Seethe Ramudi Katnam Serial Today May 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మితో సీత ఛాలెంజ్.. వారంలో మధు, సీతలలో ఇంటి నుంచి వెళ్లేది ఎవరు? రామ్‌కి దక్కేది ఎవరు?
Seethe Ramudi Katnam Serial Today Episode : ప్రీతి, ఉషలతో పోటీ పడి సీత గెలిస్తే మధుని ఇంటి నుంచి పంపేస్తాను అని లేదంటే తాను వెళ్లిపోతానని సీత ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode : ఉష, ప్రీతిలు భరత నాట్యం చేయడంతో సీత అడ్డుకుంటుంది. మహాలక్ష్మితో గొడవ పెట్టుకుంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. తాను శ్రద్ధ పెడితే నాలుగు రోజుల్లో భరత నాట్యం నేర్చుకొని వీళ్ల కంటే బాగా చేయగలను అని అంటుంది.
గిరిధర్: అసలు భరతనాట్యం అంటే ఏంటో తెలుసా నీకు.
జనార్థన్: నాలుగు రోజులు కాదు కదా నాలుగు జన్మలెత్తినా నువ్వు భరతనాట్యం చేయలేవు.
మహాలక్ష్మి: అయినా వీధి పోరాటాలు చేసే నీకేం తెలుసు పవిత్ర మైన భరతనాట్యం గురించి వెళ్లి నీ పని నువ్వు చూసుకో.
సీత: మనసు పడితే రానిది ఏదీ ఉండదు. నేను వీధిలో పోరాటమూ చేయగలను వేదికపై నాట్యం చేయగలను.
మహాలక్ష్మి: అంత ఓవర్ యాక్షన్ చేయకు నాట్యం చేయడం నీ వల్ల కాదు.
సీత: చేసి చూపిస్తాను.
మహాలక్ష్మి: అంటే ప్రీతి ఉషలతో సమానంగా చేయగలను.
సీత: వాళ్లను మించి చేస్తాను. వాళ్లకంటే బాగా చేసి గెలుస్తాను. అది నాకు చిటికెలో పని.
మహాలక్ష్మి: అయితే పందెం పెట్టుకుందామా..
సీత: ఓకే.
మహాలక్ష్మి: ఓకే నీకు వారం రోజులు టైం ఇస్తున్నా నువ్వు భరత నాట్యం నేర్చుకొని ప్రీతి ఉషలతో పోటీ పడాలి. పందెంలో గెలవాలి.
సీత: నేను రెడీ.
మహాలక్ష్మి: పందెం ఏంటో తెలిసా. పోటీలో ఓడిపోతే నువ్వు రామ్‌ని ఈ ఇంటిని వదిలి వెళ్లిపోవాలి. వెళ్తావా.
రేవతి: వద్దు సీత.
చలపతి: నీ భవిష్యత్‌తో చెలగాటం వద్దు సీత.
మహాలక్ష్మి: ఏంటి సీత ఆలోచిస్తున్నావ్ పోటీలో ఓడిపోతా అనుకుంటున్నావా.
సీత: నేను ఒప్పుకుంటున్నాను. నేను ఓడిపోతే మామను ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోతాను. మరి ప్రీతి, ఉషలు ఓడిపోతే మీరు మా అక్కని ఈ ఇంటి నుంచి పంపేస్తారా.
మహాలక్ష్మి: డన్ సీత. కానీ ప్రీతి ఉష ఓడిపోరు. మీ అక్క ఇక్కడే ఉంటుంది. నువ్వు మాత్రం వెళ్లిపోతావ్. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్‌కి తెలీకూడదు.
సీత: నేను అదే చెప్తున్నా. పందెం గురించి చెప్తే మా అక్కని పంపడానికి మామ ఒప్పుకోరు. ఇది మన మధ్యే ఉండాలి. మన మధ్య పోటీ జరుగుతుందని మామకు చెప్పను.
మహాలక్ష్మి: అలా అని ఒట్టు వేసి చెప్పు.
సీత: నేను ఒట్టు వేస్తాను. మరోవైపు సుమతి ఇంటి వైపు వస్తుంటుంది. మా సుమతి అత్తయ్య సాక్షిగా చెప్తున్నా ఆ దేవుడు రాసిన రాతను మీరు తిరగరాయబోతే మీ రాతను నేను తిరగరాస్తాను. గుర్తు పెట్టుకోండి ఓడేది మీరు గెలిచేది నేను.
సుమతి మహాలక్ష్మి తనకు చేసిన మోసం గురించి తలచుకొని బాధపడుతుంది. కోపంతో రగిలిపోతుంది.
సుమతి: నమ్మకంగా ఉంటూ నన్నే మోసం చేస్తావా మహాలక్ష్మి. నా ఇద్దరి మేనకోడళ్ల జీవితాలు నాశనం చేస్తావా. నీ బుద్ధి తెలీక నీ సంరక్షణలో నా భర్త, పిల్లలు క్షేమంగా ఉన్నారని నమ్మి వదిలి వెళ్లాను. నీ మోసం తెలిసి మళ్లీ తిరిగి వచ్చాను. నీ అంతు తేల్చుతాను. అనుకుంటుంది. ఇంతలో మహాలక్ష్మి అక్కడ మాట్లాడటం చూస్తుంది. నీ కంటే ఊసరవెల్లి నయం కదే. నమ్మక ద్రోహానికి పరాకాష్ట నువ్వు. నా రూపం మారిపోయింది మహాలక్ష్మి. నేను బతికే ఉన్నాను అని నువ్వు గ్రహించలేవు. నాకు నువ్వు చేసిన ద్రోహానికి నా మేనకోడళ్లకు చేస్తున్న అన్యాయానికి నేను ప్రతీ కారం తీర్చుకొనే తీరుతాను. నీకు దూరంగా ఉండి కాదో నీ పక్కనే ఉంటూ పగ తీర్చుకుంటాను. ఎలా అయితే నువ్వు నా పక్కనే ఉండి నన్ను మోసం చేశావో అలాగే నిన్ను శిక్షిస్తాను. ఎలాగైనా ఇంట్లోకి వస్తాను. అప్పుడు నీ ఆట కట్టిస్తాను మహాలక్ష్మి.
చలపతి సీత దగ్గరకు వచ్చి పందెం కట్టి తప్పు చేశావని అంటాడు. దాంతో సీత తన అక్క సమస్యకు ఇది పరిష్కారం అని అంటుంది. చలపతి ఇది పెద్ద ప్రమాదమని జీవితం ఏమైపోతుందో అని భయపడతారు. ప్రీతి ఉషలకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం చేయడం వచ్చని నీకు వారంలో అది సాధ్యం కాదు అని అంటాడు. అయితే సీత తాను త్వరగా నేర్చుకుంటాను అని అంటుంది.
ప్రీతి, ఉషలు మధుమిత దగ్గరకు వెళ్తారు. మధు సంతోషంగా ఉన్నారేంటి అని అడుగుతుంది. దీంతో మహాలక్ష్మి అక్కడికి వచ్చి వారంలో సీత పర్మినెంట్‌గా వెళ్లిపోతుందని చెప్తుంది. మహాలక్ష్మి భరతనాట్యం పందెం గురించి మధుకి చెప్తుంది. మధు షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.