అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 2nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్ ముందు అడ్డంగా బుక్కైన సీత.. మధుమితని తన ఇంటికి తెచ్చుకోవడానికి మహాలక్ష్మి మాస్టర్ ప్లాన్!

Seethe Ramudi Katnam Serial Today Episode మధుమితని తన ఇంటి కోడలిగా తెచ్చుకోవడానికి సూర్యని కాపాడుతాను అని మహాలక్ష్మి పల్లెటూరు బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సూర్య విషయంలో తనకి సాయం చేయమని అడిగిని మహాలక్ష్మి కన్నింగ్‌గా మాట్లాడింది అని సీత రామ్‌కి  చెప్తుంది. రామ్ నమ్మకుండా తన పిన్ని దగ్గరే తేల్చుకుందామని సీతని తీసుకొని కిందకి వస్తాడు. అక్కడ అర్చన, గిరిధర్‌లు మహాలక్ష్మి సీతతో ప్రేమగా మాట్లాడింది అని సూర్య సమస్య పరిష్కరిస్తాను అని చెప్పిందని అంటారు. 

సీత: ప్రేమగా కాదు నాతో కన్నింగ్‌గా మాట్లాడింది.
గిరిధర్: ఏంటి సీత వదిన మీద అంత పెద్ద నింద వేస్తున్నావ్. 
అర్చన: సీతకు మహా సాయం చేస్తాను అంది అదే నిజం.
చలపతి: నిజం అంటూ అబద్దం చెప్తున్నావ్ ఏంటి చెల్లమ్మ.. 
రామ్: మీరు ఆగండి మామయ్య. అసలు డాడీ పిన్ని ఎక్కడ. వాళ్లని పిలవండి..
గిరిధర్: వాళ్లు ఇంట్లో లేరు రామ్..
రామ్: ఎక్కడికి వెళ్లారు.
అర్చన: మధుమిత ప్రాబ్లమ్‌ సాల్వ్ చేయడానికి పల్లెటూరికి వెళ్లారు. 
సీత: ఏంటి మీరు చెప్పేది అత్తయ్య మామయ్య మా ఊరికి వెళ్లారా..
గిరిధర్: మీ అక్క ఉండేది మీ ఊరిలోనే కదా.. మీ బావని అరెస్ట్ చేసింది కూడా మీ ఊరిలోనే కదా.. ఇందాక సీత వచ్చి సూర్యని కాపాడమని ఏడుస్తూ వదినకు చెప్పింది. దీంతో వదిన సీతకి ధైర్యం చెప్పి పల్లెటూరు వెళ్లింది. 
సీత: అబద్ధం ఇందాక అత్తయ్య నాతో అలా మాట్లాడలేదు. సంబంధం లేని విషయాలు మాట్లాడింది. ఇప్పుడు వీళ్లు మాట మార్చేస్తున్నారు. 
అర్చన: ఏమైంది సీత నీకు నువ్వు ఏడ్చి బతిమాలితే కదా మహా మీ ఊరు వెళ్లింది. నీకు సాయం చేసే ఉద్దేశం లేకపోతే మహా మీ ఊరు ఎందుకు వెళ్తుంది. 
గిరిధర్: నీకు సాయం చేస్తాను అని చెప్పే కదా మహా మీ ఊరు వెళ్లింది. అది మర్చిపోయి నువ్వేంటి మాట మార్చుతున్నావ్. 
అర్చన: ఏంటి రామ్ సీత నీకు వేరే ఏమైనా చెప్పిందా.. మహా సాయం చేయను అని చెప్పిందా.. 
రేవతి: సీత కాదు మీరే రామ్ ముందు ఒకలా.. సీత ముందు ఒకలా ప్రవర్తిస్తున్నారు. 
అర్చన: నటించాల్సిన అవసరం లేదు రేవతి. నువ్వు అనవసరంగా గొడవలు పెట్టకు. 
సీత: దారుణమైన మనుషులు మీరు.. అవతల వారి కష్టాలు చూసి ఆనందపడే రాక్షసులు మీరు.
రామ్: స్టాపిట్ సీత.. అంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడావు అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందాక మా పిన్ని మీద నిందలు వేశావు. ఇప్పుడు వీళ్లని అనకూడని మాటలు అంటున్నావ్.. పిచ్చి ఏమైనా పట్టిందా నీకు...
చలపతి: ఇదంతా వీళ్ల డ్రామా రామ్..
రామ్: ఆపండి మామయ్య. మీ వల్ల అత్తయ్య వల్ల సీత ఇలా తయారైంది. మీరిద్దరూ సీతని పొల్యూట్ చేస్తున్నారు. సీత నీకు తెలిసినవి నిజాలు కావు. ప్రతీ సారి మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావ్. మా పిన్ని నీకు సాయం చేస్తున్నా చేయలేదు అని నాతో అబద్దం చెప్పావ్. ఇంకోసారి ఇలా చేశావు అంటే నిన్ను నేను క్షమించను. గుర్తుపెట్టుకో. 

