Seethe Ramudi Katnam Serial Today May 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్ : రామ్ దగ్గరకు వెళ్లిన మధుమిత.. ఇచ్చిపడేసిన సీత, సుమతికి మహాలక్ష్మి సర్జరీ చేయనిస్తుందా!
Seethe Ramudi Katnam Serial Today Episode : రామ్‌కి ఫీవర్ రావడంతో మధుమిత ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్లడంతో సీత మధుని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode : మధుమిత పబ్బుకెళ్లడానికి ఉష, ప్రీతిలతో కలిసి కిందకి వస్తుంది. రేవతి, చలపతిలు సెటైర్లు వేస్తారు. ఇక ఉష, ప్రీతిలు మధుని వదినా అంటూ ప్రేమగా పిలిస్తే రేవతి, చలపతిలు సీత మీ వదినా మధుమిత కాదు అని అంటారు. సీతని ఎప్పుడైనా ప్రేమగా వదినా అని పిలిచారా అని ప్రశ్నిస్తాడు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికి వస్తుంది.
మహలక్ష్మి: సీత ఆ అర్హత ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు ప్రీతి, ఉషలతో వదినా అని పిలిపించుకునే అర్హత మధుమితకి మాత్రమే ఉంది.
రేవతి: సీతకి లేని అర్హత కొత్తగా మధుకి ఉన్న ఆ అర్హత ఏంటో చెప్పు వదినా..
మహలక్ష్మి: కొత్తగా మధు ఏ అర్హత సాంధించుకోలేదు. రామ్ మొదటగా చూసింది.. ఇష్టపడింది మధునే. నేను కోడలు అని ఫిక్స్ అయింది మధునే. ఈ ఇంట్లో అందరూ అంగీకరించింది కూడా మధునే.
చలపతి: కానీ రామ్ సీతని పెళ్లి చేసుకున్నాడు. సీత ఈ ఇంటి కోడలు.
మహలక్ష్మి: సీత మధ్యలోనే వచ్చింది మధ్యలోనే వెళ్లిపోతుంది. పిల్లలు అన్నట్లు మధుమిత తొందర్లోనే నా కోడలు అవుతుంది. మీకు పబ్‌కి టైం అయింది మీరు వెళ్లండి. ఇందాక ఏదో అంటున్నావ్ రేవతి. అలా ఎలా జరుగుతుంది అనా.. అలాగే జరుగుతుంది. నేను జరిపిస్తా. రామ్ మధులను ఒకటి చేస్తా.. నేను ఈ రేవతిని ఆమె ప్రియుడిని విడదీయలేదా. నువ్వు నీ పెళ్లాం పిల్లల్ని దూరమై నా ఇంట్లో ఉండటం లేదా. అలాగే సీతని కూడా పంపేస్తా.
రేవతి: అందరూ మాలా ఉండరు వదినా.. సీత ఇక్కడ. నీ లాంటి వంద మంది మహలక్ష్మిలు వచ్చానా సీతని రామ్‌ని దూరం చేయలేరు.
మహలక్ష్మి: రామ్ సీతని విడదీయడానికి వంద మంది అవసరం లేదు ఈ ఒక్క మహాలక్ష్మి చాలు.
రాత్రి మహాలక్ష్మి, జనార్థన్, గిరిధర్‌లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. మధు కాస్త మొహమాటంగా వస్తుంది. ఇక మహాలక్ష్మి, జనార్థన్‌లు మధుకి వడ్డించమని అంటారు. ప్రీతి, ఉషలు కూడా కూర్చొంటారు. ఇక రామ్‌కి జ్వరం అని భోజనానికి రాలేను అని చెప్పాడని అంటారు.
సడెన్‌గా జ్వరం ఏంటి నేను వెళ్లి చూస్తానని జనార్థన్ అంటే వద్దు అని మహాలక్ష్మి మధుమితకి ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్లమని చెప్తారు. దీంతో మధు వెళ్తుంది.
రామ్ తలకు తడిగుడ్డు చుట్టి ఉంటుంది సీత. ఇక సీత రామ్‌కి కషాయం ఇచ్చి తాగమని అంటుంది. రామ్ చేదుగా ఉందని అంటాడు. రాత్రి ముద్దు ఇచ్చానని ఇప్పుడు తనకు ముద్దు ఇవ్వమని రామ్ అంటాడు. సీత రామ్‌లు ముద్దుల గురించి మాట్లాడుతూ ఉంటే మధు ట్యాబ్లెట్స్ పట్టుకొని వచ్చి వాళ్ల మాటలను అలా వింటూ ఉంటుంది. సీత బలవంతంగా రామ్‌తో కషాయం తాగిస్తుంది. సీత రామ్‌కి ముద్దు పెట్టుకోవడం చూసి మధు వెనక్కి వెళ్లిపోతుంది. ఇంతలో సీత బయటకు వస్తుంది. మధుని చూస్తుంది.
