Seethe Ramudi Katnam Serial Today May 8th : 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌ని కాపాడింది సుమతే అని తెలుసుకున్న మహాలక్ష్మి.. మధుని గదిలో పెట్టి లాక్ చేసిన సీత!
Seethe Ramudi Katnam Serial Today Episode : సుమతికి రక్తం అవసరం అవ్వడంతో రామ్ సేమ్ గ్రూప్ అని తన రక్తాన్ని తల్లికి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode : రామ్‌ని లారీ ఢీ కొట్టబోతే సుమతి రామ్‌ని కాపాడి తాను ట్రాన్సఫార్మర్ మీద పడిపోతుంది. ఈ ఘటనలో సుమతి ముఖం మొత్తం కాలిపోతుంది. రామ్ సుమతి తన తల్లి అని గుర్తు పట్టలేకపోతాడు. సుమతిని తీసుకొని హాస్పిటల్‌లో ఎడ్మిట్ చేస్తాడు. ఇక సీత కూడా వస్తుంది. సీత ఫార్మాలిటీ ఫాంలో సుమతి రామ్‌కు తల్లి అవుతుందని చెప్తుంది.
రామ్: ఫార్మాటిటీ ఫాంలో అమ్మ పేరు ఎందుకు రాయించావు సీత.
సీత: తాను నీకు అమ్మే మామ. సుమతి అత్తమ్మ నీకు జన్మనిస్తే నీ ప్రాణాలు కాపాడి ఆవిడ నీకు పునర్జన్మ నిచ్చింది అందుకే ఆవిడ నీకు అమ్మ అని అన్నాను. ఫార్మాలిటీ ఫాంలో అత్తమ్మ పేరు రాయించాను.
రామ్: మంచి పని చేశావ్ సీత. నేను ఇంకా ఆవిడకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలి అనుకున్నా దాని వల్ల లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి.
సీత: తన ప్రాణాలు తెగించి నిన్ను కాపాడిన ఆవిడ బతకాలి మామ. ఆవిడ కోలుకునే వరకు మనం తోడుగా ఉండాలి.
రామ్: అలాగే సీత.. ట్రీట్మెంట్‌కు ఎంత ఖర్చు అయినా భరిద్దాం. ఆవిడ రుణం తీర్చుకోలేం. ఆవిడ నా ప్రాణాలు కాపాడిందని పిన్నికి తెలిస్తే పిన్ని ఎన్ని డబ్బులు అయినా ఇస్తుంది.
మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. తనకు వచ్చిన మెసేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని కలవాలి అనుకున్న మనిషి ఎందుకు కలవలేదని అనుకుంటుంది. ఇక అర్చన వచ్చి ఏమైందని అడిగితే సుమతి పేరు మీద ఒక మెసేజ్ వచ్చిందని అంటుంది.
అర్చన: సుమతి అక్క ఎప్పుడో చనిపోయింది కదా మహా. నీకు మెసేజ్ రావడం. మెసేజ్‌లో ఉన్న లోకేషన్‌కు వెళ్తే అక్కడికి ఎవరూ రాకపోవడం ఇదంతా చూస్తుంటే నిన్ను ఎవరో కావాలనే ఆటపట్టించడానికే ఇదంతా చేశారని అనిపిస్తుంది మహా.
మహాలక్ష్మి: ఆ అవసరం ఎవరికి ఉంది.
అర్చన: ఇంకెవరు ఆ సీతే. సుమతి గురించి ఆరాటపడుతుంది అదే కదా. ప్రతీ రోజూ అదే ఏదో ఒకటి చేసి సుమతిని గుర్తుకు చేస్తుంది. ఇది కూడా అదే చేసుంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకు.
మహాలక్ష్మి: మనసులో.. ఇది కచ్చితంగా ఆ సీత పనే. నేనే ఊరికే ఏవేవో ఆలోచిస్తున్నాను.
ఇక సుమతికి బ్లడ్ అవసరం అయితే రామ్ తనది సేమ్ బ్లడ్ గ్రూప్ అని తాను ఇస్తాడని అంటాడు. ఇక డబ్బులు కట్టాలని నర్స్ చెప్పడంతో రామ్ సీతని ఇంటికి పంపించి డబ్బు తీసుకురమ్మని చెప్తాడు. సీత ఇంటికి వెళ్తుంది. డబ్బు కోసం వెతుకుతుంది. ఇక మధుమిత ఐదు లక్షలు తన గదిలో ఉందని చెప్తుంది. అయితే రామ్ చెప్తే కానీ నీకు ఇవ్వనని మధుమిత చెప్తుంది. దీంతో సీత ఒప్పుకోదు. మధుమిత తాను ఆఫీస్ మనిషినని ఇవ్వనని రామ్‌కానీ మహాలక్ష్మి కానీ చెప్తేనే ఇస్తానని అంటుంది.
