Seethe Ramudi Katnam Serial Today October 10th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఇంకోసారి ఇలా చేస్తే వేరేలా ఉంటుంది.. మహాకి రామ్ స్ట్రాంగ్ వార్నింగ్!
Seethe Ramudi Katnam Today Episode రేవతి, కిరణ్‌లకు అందరూ పెళ్లి చేయడం ఇంటికి వచ్చిన మహాలక్ష్మీని రామ్ మొదటి సారి చాలా సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రిజిస్టర్ ఆఫీస్‌కు రేవతి, కిరణ్‌లతో పాటు అందరూ చేరుకుంటారు. రేవతి, కిరణ్‌లు సంతకాలు చేసిన తర్వాత కిరణ్ తరఫున శివకృష్ణ, లలితలు సంతకాలు చేస్తారు. అమ్మాయి తరఫున మహాలక్ష్మీ, జనార్థన్‌లకు చేయమని రామ్ చెప్తాడు. తప్పని పరిస్థితుల్లో ఇద్దరూ సంతకాలు చేస్తారు. చట్ట బద్ధంగా ఇద్దరికీ పెళ్లి అయిపోతుంది. ఇక సీత అక్కడే తాళి కట్టిస్తానని అంటుంది.
సీత అందరికీ అక్షింతలు ఇస్తుంది. కిరణ్ రేవతికి అందరి ముందు తాళి కడతాడు. మహాలక్ష్మీ అండ్ బ్యాచ్ కోపంతో ఏం చేయలేక చూస్తూ ఉండిపోతారు. తర్వాత కిరణ్, రేవతిలు ఇద్దరూ దండలు మార్చుకుంటారు. కొత్త జంటని అందరూ ఆశీర్వదిస్తారు. సీత, రామ్‌లకు ఇద్దరూ చాలా థ్యాంక్స్ చెప్తారు.
రామ్: మహాలక్ష్మీని చూస్తూ ఎవర్ని నమ్మాలో ఎవర్నీ నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరి మనవాళ్లో ఎవరు పరాయి వాళ్లో అర్థం కావడం లేదు.
సీత: ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ప్రేమే గెలుస్తుంది. ఇక అందరికీ చెప్పేసి కిరణ్ రేవతిని తీసుకొని వెళ్లిపోతాడు. సీత గంగాధర్, శివపార్వతిలకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. వాళ్లు కూడా వెళ్లిపోతారు. సీత తల్లిదండ్రులు కూడా వెళ్లిపోతారు. సీత వాళ్లు ఇంటికి వెళ్లిపోతారు.
మహాలక్ష్మీ: ఏంటి ఇది రామ్ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది. సీత నీ చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాళ్ల పెళ్లి చేసింది ఇదేమైనా పద్ధతిగా ఉందా.
రామ్: మరి మీరు చేసింది పద్ధతిగా ఉందా. పెళ్లి ఆపడానికి మీరు రేవతి అత్తయ్యని కిడ్నాప్ చేయడం మంచి పద్ధతా.
విద్యాదేవి: అలా అడుగు రామ్ సీత చేసింది తప్పు అయితే వీళ్లు చేసింది కరెక్టా.
రామ్: మీ సొంత చెల్లిని బంధించి బాధ పెట్టారు కదా నాన్న.
మహాలక్ష్మీ: ఈ పెళ్లి ఆపుతామని మేం ముందే చెప్పాం నువ్వు జరిపిస్తా అన్నావ్ మధ్యలో పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావ్.
జనార్థన్: ఆ రౌడీలు వీళ్లని ఏమైనా చేసుంటే ఏమై ఉండేది.
గిరిధర్: ఆ కిరణ్ కంటే ముందు నిన్ను అరెస్ట్ చేయించాల్సింది.
రామ్: ఆపండి ప్రీతి, ఉషల్ని కిడ్నాప్ చేసింది రౌడీలు కాదు సీత ఫ్రెండ్స్ మీరు రేవతి అత్తయ్యని దాచిన తర్వాత తను చేసింది. ఇంట్లో జరిగిన కోపాల్ని పగలా తీసుకోవద్దని సీత చెప్పింది కాబట్టే ఇలా మాట్లాడుతున్నా లేదంటే వేరేలా ఉండేది. మీరు రేవతి పిన్నిని ఇంట్లోనే దాచి పెట్టారు. మళ్లీ ఏం తెలియనట్లు నటించారు. పైగా కిరణ్ గారిని అరెస్ట్ చేయించారు.
ఇక సీత ప్రీతి ఉషలతో రౌడీలు తమను జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పిస్తుంది. తప్పు లు చేసి ఈ పెళ్లి ఆపాలి అనుకున్నారని ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టి వార్నింగ్ ఇస్తాడు రామ్. మహాలక్ష్మీ పై సీత గెలిచిందని చలపతి అంటాడు. సీతతో పెట్టుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందని సీత అంటుంది. ఇక సీత రిలాక్స్ అవుతానని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు మహాలక్ష్మీ గదిలోకి వెళ్లి ఆలోచనలో పడుతుంది. అర్చన వచ్చి నువ్వు ఎన్ని చేసినా సీతని గెలవలేవని నువ్వు సీతతో కాంప్రమైజ్ అయిపో అని మహాలక్ష్మీకి చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ అర్చన మీద కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: దీపక్ ఇద్దరి పెళ్లాల కొట్లాట.. కారులో రాజు, రూపలను సూర్యప్రతాప్ చూసేస్తాడా!