Seethe Ramudi Katnam Today October 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్ ఫ్రెండ్స్‌ని చితక్కొట్టిన లక్ష్మీ, సీత.. ఫోన్లో మాట్లాడి ప్రీతిని పడేసిన రాకేశ్!
Seethe Ramudi Katnam Today Episode ప్రీతికి రాకేశ్ కాల్ చేసి ప్రేమగా మాట్లాడి ఐలవ్యూ చెప్పి ప్రీతిని బట్టలో వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రాకేశ్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలవుతాడు. ప్రీతిని చూపించి పెళ్లి ఫిక్స్ అయిందని రాకేశ్‌తో చెప్తారు. నా గురించి తెలుసుకోకుండానే పిల్లని ఇస్తున్నారా అని అడుగుతాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ అని చెప్పామని నువ్వు మారడానికి ఇదో మంచి అవకాశం అని పద్ధతిగా పెళ్లి చేసుకో అని అంటారు. దానికి రాకేశ్ తన మూడ్ మారేలోపు పెళ్లి ఫిక్స్ చేయమని చెప్పి కార్ తీసుకొని వెళ్లిపోతాడు.
మరోవైపు ప్రీతి ఇంట్లో జరిగిన గొడవ అంతా తలచుకొని ఆలోచిస్తుంది. ఇంతలో విద్యాదేవి టీచర్ ప్రీతి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సంబంధం నీకు నచ్చిందా అని అడుగుతుంది. దానికి ప్రీతి మా పిన్ని ఇష్టమే నా ఇష్టం అని అంటుంది. అందుకు టీచర్ నీకు మనస్ఫూర్తిగా ఇష్టం అయితేనే చేసుకో లేదంటే వద్దని చెప్తుంది. నీ లైఫ్‌కి సంబంధించిన విషయం కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటుంది.
మహాలక్ష్మీ: అయ్యాయ మీ హిత బోధలు.
విద్యాదేవి: పిల్లలకు మంచి చెడు చెప్తే తప్పేముంది.
మహాలక్ష్మీ: మీకు ఆ అవసరం ఏంటి ప్రీతి పెళ్లి విషయంలో మీకు ఎందుకు ఇంత ఇంట్రస్ట్. ప్రీతి ఏదో మీ కన్న కూతురు అన్నట్లు ఫీలవుతున్నారు. మీరు సీత కోసం వచ్చారు. అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ప్రీతి విషయంలో దూరొద్దు. ప్రీతికి ఏది మంచి ఏది చెడో నాకు తెలుసు.
విద్యాదేవి: ప్రీతి కన్న తల్లి స్థానంలో ఉండి ఆలోచించడం కరెక్టే కానీ పంతానికి పోయి పెళ్లి చేయాలి అనుకుంటే తప్పు.
మహాలక్ష్మీ: ప్రీతి నీ మంచి గురించి అందరి కంటే ఎక్కువ ఆలోచించేది నేను నన్ను నమ్ము ఈ పెళ్లి అయితే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావ్.
రాకేశ్ ఓ చోట కారు ఆపి సిగరెట్ తాగుతూ ఫోన్‌లో మాట్లాడుతుంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మీ వస్తుంది. లక్ష్మీని చూసి అల్లరి చేయబోతే లక్ష్మీ నువ్వు మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చావా అని తిడుతుంది. ఇక లక్ష్మీ రాకేశ్‌ని కొడుతుంది. దాంతో రాకేశ్ తన ఫ్రెండ్స్‌తో దీని వల్లే నేను జైలుకి వెళ్లాను దీన్ని పట్టుకోండిరా గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్దాం అంటాడు. ఇక లక్ష్మీ వాళ్లతో పోరాడుతుంటుంది. ఇంతలో సీత అక్కడే చీరలు అమ్ముతూ గొడవ చూసి వస్తుంది. లక్ష్మీని రాకేశ్ పొడవబోతే అడ్డుకొని రాకేశ్ ఫ్రెండ్స్‌ని కొడుతుంది. లక్ష్మీ, సీత ఇద్దరూ రాకేశ్ ఫ్రెండ్స్‌ని కొడుతారు. రాకేశ్ రోగ్ అని జైలుకి పంపానని నా మీద పగపట్టాడని లక్ష్మీ సీతకు చెప్తుంది. దాంతో ఇద్దరూ రాకేశ్ దగ్గరకు వెళ్లే సరికి రాకేశ్ వెళ్లిపోతాడు. ఇక సీత, లక్ష్మీ ఇద్దరూ ఒకర్నొ ఒకరికి పరిచయం చేసుకుంటారు.
రాత్రి ప్రీతికి రాకేశ్ ఫోన్ చేస్తాడు. తాను రాఖీ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఫొటోలో చూడగానే ఎప్పడెప్పుడు చూస్తానా అని వాయిస్ బాగుందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు. లవ్‌లో పడిపోయానని నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయానని చెప్తాడు. ప్రీతి సిగ్గు పడుతూ ఉండటం సీత చూస్తుంది. రాఖీ ప్రీతికి ఐలవ్‌యూ చెప్తాడు. సీతని చూసి ప్రీతి ఫోన్ పెట్టేస్తుంది. రాకేశ్ ప్రీతి వలలో పడిందని అనుకుంటాడు. ఇక సీత వచ్చి ప్రీతికి సెటైర్లు వేస్తుంది. ఇక ప్రీతి ఆయన చాలా మంచి వారిగా ఉన్నారని అంటుంది. నా గురించి నిజాలు తెలిస్తే గుండె ఆగి చస్తావని అనుకుంటాడు రాకేశ్. ఇక సీత రామ్ దగ్గరకు వెళ్లి మీ ప్రీతి అప్పుడే లైన్‌లో పడిపోయిందని, హ్యాపీగా ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారని, ప్రీతి కాబోయే భర్తకి అప్పుడే సపోర్ట్ చేస్తుందని అంటుంది సీత. దానికి రామ్ మా పిన్ని సరైనా సంబంధమే తెచ్చిందని అంటాడు. దానికి సీత అబ్బాయి గురించి లోతుగా ఆలోచించాలని అంటుంది. అబ్బాయి గురించి అంతా తెలిశాకే మీ పిన్నిని పొగుడుతానని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.