ఇక సీత మధుమితని తోసేసి డబ్బు తీసుకుంటుంది. దీంతో మధు సీతని అడ్డుకుంటుంది. ఇక సీత మధుని తోసేసి డబ్బు తీసుకొని మధుమితని రూంలో లాక్ చేసేస్తుంది. ఇక మహాలక్ష్మి బ్యాచ్ అంతా ఇంటికి వస్తారు. సీత బ్యాగ్‌లో డబ్బులు సర్దుతుండగా.. మహాలక్ష్మిని ఢీ కొట్టేస్తుంది. దీంతో డబ్బులు గురించి మహా సీతని అడుతుంది.
మహాలక్ష్మి: చూసుకోవా.. ఢీ కొట్టేస్తావా.. అయినా ఈ డబ్బులు ఏంటి ఇంట్లో ఎవరూ లేరు అని దొంగతనంగా తీసుకెళ్లిపోతున్నావా.
జనార్థన్: సొంత ఇంటిలో దొంగతనం చేయడానికి సిగ్గు లేదా సీత. నువ్వు చాలా మంచి దానివి అనుకున్నా ఇలాంటి దానివా..
గిరధర్: పోలీసుడు కూతురివై ఇలా దొంగతనం చేస్తావా. నిజంగా మీ నాన్న పోలీసేనా లేక దొంగ పోలీసా.
సీత: ఇంక ఆపుతారా. నేనేదే టెన్షన్‌లో కామ్‌గా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు ఏంటి.
రేవతి: ఏమైంది సీత. ఎందుకు టెన్షన్.
సీత: మామను ఒకావిడ యాక్సిడెంట్ నుంచి కాపాడి తను ప్రమాదంలో పడింది పిన్ని. ఇప్పుడు తను ప్రాణాపాయంలో ఉంది. మామ ఆవిడకి రక్తం ఇస్తున్నాడు. డబ్బు తీసుకురమ్మని చెప్తే నేను తీసుకెళ్తున్నా.
మహాలక్ష్మి: ఎవరో ముక్కూ ముఖం తెలియని మనిషి కోసం ఇంత డబ్బు తీసుకెళ్లడం ఏంటి.
అర్చన: ఎవరో తెలీనామె కోసం ఖర్చు పెట్టాలా.
సీత: మీరు ఏంటి. మామ అంటే ప్రాణం అంటారు. మామకి ప్రమాదం తప్పింది అంటే ఆ ప్రమాదం ఏంటి. మామ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతారు అనుకున్నా ఆ విషయం మర్చిపోయి డబ్బులు గురించి అడుగుతున్నారు. మీకు ఆయన కంటే డబ్బులు ఎక్కువైపోయాయి.
రేవతి: అవును సీత ఈ ఇంట్లో డబ్బులకే విలువ. రామ్ ఆస్తి రాయించుకోవాలి అనుకున్న వారు రామ్‌ని ఏం పట్టించుకుంటారు.
జనార్థన్: ఆపుతావా రేవతి.. ఏం జరిగింది సీత.
సీత జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం చెప్తుంది. రామ్ డబ్బుల కోసం పంపాడని చెప్తుంది. ఆవిడ ఎవరని అడిగితే సుమతి గారు అని సీత చెప్తుంది. ఆ పేరు వినగానే మహాలక్ష్మి కంగారు పడుతుంది. ఆవిడ పేరు సుమతి కాదు అని ఆవిడ వివరాలు తెలీయక సుమతి అని పేరు రాయించాను అని చెప్తుంది.
ఇక సీత, మధుమిత అడ్డుకుంటే లోపల పెట్టి తలుపు గడియ వేశాను అని ఎవరైనా వెళ్లి తీయండని చెప్తుంది. ఇక ఆవిడ నిజంగా వేరే మనిషా లేక ఆవిడ సుమతినా అని అర్చనను అడుగుతుంది. తనకు ఎందుకు అనుమానంగా ఉందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.