెప్పే వరకు తెలీదని అనుకుంటుంది. మరోవైపు జనార్థన్, గిరిధర్‌లు ధీనంగా ఆలోచిస్తూ ఉంటారు అక్కడికి మహాలక్ష్మీ,  అర్చనలు వచ్చి రేవతి, కిరణ్‌లు ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని కనీసం ఇద్దరన్నలు ఆపలేకపోతున్నారని తిడతారు. చిన్న పిల్ల అయితే ఓకే కానీ తనకేం చెప్పగలమని అంటారు. ఇక రేవతి, కిరణ్ వస్తారు. కాబోయే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వచ్చారని చలపతి అంటాడు. రేవతి వచ్చి మొదటి శుభలేక మీకే ఇవ్వాలని కిరణ్ వచ్చాడని చెప్తుంది. మహాలక్ష్మీ రగిలిపోతుంది. 

అన్నయ్య వదినా మీ చేతుల మీదుగా మా పెళ్లి జరగాలి మొదటి శుభలేక తీసుకోండి అని రేవతి, కిరణ్‌లు కలిసి అందరికీ శుభలేఖలు ఇస్తారు. పెళ్లి కార్డులో మహాలక్ష్మీ, జనార్థన్‌లతో పాటు శివకృష్ణ, లలితల పేర్లు రాయించారా అని సీత అడిగితే మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. ఇక అందరూ సీత, రామ్‌లను పొగిడేస్తారు. మహాలక్ష్మీ మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లికే రాము అని అంటే మా పేర్లు ఎందుకు రాయించారని అరుస్తుంది మహాలక్ష్మీ. ఏం ఏసినా ఈ పెళ్లికి రాము అని మహాలక్ష్మీ పెళ్లి కార్డు విసిరేస్తుంది. అది వెళ్లి దేవుడు దగ్గరున్న పసుపు కుంకుమలకు తగిలి కార్డు మీద పసుపు కుంకుమలు పడతాయి. సీత వెళ్లి చూసి దండం పెట్టుకొని ఆ కార్డు పట్టుకొని వస్తుంది. పెళ్లి ఇష్టం లేని మీరే ఈ జంటను ఆశీర్వించారని దైవసాక్షిగా పసుపు కుంకుమ అంటుకుందని చెప్తుంది. లలిత చాలా సంతోషిస్తుంది. 

జనార్థన్, గిరిధర్‌, అర్చనలు కూడా రాము అని ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని మాట్లాడుతారు. కిరణ్ మాత్రం ఈ పెళ్లి ఆగదు అని రేవతిని తీసుకొని వెళ్లిపోతుంది. సీత అందరినీ తిడుతుంది.  ఈ పెళ్లి జరగదని మహాలక్ష్మీ అంటే జరిగి తీరుతుందని సీత అంటుంది. ఇక సీత బిజినెస్ మంచిగా జరగడం చూసి మహా, అర్చనలు తిట్టుకుంటారు. అందరూ సీతని పొగిడేస్తారు. ఇద్దరూ రగిలిపోతారు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం నల్లపూసల్ని తాకిన విహారి.. కుటుంబం మొత్తం ఆశీర్వదించేసిందిగా, హోమంలో తప్పిదం ఎవరిది?

టాప్ హెడ్ లైన్స్

Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget