![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Seethe Ramudi Katnam Serial Today May 10th Episode: 'సీతే రాముడి కట్నం' సీరియల్: బ్యాగ్ సర్దేసి బయల్దేరిన మధు.. లేటు అయినా మంచి పని చేశావని అక్కని ఆడేసుకున్న సీత
Seethe Ramudi Katnam Serial Today Episode మధుమిత తనకు విలువ లేని ఇంట్లో ఉండలేను అని మహాతో చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Seethe Ramudi Katnam Serial Today May 10th Episode: 'సీతే రాముడి కట్నం' సీరియల్: బ్యాగ్ సర్దేసి బయల్దేరిన మధు.. లేటు అయినా మంచి పని చేశావని అక్కని ఆడేసుకున్న సీత seethe ramudi katnam serial today may 10th episode written update in telugu Seethe Ramudi Katnam Serial Today May 10th Episode: 'సీతే రాముడి కట్నం' సీరియల్: బ్యాగ్ సర్దేసి బయల్దేరిన మధు.. లేటు అయినా మంచి పని చేశావని అక్కని ఆడేసుకున్న సీత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/10/62d846167fecbf9b456bfb11f83ef07e1715322568397882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Seethe Ramudi Katnam Today Episode రామ్ సుమతికి బ్లడ్ ఇస్తాడు. ఇక సీత రౌడీ పని పట్టి డబ్బు తీసుకొని హాస్పిటల్‌కి వస్తుంటుంది. రామ్ సుమతి దగ్గరకు వచ్చి అమ్మా మీరు ఎవరో నాకు తెలీదు. కానీ నా ప్రాణాలు కాపాడటానికి మీ ప్రాణాలు అడ్డుపెట్టారు. సీత చెప్పనట్లు మీరు నాకు పునర్జన్మనిచ్చారని అనుకుంటాడు.
రామ్: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మ. నన్ను కన్న నా తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నన్ను కాపాడిన మీరు అయినా ప్రాణాలతో ఉండాలమ్మ. మీరు నాకు దేవతతో సమానం. మీరు బతకాలి అమ్మా. నిండు నూరేళ్లు బతకాలి. మీరు కళ్లు తెరిచాక మీకు మేం థ్యాంక్స్ చెప్పాలి.
సీత: మీరు నా భర్త ప్రాణాలు కాపాడారు. మీకు ఏం కాదు మిమల్ని ఆ దేవుడు బతికిస్తారు.
రామ్: సీత డబ్బులు తీసుకొచ్చావా. పద కౌంటర్‌లో పే చేద్దాం.
డాక్టర్ రామ్‌ని పిలిచి సుమతికి ఇంకా కొన్ని టెస్ట్‌లు చేయాలని అప్పుడే కండీషన్ చెప్తామని అంటుంది. ఇక సీతరామ్‌లు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తామని అంటారు. ఇక సీత రామ్‌లు డబ్బు కట్టి ఇంటికి బయల్దేరుతారు. మరోవైపు మహాలక్ష్మి వాళ్లు రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మహాలక్ష్మి: రామ్.. నీకు ఏదో పెద్ద ప్రమాదం తప్పిందని సీత చెప్పింది నీకు ఏం కాలేదు కదా రామ్.
అర్చన: నీకు ఏమైనా అయిందేమో అని మేం చాలా టెన్షన్ పడ్డాం రామ్.
సీత: అందరూ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఈ రియాక్షన్ ఇందాక ఆయనకు ప్రమాదం తప్పింది అన్నప్పుడు చూపించలేదేం. అప్పుడు నార్మల్‌గా ఉండి ఇప్పుడు ఏంటి ఇంత యాక్ట్ చేస్తున్నారు.
రేవతి: అప్పుడు నీతో రామ్ లేడు కదా సీత. రామ్ ఉన్నప్పుడే వాళ్లు రియాక్ట్ అవుతారు.
మహాలక్ష్మి: రామ్ మీద మాకు చాలా ప్రేమ ఉంది. అది అన్ని సార్లు బయటకు చూపాల్సిన అవసరం లేదు. రామ్ నిన్ను కాపాడింది ఎవరు. ఆమెకు ఇప్పుడు ఎలా ఉంది.