శివకృష్ణని తన తల్లి సూర్య గురించి అడుగుతుంది. సూర్యని విడిపించే ఏర్పాట్లు చేయమని చెప్తుంది. దీంతో శివకృష్ణ సీరియస్ అవుతాడు. మధు స్టేషన్ దగ్గర అందరి ముందు తనని అవమానించింది అని చెప్తాడు. మధుకి మనం కావాలి అంటే ఆ నేరస్తుడిని వదిలేయమని అంటాడు. అలా ఎలా అవుతుంది అని అతని భార్య అంటుంది. మధుకి తల్లిదండ్రులు కావాలి భర్త కూడా కవాలి అని ఇప్పుడు మధు కష్టంలో ఉందని మనమే ఆదుకోవాలి అని ఇంట్లో వాళ్లు శివకృష్ణకి చెప్తారు. నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొని పోలీసుగా గెలిచాను అని సాయం చేయమని చేతులెత్తి మొక్కిన కూతురికి ఏ సాయం చేయలేని తండ్రిగా ఓడిపోయానో తెలీడం లేదని అంటాడు.

శివకృష్ణ: సూర్యని పెళ్లి చేసుకొని మధు తప్పు చేసింది అని నాకు ముందు నుంచే అనిపిస్తుంది. ఆ తప్పును బలపరుస్తూ ఇప్పుడు సూర్య నేరం చేశాడు. ఆ నేరాన్ని సమర్థిస్తూ మధు తప్పు చేస్తుంది. నాకేం చేయాలి అర్థం కావడం లేదు. పోలీస్‌గా సూర్యని విడిచిపెట్టలేను. తండ్రిగా మధుని వదులుకోలేను. దాన్ని చూస్తే బాధేస్తుంది. వాడిని చూస్తుంటే కోపం వస్తుంది. నా పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు. 
శవతల్లి: బాధ పడకు శివ ఎలా జరగాలి అని రాసుంటే అది జరుగుతుంది. నువ్వు బాధ పడకు.
శివకృష్ణ: ఇది చాలా పెద్ద కేసు. ఎవరూ ఇలాంటి కేసులో తల దూర్చడానికి ఇష్టపడరు. ముందుకురారు..

అర్చన మహాలక్ష్మికి కాల్ చేస్తుంది. ఇంటి దగ్గర జరిగినదంతా మహాకి చెప్తారు. సీతకి రామ్ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చాడని చెప్తారు. ఇక మహాలక్ష్మి మధుని తీసుకొని వస్తానని చెప్తుంది. దీంతో అర్చన హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటామని అంటుంది.

జనార్థన్: అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావ్ మధు మనతో వస్తుందా మహా.
మహాలక్ష్మి: మధుకి మనతో రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒప్పుకోకపోయినా ఒప్పిస్తా.. వచ్చేలా చేస్తా. . 
జనార్థన్: శివకృష్ణ మనకు అడ్డుపడితే.. మనల్ని ప్రశ్నిస్తే.. ఏం జవాబు చెప్తాం.
మహాలక్ష్మి: మనం చెప్పం మధుతో చెప్పిస్తాం. మధు శివని ఎదురించేలా చేస్తాను. 

మరోవైపు సీత మహాలక్ష్మి మాటలు తలచుకొని నిజంగా తన ఊరు వెళ్లిందా లేక తిట్టించడానికే అలా చేసిందా అని ఆలోచిస్తుంది. ఇక రేవతి, చలపతి సీత దగ్గరకు వచ్చి ఓదార్చుతారు. మహా వాళ్లు కచ్చితంగా తన ఊరు వెళ్లుంటారు అని రేవతి చెప్తుంది. సీత షాక్ అవుతుంది. మీ అక్క మనసు మార్చి తన వైపు తిప్పుకుంటుంది అని చలపతి, మహాలక్ష్మి సీతకు చెప్తారు. సీతని కూడా ఊరు వెళ్లమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌ మార్చి 2nd: మాన్షి ప్లాన్ సక్సెస్ - ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వర్ధన్ కుటుంబం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
Embed widget