అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విక్కీని చితక్కొట్టిన అమ్మాయిలు.. రౌడీతో ప్రీతి పెళ్లి.. ఇంట్లో వాళ్లకి రాకేశ్ బాగోతం తెలుస్తుందా!

Seethe Ramudi Katnam Today Episode అందరూ ప్రీతికి పెళ్లి చేద్దామని అనడంతో మహాలక్ష్మీ ఓ అమెరికా సంబంధం తేవడం అయితే అబ్బాయి రౌడీ జైలులో ఉన్నాడని తెలియకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతిని తన ఫ్రెండ్ విక్కీ బ్లాక్ మెయిల్ చేసిన సంగతి ప్రీతి సీతకు చెప్తుంది. సీత ప్రీతిని తీసుకొని విక్కీ చెప్పిన అడ్రస్‌కి బయల్దేరుతుంది. మహాలక్ష్మీ వాళ్లు ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని అడిగితే వచ్చి చెప్తానని అంటుంది. చెప్పమంటే చెప్పకుండా వెళ్తున్నావ్ ఏంటి అని జనార్థన్ అడిగితే ఇది ఆగి చెప్పాల్సిన టైం కాదని అంటుంది. ఇక రామ్ కిందకి రావడంతో అందరూ సీత ప్రీతిని తీసుకెళ్లడం లేదని అడిగితే చెప్పకుండా వెళ్తుందని అంటారు. 

జనార్థన్: నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే సీత ఇలా చేస్తుంది రామ్.
మహాలక్ష్మీ: ప్రీతిని సీత ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు అయినా చెప్పిందా రామ్.
రామ్: లేదు పిన్ని. ఎందుకు ఇలా చేసిందో తిరిగి వచ్చాక అడుగుతా.
విద్యాదేవి: మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సీత ప్రీతిని ఏం చేయదు.
అర్చన: మొన్నే కదా కిడ్నాప్ చేసింది. 
రామ్: ఇంతకీ సీత ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లినట్లు.

విక్కీ తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. విక్కీ ఫ్రెండ్స్ నీ ప్రీతి వస్తుందా అంటే తప్పకుండా వస్తుందని అంటాడు. ఇక మొన్నటిలా పోలీస్‌ మామతో వస్తే అని అంటే మీరు మామతో పెళ్లి చేసుకోండి నేను కోడలితో ఫస్ట్ నైట్ చేసుకుంటా అంటాడు. ఇంతలో సీత ప్రీతిని తీసుకొని వస్తుంది. ప్రీతి ఒక్కదాన్నే విక్కీ దగ్గరకు పంపుతుంది. విక్కీ వాళ్లు సీత, ప్రీతిని చూసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే సీత మరో నలుగురు అమ్మాయిల్ని తీసుకొస్తుంది. దానికి విక్కీ నా పాత గల్‌ఫ్రెండ్స్ అందర్నీ తీసుకొచ్చావని అంటాడు. ఇక సీత వాళ్లందరికీ కమాన్ అంటే వాళ్లు క్రికెట్ బ్యాట్‌లు తీసుకొని వస్తారు. విక్కీ ఇద్దరు ఫ్రెండ్స్ బయపడతారు. సీత విక్కీని పట్టుకొని చితక్కొడితే మిగతా అమ్మాయిలు మిగతా ఇద్దరినీ చితక్కొడతారు. ముగ్గురూ కుయ్యోమోర్రో అనుకుంటూ ప్రీతి కాళ్లు పట్టుకుంటారు. తర్వాత సీత ప్రీతిని తీసుకొని ఇంటికి వస్తుంది.

అందరూ సీతతో ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లావని ప్రశ్నిస్తారు. ప్రీతితో చీరలు అమ్మించడానికి తీసుకెళ్లావా అని అడుగుతారు.. మా పరువు తీసేస్తున్నావ్ అని జనార్థన్‌ అంటాడు. ఇక ప్రీతి వదిన మన పరువు కాపాడిందని జరిగిందంతా చెప్తుంది.  అందరూ షాక్ అవుతారు. మహాలక్ష్మీ వల్లే ఇదంతా అయిందని విక్కీకి ఆ చనువు ఇచ్చింది నువ్వే అని అంటుంది. ఇక ఎవరూ తనని అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకోవా అని సీత ప్రశ్నిస్తుంది. ఇక ఈ ప్రాబ్లమ్‌కి ప్రీతి పెళ్లి చేయడం సొల్యూషన్ అని అంటుంది. సీత కూడా పెళ్లి చేద్దామని అంటుంది. రామ్ కూడా అదే కరెక్ట్ అంటాడు. దానికి మహాలక్ష్మీ ప్రీతికి ఎప్పుడు ఎలా ఏం చేయాలో నాకు తెలుసని అంటుంది.  ఇక తనకు తెలిసిన పెద్ద సంబంధం ఉందని అంటుంది. దాన్ని ఫిక్స్ చేస్తానని అంటుంది.

ఉదయం ఇద్దరు దంపతులు మహాలక్ష్మీ ఇంటికి వస్తారు. ఇద్దరినీ మహాలక్ష్మీ, జనార్థన్ వాళ్లని పిలుస్తారు. తన కొడుకు రాకేష్‌కి ప్రీతికి పెళ్లి చేద్దామని అంటారు. రాకేష్ ఫొటో తీసుకుంటారు. ఇక ప్రీతి ఫొటోని వాళ్లకి ఇస్తారు. రాకేష్‌ రేపే వస్తాడని అనడంతో పెళ్లి చూపులు చేద్దామని అంటారు. ఇక వాళ్లు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటామని అంటారు. కట్ చేస్తే రాకేశ్ జైలులో ఉంటాడు. రాకేశ్ గొడవలు పడి అమ్మాయిలతో తిరుగుతూ విచ్చలవిడిగా ఉంటాడు. తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ ఉన్న వాళ్లు కావడంతో వాళ్లు రాకేశ్ అమెరికాలో ఉన్నాడని అందరికీ చెప్తుంటారు. అదే విధంగా మహాలక్ష్మీ వాళ్లకి కూడా రాకేశ్ అమెరికాలో  ఉన్నాడని చెప్పి పెళ్లి ఫిక్స్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి సపోర్ట్ చేస్తూ పిన్నికి షాక్ ఇచ్చిన రామ్.. ప్రీతికి బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget