Seethe Ramudi Katnam Today October 12th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి టీచర్‌ని కొట్టడానికి చేయొత్తిన మహాలక్ష్మీ అడ్డుకున్న జనార్థన్.. ట్విస్ట్ సూపర్!
Seethe Ramudi Katnam Today Episode జనార్థన్ సంతకం ఫోర్జరీ చేసిందని విద్యాదేవి టీచర్‌ని మహాలక్ష్మీ కొట్టడానికి చేయి ఎత్తడం ఇంతలో జనార్థన్ అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ సీతని కొడతాడు. విద్యాదేవి రామ్ దగ్గరకు వచ్చి తప్పు చేశావ్ అని అంటుంది. పిన్నిని ఎవరం ఎదిరించి మాట్లాడం అలాంటిది సీత తప్పుగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయానని అందుకే అలా కొట్టేశానని అంటాడు. దానికి విద్యాదేవి పిన్ని మీద ఇష్టం ఓకే కానీ సీతని అర్థం చేసుకో అని అంటుంది. సీత తన సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకుంటోంది తనకి నువ్వు అండగా ఉండాలి కదా అని అంటుంది. భర్తే తనని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని అంటుంది.
విద్యాదేవి: ఒకటి గుర్తు పెట్టుకో రామ్ ఆడదాన్ని అర్థం చేసుకున్న వాడు తన పక్కన ఉంటాడు. అర్థం చేసుకోని వాడు తన పక్కలో మాత్రమే ఉంటాడు. అర్థమైంది అనుకుంటా.
రామ్: సీత ఏడుస్తుంటే వెళ్తాడు. సీత వెళ్లిపోతుంటే ఆపుతాడు. మా పిన్నిని నువ్వు ఆవేశంలో నిందించావ్ అదే ఆవేశంలో నేను నిన్ను కొట్టాను. అయినా నువ్వు అలా మాట్లాడుండాల్సింది కాదు ముందు నాతో చెప్పాల్సింది. నీ కోసం నేను సపోర్ట్ చేశా కాదా అందరినీ నీ కోసం ఎదిరించా కదా. అందరి ముందు నువ్వు పిన్నిని అవమానిస్తే ఎలా నీకు సపోర్ట్ చేస్తా. సరే ఇక ఆ షాప్ గురించి మర్చిపో ఇంకా ఏదైనా బిజినెస్ చేయ్ నీకు నేను సపోర్ట్ చేస్తా.
సీత: నాకు నీ సపోర్ట్ చాలు మామ.
రామ్: ఈ చెంప మీదే కదా కొట్టాను అని ముద్దు పెట్టుకుంటాడు.
అర్చన: నువ్వు సూపర్ మహా సీత విషయంలో ఏం చేయలేవు అనుకున్నా కానీ కోలుకోలేని దెబ్బ కొట్టావ్. నాకు చాలా హ్యాపీగా ఉంది.
మహాలక్ష్మీ: నాకు ఇంకా హ్యాపీగా ఉంది అర్చన. రామ్ ఇంకా నా వైపు ఉన్నాడు. నీ మీద సీత నింద వేస్తే రామ్ తట్టుకోలేకపోయాడు. రామ్‌కి నేను అంటే ఎంత ఇష్టమో నాకు ఈ రోజు అర్థమైంది. రామ్‌ని అడ్డు పెట్టుకొని ఆ సీతని దెబ్బ మీద దెబ్బ కొడతాను.
అర్చన: ఆ సీత షాప్ మూయించావ్ రామ్ సీత నోరు మూయించావ్ ఇప్పుడేం చేస్తావ్ మహా.
మహాలక్ష్మీ: సీత ఏ కస్టమర్లను చూసి ఎగిరెగిరి పడిందో ఆ కస్టమర్లతోనే సీతని తిట్టిస్తా.
ఇద్దరు కస్టమర్లు సీత దగ్గరకు వస్తారు. టైంకి డెలివరీ ఇస్తానని చెప్పి షాప్ మూసేశావ్ అని మా చీరలు అయినా ఇవ్వు లేదంటే డబ్బు అయినా ఇవ్వు అని అంటారు. సీత రెండు రోజుల్లో సెటిల్ చేస్తా అంటుంది. మహాలక్ష్మీ సీతతో ఇంటికి వచ్చింది ఎవరు అని అడుగుతుంది. నీ బాధితులా అని అంటుంది. నీ వల్ల నా పరువు పోతుందని అంటుంది మహా. నీ మైండ్ బ్లాంక్ అయ్యే ఓ నిజం చెప్పనా నీ షాప్ సీజ్ చేయించింది నేనే అని మహాలక్ష్మీ అంటుంది. దాంతో సీత షాక్ అయిపోతుంది. రామ్‌కి ఈ నిజం చెప్తే నీ చెంప పగులు తుంది. ఇంతలో సీత మౌనంగానే ఎదగ మని అని పాట పాడి వెళ్లిపోతుంది. మహాలక్ష్మీ ఆలోచనలో పడుతుంది.
ఇక మహాలక్ష్మీ బయట ఉంటే కొందరు వచ్చి డొనేషన్ అడుగుతారు. మహాలక్ష్మీ డొనేషన్ చేయను అనేస్తుంది. ఫోన్ రావడంతో మహా వెళ్లిపోతుంది. అది చూసిన విద్యాదేవి వాళ్లని పిలిచి మహాలక్ష్మీ టెన్షన్ ఉందని డొనేషన్ తాను ఇస్తానని లక్ష రూపాయల చెక్ ఇస్తుంది. మహాలక్ష్మీ విద్యాదేవి డొనేషన్ ఇచ్చిన సంగతి తెలుసుకొని చెక్ తీసుకొని లోపలికి వెళ్తుంది. విద్యాదేవి అని అరుస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. మీ నాన్న సంతకం విద్యాదేవి టీచర్ ఫోర్జరీ చేసిందని అంటుంది. అమ్మవారి చందా కోసం వస్తే నేను ఇవ్వను అంటే విద్యాదేవి ఇచ్చిందని అందులో జనా సంతకం ఉందని అంటుంది. తనకు చెప్పకుండా జనా ఏం చేయడని చెప్పి రామ్‌కి చెక్ చూపిస్తుంది. జనానే చెక్ ఇచ్చాడని విద్యాదేవి చెప్తుంది. మోసం చేయొద్దని మహాలక్ష్మీ అంటే నువ్వే మోసం చేస్తావ్ అని అంటుంది టీచర్. దాంతో నన్నే అంత మాట అంటావా అని మహాలక్ష్మీ టీచర్‌ని కొట్టబోతే జనా అడ్డుకొని నేనే చెక్ ఇచ్చానని చెప్తాడు. అమ్మవారి గుడి కట్టడానికి చందా అడుగుతున్నారని సాయం చేయమని అడిగితే ఇచ్చానని అంటాడు. ఇక టీచర్‌కి సారీ చెప్పమని సీత అంటుంది. రామ్ కూడా సీతకే సపోర్ట్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.