రామ్: ఎవరో తెలీదు పిన్ని. నన్ను కాపాడి ఆవిడ ప్రమాదంలో పడింది. ఆవిడ గురించి ఏం తెలీదు. రేపు ఆవిడ స్ఫృహలోకి వస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి.
సీత: ఆవిడ ఎవరైనా సరే ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్న ఈ రోజుల్లో తన ప్రాణాలకు తెగించి మామ ప్రాణాలు కాపాడింది. అందుకే ఆవిడకి సుమతి అత్తమ్మ పేరు పెట్టాను.
మహాలక్ష్మి: దారిన పోయిన ప్రతీ ఒక్కరు సుమతి కాలేరు సీత.
సీత: కానీ ఆయన ప్రాణాలు కాపాడిని వారు సుమతి అత్తయ్యతో సమానమే కదా అత్తయ్య.
జనార్థన్: మహా కూడా ఒకప్పుడు రామ్, ప్రీతిలను ప్రమాదం నుంచి కాపాడింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోతే మహా ఆ మంటలకు భయపడకుండా రామ్, ప్రీతిలను కాపాడింది.
సీత: నాకు ఎందుకో మహాలక్ష్మి అత్తయ్య అంత పెద్ద సాహసం చేసింది అంటే నమ్మకం కలగడం లేదు.
మహాలక్ష్మి: నీ నమ్మకంతో నాకు పనిలేదు. నేనే ఏంటో రామ్‌కి తెలుసు. రామ్ ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది. నువ్వు రక్తం ఇచ్చావని తెలిసింది. రామ్ నీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను.
రామ్: పిన్ని ఆవిడ ట్రీట్మెంట్ కోసం ఐదు లక్షలు కట్టాను.
మహాలక్ష్మి: ఐదు లక్షలు కాకపోతే కోటి రూపాయలు ఇద్దాం రామ్. నీ ప్రాణం కంటే అవేమీ ఎక్కువ కాదు.
సీత: మామ నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇందాక డబ్బు తీసుకొని వస్తుంటే రౌడీ అడ్డుపడ్డాడు. నేను డబ్బు తీసుకొని వస్తున్నట్లు ఆ రౌడీకి ఎలా తెలుసో ఏంటో.
రేవతి: ఏముందమ్మా దొంగలకు దొంగలు మంచి ఫ్రెండ్స్ కదా. ఏ దొంగో చెప్పుంటారు.
రామ్: ఆ దొంగని నువ్వు గుర్తు పడతావా సీత. పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం.
సాంబ: అవసరం లేదు బాబు సీతమ్మ కొట్టిన దెబ్బలకు ఆ దొంగకి ఇక పోలీసుల ట్రీట్మెంట్ అవసరం లేదు.
ఇక సీత చేతికి దెబ్బ తగిలిందని తెలుసుకున్న రామ్ ప్రేమగా సీతని తమ గదికి తీసుకెళ్లాడు. అది చూసి మహా బయటకు వెళ్లిపోతుంది. సీత గాయానికి రామ్ మందు పూస్తాడు. ఇక అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావని సీతని రామ్ అంటే.. నీ ప్రాణాలు కాపాడిన ఆవిడ డబ్బులు లేక చనిపోయి ఉంటే నేను జీవితాంతం బాధ పడేదాన్ని అని అంటుంది సీత.
మరోవైపు మహాలక్ష్మి బ్యాచ్ అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మధుమిత బ్యాగ్ తీసుకొని వస్తుంది. అందరూ షాక్ అయి నిల్చొంటారు. మధుమిత వెళ్లిపోతున్నాను అని చెప్తుంది. ఎందుకని జనార్థన్ అడిగితే విలువలేని ఇంట్లో నేను ఉండలేను అని సీత తనని పురుగును చూసినట్లు చూస్తుందని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తుందని అందుకే వెళ్లిపోతాను అని అంటుంది. ఇంతలో సీత వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అక్కా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: త్రినయని' సీరియల్ ప్రోమో: గాయత్రీ పాప చేతిలో బంగారు కొబ్బరికాయ.. బిత్తరపోయిన విశాల్, నయని!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)