సీత: నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అక్క.
మధు: రామ్‌గారికి జ్వరంగా ఉంది అంటే ట్యాబ్లెట్స్ పట్టుకొని వచ్చాను.
సీత: నా భర్తకు జ్వరంగా ఉంటే నువ్వు ట్యాబ్లెట్స్ తీసుకురావడం ఏంటి.
మధు: ఏ రామ్‌గారికి బాలేకపోతే నేను ఆ మాత్రం పట్టించుకోకూడదా.
సీత: మధు చేతిలో ట్యాబ్లెట్స్ విసిరి కొడుతూ.. నువ్వు ఆలోచించాల్సింది నా భర్త గురించి కాదు. నీ భర్త సూర్య బావ గురించి..
మధు: సీత..
సీత: ఏంటే అరుస్తున్నావ్.. నేను నీ కంటే గట్టిగా అరవగలను.
మధు: ఏంటే సాటి మనిషికి సాయం చేయడం కూడా తప్పేనా.
సీత: నా భర్తని చూసుకోవడానికి నేను ఉన్నాను. నువ్వు దూరంగా ఉండు అర్థమైందా.
మధు: అంత అర్థం కాకుండా నేను ఏం లేను. మహలక్ష్మి గారు చెప్పారని వచ్చాను.
సీత: చెప్పడానికి ఆవిడ ఎవరు చేయడానికి నువ్వు ఎవరు.
మధు: నన్ను ఆవిడని అనే హక్కు నీకు లేదు సీత. ఆవిడ రామ్ గారి పిన్ని నీ కంటే ముందు నుంచి రామ్ గారి బాగోగులు పట్టించుకుంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే రామ్ గారే నన్ను ఆపారు. నాకు సారీ చెప్పారు. అందుకే నేను ఆయనకు బాలేదు అంటే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాను.
సీత: ఇందాక మహలక్ష్మిగారు చెప్తే వచ్చాను అన్నావు. నువ్వు ఆవిడ మాటలు విని తప్పుడు దారిలో అడుగులు వేస్తున్నావు అని అర్థమైంది. అది నీకు మంచిది కాదు.
మధు: నా మంచి చెడులు గురించి నీకు ఎందుకు నీ పని నువ్వు చేసుకో.
సీత: అదే నేను నీకు చెప్తున్నా. నేను ఈ ఇంట్లో చేస్తున్న పోరాటం నా హక్కుల కోసం అదే నేను నీతో నా భర్త కోసం పోరాటం మొదలు పెడితే అది తేల్చుకోవడానికి నేను ఎంత దూరం అయినా వెళ్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. నా కాపురంలో చిచ్చు పెడితే చీరేస్తాను.
మహాలక్ష్మి: ఏమైంది మధు.
మధు: మీరు నాకు రామ్ కోసం ట్యాబ్లెట్లు ఇవ్వమని చెప్పారు. కానీ సీత నన్ను అనకూడని మాటలు అనేసి వెళ్లిపోయింది.
మహాలక్ష్మి: సీతలో నేను కోరుకునేది అలాంటి ఆవేశమే. సీత నిన్ను తిట్టిందని నువ్వు బాధ పడకు. ఆవేశంలో మనిషి తప్పటడుగులు వేస్తారు. సీత కూడా తప్పటడుగులు వేస్తుంది.
మధు: అది ఆవేశంలో అనలేదు అండి ఆలోచించే మాట్లాడింది.
మహాలక్ష్మి: సీత సంగతి తర్వాత చూద్దాం. ముందు రామ్‌ని చూద్దాం పద. రామ్ పడుకొని ఉండటం చూసి రేపు మాట్లాడుదాం పద అని మధుని తీసుకొని వస్తుంది.
మరోవైపు శివకృష్ణ కుటుంబం మొత్తం సుమతి కోసం ఆలోచిస్తూ కంగారు పడుతుంటారు. ఇక శివకృష్ణ సుమితిని తలచుకొని ఏడుస్తాడు. ఏమైందని లలిత అడిగితే సుమతి గుర్తొస్తుందని సుమతి ఏమైపోయిందా అని అంటాడు. లలిత శివకృష్ణకు ధైర్యం చెప్తుంది.
ఇక డాక్టర్ సుమతి రిపోర్ట్స్ చూసి అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయని ఇంట్లో వాళ్లతో మాట్లాడి సర్జరీకి వెళ్లాదమని అంటుంది. ఇక రామ్ ఫోన్‌కి డాక్టర్ కాల్ చేస్తుంది. రామ్ పడుకొని ఉండటంతో అక్కడే ఉన్న మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సుమతి గురించి చెప్తుంది. దీంతో మహాలక్ష్మి రామ్‌కి బాలేదు అని రెండు మూడు రోజులు ఎక్కడికీ రాలేడని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.